బిగ్‌బాస్ రియాలిటీ షో అప్పుడే ఐదోవారం ఎండింగ్‌కు వచ్చేసింది. ఇక వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే చాలు.. నాగార్జున ఎంట్రీతో మామూలుగా ఉండదు. ఇక ఈ వారం ఎలిమిషన్‌తో పాటు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఉండడంతో మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సారి దాదాపు ఐదుగురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రోమో రిలీజ్ కాగా.. ఇవాల్టి ఎపిసోడ్‌పై మరింత ఆసక్తి పెరిగింది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కన్‌ఫామ్ కావడంతో ఎవరనే విషయంపై ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. తాజాదా రిలీజైన ప్రోమోలో వారి ఫేస్‌లు చూపించారు. ఇక్కడే కంటెస్టెంట్స్ చిన్నపరీక్ష పెట్టాడు. ఆ మాస్క్ వెనక ఎవరు ఉన్నారో చెప్పాలని అడిగాడు. అయితే దాదాపు గెస్ చేయలేకపోయారు. అయితే వైల్డ కార్డ్ కంటెస్టెంట్స్‌ను హౌస్‌లో ఉన్నవారిపై తమ అభిప్రాయాలు చెప్పాలని నాగ్ కోరాడు. అయితే ఇక్కడ అందరూ ఏకధాటిగా షాలిని టార్గెట్ చేశారు.
హౌస్‌లో షాలిని అసలు గేమ్ ఆడటం లేదని అన్నారు. రోహిత్‌ను అడ్డుపెట్టుకుని గేమ్ ఆడుతోందని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లలో ఒకరు అన్నారు. దీనికి షాలిని బదులిస్తూ.. హౌస్‌లోకి వచ్చాకా చూసుకుందాం అంటూ గట్టిగానే స్పందించింది. దీంతో ఈ ప్రోమో చూస్తుంటే ఇవాల్డి ఎపిసోడ్ ఫుల్ ఇంట్రెస్టింగ్‌గా ఉండనుందని అర్థమవుతోంది. మరోవైపు మనకున్న సమాచాపం ప్రకారం శివ కుమార్, సాక్షి నాయుడు, డాక్షి గుత్తికొండ, నీతూ నటరాజ్, రామకృష్ణ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఈ రోజు క్లారిటీ రానుంది.


