రామాయణం ఆధారంగా నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ సినిమా ‘రామాయణ’. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటించారు. ‘రామాయణ పార్ట్ 1’ని ఈ నవంబరు 5న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
దసరా నవరాత్రులు తొలి రోజును పురస్కరించుకుని, ‘యే రామ్ కే యుగ్ కా ఆరంభ్ హై’ (ఇది రాముడి యుగానికి ఆరంభం) అనే క్యాప్షన్‌తో ఆదివారం ‘రామాయణ’ తొలి భాగం విడుదల తేదీని తెలి పారు మేకర్స్. మలి భాగం వచ్చే ఏడాది దీ పావళి సందర్భంగా రిలీజ్ కానుంది. ‘‘నవంబరు 5 నుంచి ‘రామాయణ’ తొలి భాగం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రీమియం ఫార్మాట్స్‌లో రిలీజ్ కానుంది. భారత్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం.
ఐమ్యాక్స్ ఫార్మాట్‌లోనూ ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. భారతదేశం మినహా ప్రపంచవ్యాప్తంగా ‘రామాయణ’ తొలి భాగాన్ని సోనీ పిక్చర్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ పంపిణీ చేస్తోంది’’ అని యూనిట్ పేర్కొంది. నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్.


