బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ ఐదో వారం ముగిసింది. ఈ వారాంతం ఎపిసోడ్ చాలా ఉత్కంఠగా సాగింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీతో హౌస్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. అదే క్రమంలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా జరిగింది. అపూర్వ ఎలిమినేట్ కాగా.. ఆమెతో పాటు మరో కంటెస్టెంట్ హౌస్‌కు సెండాఫ్ ఇచ్చేశాడు. ఇంతకీ ఆ వివరావేంటో చూసేద్దాం.
వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని ముందే ప్రకటించడంతో ఎవరెవరు అనే దానిపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ముందుగా ఊహించనట్లుగానే ప్రియాంక జైన్ ప్రియుడు, బుల్లితెర నటుడు శివ కుమార్ హౌస్‌లో అడుగుపెట్టారు. బైక్‌పై ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిగా అనిపించింది. శివతో పాటు నీతూ నటరాజ్, దక్ష గుత్తికొండ, శ్వేతానాయుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
చివరి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా శ్రీకాకుళంకు చెందిన కామనర్ ఎంట్రీ ఇచ్చాడు. నవరసాలు రామకృష్ణకు హౌస్ మేట్స్ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. హోస్‌లో వస్తూనే నరేశ్, రోహిత్‌పై అభిమానం చాటుకున్నారు. నాగార్జున బ్యాడ్జెస్‌ను ఒకటి నరేశ్‌కు ఇవ్వగా.. మరొకటి రోహిత్‌కు ఇచ్చిన ఎలిమినేషన్ నుంచి సేవ్ చేశాడు.
డబుల్ ఎలిమినేషన్..
ఈ వారం ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఆడియన్స్ ఓటింగ్ ఆధారంగా అపూర్వ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. ఆ తర్వాత చివర్లో ఇద్దరు మాత్రమే నామినేషన్స్‌లో మిగిలారు. షాలినితో పాటు చరణ్ మాత్రమే ఎలిమినేషన్‌లో లిస్ట్‌లో నిలిచారు. వీరిలో ఎవరిని హౌస్‌లో ఉంచాలా? అనే విషయంలో ఓటింగ్ నిర్వహించారు నాగ్. ఇద్దరితో ఎవరైతే హౌస్‌లో ఉండాలని భావిస్తున్నారో వారి పేరు రాసి బాక్స్‌లో వేయాలని సూచించారు.
ఈ ఓటింగ్‌లో 11 మంది పార్టిసిపేట్ చేయగా.. షాలినికి 10 ఓట్లు, చరణ్‌కు కేవలం ఒక్క ఓటు మాత్రమే పడింది. దీంతో చరణ్ హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. బయటికి వచ్చే సమయంలో చరణ్ ఎమోషనల్ అయ్యారు. నా వల్ల ఎవరైనా హార్ట్ అయితే క్షమించాలని కంటెస్టెంట్స్‌ను కోరారు. బయటికి వచ్చిన చరణ్‌ను నాగ్ హత్తుకుని సెండాఫ్ ఇచ్చారు. అలా ఈ వారాంతం ఎపిసోడ్ ముగిసింది. ఇక దశవతారం కాన్సెప్ట్‌లో భాగంగా ఈ వారంలో రోడ్ బ్లాక్ అనే కొత్త టాస్క్ పరిచయం చేశారు.


