పెళ్లిపై అనుపమ షాకింగ్‌ కామెంట్స్‌ | Anupama Shocking Comments About Marriage And Having Kids At Crazy Kalyanam Movie Event | Sakshi
Sakshi News home page

Anupama Comments About Marriage: మీకు పెళ్లి అయింది కదా.. ఎలా ఉంది మరి: అనుపమ

Oct 12 2026 3:06 PM | Updated on Oct 12 2026 3:48 PM

Anupama Shocking Comments About Marriage And Having Kids At Crazy Kalyanam Movie Event

అనుపమా పరమేశ్వరన్, నరేష్‌ వీకే, తరుణ్‌ భాస్కర్, అఖిల్‌ ఉడ్డెమారి ప్రధాన  పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ కల్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్‌ మోహన్‌రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. ఈ మేరకు  తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన నరేష్ నేటితరం పెళ్లిళ్లు, బంధాలపై తనదైన శైలిలో స్పందించారు. ఇప్పుడీ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

 పెళ్లి చెసుకోకపోయినా..
‘ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం చాలా కష్టంగా మారింది. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా పెళ్లిళ్లు కావడం లేదు. గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కేవలం పెళ్లి కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేయడం, ఆ తర్వాత విడాకుల కోసం మళ్లీ కోర్టుల చుట్టూ తిరుగుతూ  అంతే డబ్బు ఖర్ఛు చేస్తున్నారు. ఇప్పుడు సహజీవనం కూడా చట్టబద్ధం అయిపోయింది. అందుకే కనీసం పెళ్లి చెసుకోకపోయినా పిల్లలు అయినా కనండి’ అని యువతని ఉద్దేశించి మాట్లాడారు.

ఇదే ప్రశ్నను అనుపామ పరమేశ్వరన్‌ ని అడగ్గా.. ‘ మీ పెళ్లి అయ్యి రెండు నెలలే అవుతుంది కదా. అందుకే ఇంత క్యూరియాసిటీ ఉంది. ముందు మీ పెళ్లి లైఫ్‌ ఎలా ఉందో చెప్పండి. మీరే చెప్పండి..పెళ్లి చేసుకోవాలా వద్దా? అని అనుపమ ఓ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 26 సినిమాలు.. ఆ ఐదు మిస్ అవ్వొద్దు)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement