పెళ్లి మీద నా అభిప్రాయం అదే! | Anupama Parameswaran about Crazy Kalyanam movie | Sakshi
Sakshi News home page

పెళ్లి మీద నా అభిప్రాయం అదే!

Oct 16 2026 5:41 AM | Updated on Oct 16 2026 5:41 AM

Anupama Parameswaran about Crazy Kalyanam movie

‘‘క్రేజీ కళ్యాణం’ సినిమా చూసి మా అమ్మ, నాన్న చాలా బాగుందని ప్రశంసించారు. వాళ్లకు తెలుగు భాష రాకున్నా సినిమాలోని భావోద్వేగానికి బాగా కనెక్ట్‌ అయ్యారు. ప్రేక్షకులకు మా సినిమా వాళ్ల ఇంటి కథలా అనిపిస్తుంది. దసరా పండగ సీజన్‌లో ఒక క్రేజీ ఫిలిం చూసిన అనుభూతి కలుగుతుంది’’ అని హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ తెలిపారు. నరేశ్‌ విజయకృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్‌ భాస్కర్, అఖిల్‌ రాజ్‌ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. భద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్‌మోహన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజ్‌ అవు తోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో అనుపమ పరమేశ్వరన్‌ పంచుకున్న విశేషాలు...  

⇒ ‘క్రేజీ కళ్యాణం’ కథని భద్రప్ప చెబుతుంటే కొన్నిసార్లు నవ్వొచ్చింది, కొన్ని సీన్స్‌కు ఎమోషనల్‌ అయ్యాను. స్క్రిప్ట్‌తో పాటు దర్శకుడిగా భద్రప్ప జెన్యూన్‌ అ్రపోచ్‌ నచ్చి ఈ సినిమా ఒప్పుకున్నాను. ఈ సినిమాకు ముందు వేరే వర్కింగ్‌ టైటిల్‌ అనుకున్నాం. షూటింగ్‌ చేస్తున్నప్పుడు ప్రతిదీ క్రేజీగా అనిపించడంతో మా డైరెక్టర్‌ ‘క్రేజీ కళ్యాణం’ అని టైటిల్‌ పెట్టారు. వినోదం, భావోద్వేగాలున్న కథ ఇది. నరేశ్‌గారు, అఖిల్, తరుణ్‌ భాస్కర్‌.. ఇలా మేమంతా కాస్టింగ్‌లో జాయిన్‌ అయ్యాక ఇది మరింత క్రేజీ ్రపాజెక్ట్‌ అయ్యింది.  

⇒  ఈ సినిమాలో మా క్యారెక్టర్స్‌ అన్నీ ఇబ్బందులు పడుతుంటాయి. అవి ప్రేక్షకులకు వినోదంగా అనిపిస్తాయి. మా పాత్రల ద్వారా, ఆ సందర్భాల ద్వారా సహజమైన వినోదం వస్తుంటుంది. తరుణ్‌ భాస్కర్‌ చేసిన బాలరాజు క్యారెక్టర్‌లో చాలా వినోదం ఉంటుంది. మా డైరెక్టర్, ప్రోడ్యూసర్‌ జగన్‌గార్లు కూడా కొంతవరకు బాలరాజులే (నవ్వుతూ). పెళ్లనేది ఇద్దరు కలిసి సంతోషంగా జీవించడానికి చేసుకునేది. కానీ, అమ్మాయిని ఇంట్లో పని మనిషిని చేసేందుకు కాదు అనేది నా పాత్ర కీర్తి ఉద్దేశం. వ్యక్తిగతంగానూ నా ఒపీనియన్‌ అదే. ఈ సినిమాలో నాకు పెళ్లి అవుతుందా? లేదా అనేది తెరపై చూడాలి. ఈ సినిమాలోలా మా ఇంట్లో నా పెళ్లి గురించి ఏమాత్రం ఒత్తిడి లేదు. ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడాను. జగన్‌ మోహన్‌ రెడ్డిగారిలాంటి క్రేజీ ప్రోడ్యూసర్‌ లేకుంటే ఈ సినిమా ఇంత బాగా మన ముందుకు వచ్చేది కాదు.  
⇒  నటిగా నేనెప్పుడూ వెర్సటైల్‌గా ఉండాలని ప్రయత్నిస్తుంటాను. నా సినిమాలన్నీ ఒకేలా ఉన్నాయని ప్రేక్షకులు అనుకోకూడదు. నా పాత్ర చూసి సినిమా పేరు చె΄్పాలి. అంత ప్రత్యేకంగా సినిమాలు ఉండేలా కథలు ఎంచుకుంటాను. ‘క్రేజీ కళ్యాణం’లో నేను చేసిన కీర్తి పాత్ర కూడా ప్రత్యేకంగా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. నేనెప్పుడూ డబ్బుల కోసం నటించాలనుకోను. కొత్తగా ప్రయత్నించాలన్నది నాప్యాషన్‌. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా, తమిళంలో రెండు, మలయాళంలో మూడు, హిందీలో ఓ సినిమా చేస్తున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement