ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్
బర్మింగ్‌హామ్: భారత క్రీడాకారిణి శ్రుతి లక్ష్మీనారాయణన్ మరోసారి తన సత్తా చాటుకుంది. ప్రపంచ బిలియర్స్ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడో ఏడాది మహిళల విభాగంలో విజేతగా నిలిచి ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. గురువారం జరిగిన ఫైనల్లో తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల శ్రుతి 414–153 పాయింట్ల తేడాతో ఇవా పాల్మియస్ (స్వీడన్)పై గెలుపొందింది. 2024, 2025లలోనూ చాంపియన్‌గా నిలిచిన శ్రుతి లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది.
గతంలో భారత్ నుంచి చిత్ర మాగిమైరాజ్ (2 సార్లు), అనూజా ఠాకూర్, రేవణ్ణ ఉమాదేవి, స్నేత్రా బాబు ఒక్కోసారి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచారు. మరోవైపు ఇదే వేదికపై జరిగిన పురుషుల ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్షిప్ ఫైనల్లో భారత దిగ్గజం పంకజ్ అద్వానీ 1906–1206 పాయింట్ల తేడాతో రాబ్ హాల్ (ఇంగ్లండ్)పై గెలిచి విజేతగా నిలిచాడు.


