శభాష్‌ సౌరవ్‌  | Sourav Kothari has clinched the IBSF Billiards World Championship 2026 | Sakshi
Sakshi News home page

శభాష్‌ సౌరవ్‌ 

Apr 30 2026 5:35 AM | Updated on Apr 30 2026 5:35 AM

Sourav Kothari has clinched the IBSF Billiards World Championship 2026

వరుసగా రెండోసారి ప్రపంచ బిలియర్డ్స్‌ టైటిల్‌ సొంతం 

కార్లో (ఐర్లాండ్‌): భారత ప్లేయర్‌ సౌరవ్‌ కొఠారి సంచలనం సృష్టించాడు. వరుసగా రెండో ఏడాది ప్రపంచ బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌ (టైమ్‌ ఫార్మాట్‌)లో టైటిల్‌ సాధించాడు. బుధవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సౌరవ్‌ కొఠారి 1133–477 పాయింట్ల తేడాతో భారత్‌కే చెందిన 19 సార్లు ప్రపంచ చాంపియన్‌ పంకజ్‌ అద్వానీపై గెలుపొందాడు. నిరీ్ణత మూడు గంటలపాటు జరిగిన ఫైనల్లో సౌరవ్‌ ఏ దశలోనూ పంకజ్‌కు అవకాశం ఇవ్వలేదు. 

విజేతగా నిలిచిన సౌరవ్‌ కొఠారికి 5,000 డాలర్లు (రూ. 4 లక్షల 74 వేలు), రన్నరప్‌ పంకజ్‌కు 2,500 డాలర్లు (రూ. 2 లక్షల 37 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గత ఏడాది ఇదే వేదికపై జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సౌరవ్‌ 725–480 పాయింట్ల తేడాతో పంకజ్‌ అద్వానీనే ఓడించడం గమనార్హం. ‘మా నాన్న కోసం ఈ టైటిల్‌ సాధించాలని అనుకున్నాను. ఈ ఏడాది ఆరంభంలో మా నాన్న కన్నుమూశారు. ఈ విజయం మా నాన్నకే అంకితం’ అని విజయానంతరం 41 ఏళ్ల సౌరవ్‌ వ్యాఖ్యానించాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement