లూథియానా: దిగ్గజ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ పూల్ నేషనల్స్‌లో కూడా సత్తా చాటాడు. తొలిసారి ఈ టోర్నీలో పాల్గొన్న పంకజ్ 10 బాల్ పూల్ ఈవెంట్‌లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో పంకజ్ (పీఎస్‌పీబీ) 11–9 స్కోరుతో పుష్పేందర్ సింగ్ (ఆర్‌ఎస్‌పీబీ)ని ఓడించాడు.
ఒక దశలో 0–3తో వెనుకబడి పంకజ్ కోలుకొని స్కోరును 3–3తో సమం చేయడంతో పాటు ఆ తర్వాత వేగంగా దూసుకుపోయాడు. మహిళల విభాగంలో చిత్ర మగిమైరాజ్ టైటిల్ సొంతం చేసుకుంది.


