స్వతంత్రకు ఒకరోజు పోలీస్‌ కస్టడీ  | Influencer sent to one-day police custody in Jantar Mantar assault case | Sakshi
Sakshi News home page

స్వతంత్రకు ఒకరోజు పోలీస్‌ కస్టడీ 

Sep 6 2026 5:26 AM | Updated on Sep 6 2026 5:26 AM

Influencer sent to one-day police custody in Jantar Mantar assault case

న్యూఢిల్లీ: కాక్రోచ్‌ జనతా పార్టీ డిమాండ్‌తో శుక్రవారం అరెస్ట్‌ అయిన హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌ స్వతంత్ర భారద్వాజ్‌కు ఢిల్లీ కోర్టు శనివారం ఒకరోజు పోలీస్‌ కస్టడీ విధించింది. పోలీసులు స్వతంత్ర భరద్వాజ్‌ను శనివారం మధ్యాహ్నం ఢిల్లీ అదనపు సెషన్స్‌ జడ్జి సౌరభ్‌ ప్రతాప్‌ సింగ్‌ లలేర్‌ నివాసంలో హాజరుపరిచారు. స్వతంత్ర తరఫున వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా హాజరైన న్యాయవాది తన వాదనలు వినిపించారు. 

అనంతరం న్యాయమూర్తి అతడికి ఒక రోజు పోలీస్‌ కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చారు. వాస్తవానికి ఇతడిని పాటియాలా హౌస్‌కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉండింది.  నీట్‌ ప్రశ్న పత్రాల లీకేజీపై కాక్రోచ్‌ జనతాపార్టీ నేతృత్వంలో జూలై 20న ఆందోళన సందర్భంగా ఓ మైనర్‌ బాలిక తండ్రి సంజయ్‌పై దాడి చేశారన్న ఆరోపణలపై భారద్వాజ్‌పై కేసు నమోదైంది. దీంతోపాటు అతడిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద, క్రిమినల్‌ బెదిరింపులకు పాల్పడటంపై కూడా కేసులు నమోదైనట్లు ఎఫ్‌ఐఆర్‌ ద్వారా తెలిసింది. అంతేకాకుండా పోక్సో చట్టం కింద మరో కేసు నమోదైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement