ఉత్తరప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
జంతర్‌మంతర్ వద్ద విద్యార్థి తండ్రిపై దాడి చేసినట్లు ఆరోపణలు
అరెస్టు చేయాలని పోలీసు స్టేషన్ ఎదుట సీజేపీ కార్యకర్తల ఆందోళన
భరద్వాజ్‌కు రాజకీయ రక్షణ లభిస్తోందని రాహుల్ గాంధీ ధ్వజం
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన సందర్భంగా ఓ విద్యార్థి తండ్రిపై తాను దాడి చేశానని, తల పగులగొట్టానని చెప్పుకున్న హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షెహర్ జిల్లాలో అతడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
అంతకుముందు ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధినేత, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్, ఎంపీ పప్పు యాదవ్‌లతో కలిసి కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. స్వతంత్ర భరద్వాజ్‌ను అరెస్టు చేయాలని పట్టుబట్టారు. 72 గంటల్లో అతడిని అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో సీజేపీ కార్యకర్తలు నిరసన విరమించారు. తర్వాత గంటల వ్యవధిలోనే స్వతంత్ర భరద్వాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
అసలేం జరిగింది?
పేపల్ లీకేజీపై జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు జూన్ 23న ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థిని నిషూ ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్ ఫోన్‌లో రికార్డు చేస్తుండగా వాగ్వాదం మొదలైంది. ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయనపై దాడి చేశారు. ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. తన తలపై పిడిగుద్దులు కురిపించారని, ఇనుప కడియం లాంటి గట్టి వస్తువుతో కొట్టారని సంజయ్ కుమార్ ఆరోపించారు. ఆయన తలపై రెండు బలమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
దాడికి పాల్పడిన స్వతంత్ర భరద్వాజ్, సూరజ్ కుమార్‌లపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. స్వతంత్ర భరద్వాజ్ మాట్లాడిన ఒక పాడ్‌కాస్ట్ క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో భరద్వాజ్ తనను తాను కట్టర్ హిందూ(కరుడుగట్టిన హిందువు)గా చెప్పుకున్నాడు. సంజయ్ కుమార్ పుర్రెను తాను పగలగొట్టినట్లు బయటపెట్టాడు.
‘‘ఈ నేరం ఏ సెక్షన్ పరిధిలోకి వస్తుందో మీకు తెలుసా? సెక్షన్ 307. నిషూ ఆజాద్ తండ్రికి 60 కుట్లు పడ్డాయి. అతడిని అంబులెన్స్‌లో తరలించారు. తన తండ్రికి న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పోలీస్ స్టేషన్ బయట నిలబడి అతడి కుమార్తె నిషూ ఆజాద్ అంటోంది. కానీ, నన్ను కనీసం జైలులో కూడా పెట్టలేదు. ఈ విషయం ప్రపంచానికి తెలియాలి. రాత్రంతా నేను బయట తిరుగుతూనే ఉన్నాను. నాకు హనుమంతుని ఆశీస్సులు ఉన్నాయి. కపిల్ మిశ్రా నాకు అన్నయ్య అవుతారు. కపిల్ మిశ్రా ఫోన్ చేయడం వల్లే నేను విడుదలయ్యానని అంటుంటారు.
కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా నాకు అన్నయ్యే. మీకు ఎంతమంది నాయకులు తెలుసు? మోదీజీ తెలుసా? మోదీజీ కూడా నాకు అన్నయ్యే. అందరి మద్దతు నాకు ఉంది’’అని భరద్వాజ్ ఆ వీడియోలో చెప్పడం కనిపిస్తోంది. దీంతో ఈ కేసు మళ్లీ వెలుగులోకి వచి్చంది. భరద్వాజ్‌ను అరెస్టు చేయాలని సీజేపీ కార్యకర్తలు శుక్రవారం ఆందోళనకు దిగారు. విద్యారి్థని నిషూ ఆజాద్ కూడా పాల్గొన్నారు. భరద్వాజ్‌ను ఎందుకు జైలులో పెట్టలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు అతనికి రాజకీయ రక్షణ లభిస్తోందని ఆరోపించారు. రాజకీయ జోక్యం ఆరోపణలను ఢిల్లీ పోలీసులు తోసిపుచ్చారు. అతడిని అరెస్టు చేసినట్లు స్పష్టంచేశారు.
ఆత్మరక్షణ కోసమే దాడి
స్వతంత్ర భరద్వాజ్ మొదటి వీడియో వైరల్ అయిన తర్వాత మరో వీడియో వెలుగులోకి వచి్చంది.వాస్తవానికి ఆత్మరక్షణ కోసమే తాను దాడికి దిగాల్సి వచి్చందని ఇందులో అతడు వివరణ ఇచ్చాడు. ‘‘ఒకవేళ నేను ఆత్మరక్షణలో భాగంగా వ్యవహరించి ఉండకపోతే ఆ గుంపు నన్ను కొట్టి చంపి ఉండేది. నా ప్రాణాలు కచి్చతంగా పోయేవి. జంతర్‌మంతర్ వద్ద నిరసనకారులపై నేను దాడి చేయడానికి ప్రయత్నించలేదని నిరూపించడానికి వీడియో సాక్ష్యం ఉంది’’అని పేర్నొన్నాడు.


