4 రాష్ట్రాల్లో ముందస్తు జన గణన  | Census advanced ahead of polls in UP, Punjab, Goa and Uttarakhand | Sakshi
Sakshi News home page

4 రాష్ట్రాల్లో ముందస్తు జన గణన 

Sep 6 2026 5:07 AM | Updated on Sep 6 2026 5:07 AM

Census advanced ahead of polls in UP, Punjab, Goa and Uttarakhand

డిసెంబర్‌ 1 నుంచి షురూ..  

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో జన గణన ప్రక్రియను ముందుగానే ప్రారంభిస్తున్నట్లు రిజి్రస్టార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌జీఐ) శనివారం వెల్లడించారు. గోవా, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాలతోపాటు ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రక్రియ 2026 డిసెంబర్‌ 1 నుంచి 2027 జనవరి 4వ తేదీ వరకు జరుగుతుందని తెలియజేశారు. 

అలాగే 2027 జనవరి 5 నుంచి 2027 జనవరి 9 వరకు దీనికి సంబంధించిన పునఃపరిశీలన దశ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్‌జీఐ, జనాభా గణన కమిషనర్‌ మృత్యుంజయ్‌ కుమార్‌ నారాయణ్‌ ఒక గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆయా ప్రాంతాల్లోని పౌరులు 2026 నవంబర్‌ 16 నుంచి నవంబర్‌ 30 వరకు స్వయంగా వివరాలను నమోదు చేసుకునే (ఎల్ఫ్‌ ఎన్యూమరేషన్‌) అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. వాస్తవానికి దేశవ్యాప్తంగా జనగణన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మాత్రం ముందుగానే నిర్వహించబోతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement