న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాల సంస్థాగత బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా పీవీ మోహన్, మహారాష్ట్ర ఇన్‌చార్జ్‌గా సిరివెళ్ల ప్రసాద్, పంజాబ్ ఇన్‌చార్జ్‌గా సచిన్ పైలట్, అస్సాం ఇన్‌చార్జ్‌గా భూపేష్ బఘేల్, ఛత్తీస్‌గఢ్ ఇన్‌చార్జ్‌గా సుఖ్‌దేవ్ భగత్ నియమితులయ్యారు. పంజాబ్‌లో భూపేష్ బఘేల్ స్థానంలో సచిన్ పైలట్‌ను నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సచిన్ పైలట్ రాజస్థాన్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత. కేంద్ర మంత్రిగా, రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆయనకు తాజాగా పంజాబ్ బాధ్యతలు అప్పగించారు.
భూపేష్ బఘేల్ ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పంజాబ్ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన ఆయనకు తాజాగా అస్సాం బాధ్యతలు అప్పగించారు. 2026 అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ పరిశీలకుడిగానూ వ్యవహరించారు.
పీవీ మోహన్ కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత. AICCలో కీలక సంస్థాగత బాధ్యతలు నిర్వహించారు. గతంలో కేరళ, లక్షద్వీప్ వ్యవహారాల బాధ్యతలు చూశారు. సిరివెళ్ల ప్రసాద్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత కాగా, AICC కార్యదర్శిగా జార్ఖండ్ వ్యవహారాల్లో పనిచేశారు.
సుఖ్‌దేవ్ భగత్ ఝార్ఖండ్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత. గతంలో లోక్‌సభ సభ్యుడిగా, ఝార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. తాజా మార్పుల్లో ఆయనకు ఛత్తీస్‌గఢ్ బాధ్యతలు అప్పగించారు.
ఈ మార్పులతో ఆయా రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత వ్యవహారాలను బలోపేతం చేయడంతో పాటు, స్థానిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త నాయకత్వాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దించినట్లైంది.


