ప్రత్యేక కోర్టు తీర్పు.. 16న శిక్ష ఖరారు
జగదల్‌పూర్: 2013లో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా ఝీరమ్ లోయలో కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌పై జరిగిన దాడి కేసులో 10 మంది మావోయిస్టులను దోషులుగా నిర్ధారిస్తూ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు శనివారం తీర్పునిచ్చింది. ఈ దాడిలో మాజీ కేంద్ర మంత్రి విద్యా చరణ్ శుక్లా, మాజీ ప్రతిపక్ష నేత మహేంద్ర కర్మతోపాటు 29 మంది మరణించారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2013 మే 25న కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పరివర్తన్ ర్యాలీపై మావోయిస్టులు దాడి చేశారు. కాంగ్రెస్ నేతలతోపాటు పలువురు పౌరులు, భద్రత సిబ్బంది 29 మంది మరణించగా 30 మంది గాయపడ్డారు. ఈ దాడి ఫలితంగా చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అగ్రనాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోయినట్లు అయ్యింది. దోషులకు విధించే శిక్షను సెపె్టంబర్ 16న ఖరారు చేయనున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ సింగ్ రాజ్‌పుత్ తెలిపారు.


