రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రధారులుగా నటించిన సస్పెన్స్ అండ్ మిస్టరీ సినిమా ‘మిస్సింగ్ మేఘన’. వాచస్పతి దర్శకత్వంలో పంచుమర్తి నరేష్ బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీమ్ మంచి టాలెంటెడ్. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు.
‘‘నేను గతంలో సినిమా చేయడం మిస్ అయిన అందరితో ఈ సినిమాకి పని చేశాను. మా సినిమాను థియేటర్స్‌లో చూడండి’’ అని చెప్పారు రామ్ కార్తీక్. ‘‘వాచస్పతిగారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు’’ అన్నారు అంకిత్. ‘‘ప్రేక్షకులు మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు వాచస్పతి.


