నేడు లండన్‌ పర్యటనకు సీఎం విజయ్‌ | Tamil Nadu CM Vijay To Travel To London On First Official Overseas Visit To Seek New Investments | Sakshi
Sakshi News home page

నేడు లండన్‌ పర్యటనకు సీఎం విజయ్‌

Sep 10 2026 7:52 AM | Updated on Sep 10 2026 9:16 AM

Tamil Nadu CM Vijay to travel to London on first official overseas visit

సాక్షి, చెన్నై: సీఎం  జోసెఫ్‌ విజయ్‌ పెట్టుబడుల సేకరణ లక్ష్యంగా వారం రోజుల పాటు లండన్‌లో పర్యటించనున్నారు. ఇందుకోసం గురువారం  రాత్రి ఆయన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరనున్నారు. సీఎం విజయ్‌ రాత్రి 10 గంటలకు ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో దుబాయ్‌ మీదుగా లండన్‌ వెళ్లనున్నారు. పర్యటన ముగించుకుని సెపె్టంబర్‌ 16న రాత్రి 8.30 గంటలకు తిరిగి చెన్నై చేరుకుంటారు.

 లండన్‌ పర్యటనలో భాగంగా ఆయన యూరోపియన్‌ వ్యాపారవేత్తలతో ప్రతినిధి స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. తమిళనాడులో కొత్త పరిశ్రమల స్థాపన, కొత్త  పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. సీఎం  బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్‌ చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం Výæమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement