సాక్షి, చెన్నై : నిరుద్యోగ పట్టభద్రులకు ప్రభుత్వం త్వరలోనే భారీ తీపి కబురు అందించబోతోంది. రాష్ట్రంలో నిరుద్యోగులకు అందించే నెలవారీ సహాయాన్ని ఏకంగా రూ. 4 వేలకు పెంచే అవకాశం ఉందని కార్మిక సంక్షేమ శాఖ మంత్రి జె. మహమ్మద్ పర్వేజ్ వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పుదుక్కోట్టైలో వివిధ ప్రభుత్వ శాఖల తరఫున 721 మంది లబి్ధదారులకు సంక్షేమ సహాయం అందించే కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా మంత్రి నిరుద్యోగ భృతి పెంప గురించి ప్రస్తాంచారు.
ఎన్నికల హామీలు నిర్ణీత కాలపరిమితిలోగా నెరవేర్చాలని అధికారులను సీఎం విజయ్ ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే నిరుద్యోగ యువతకు అందించే భృతి రూ. 4,000లకు పెంచేందుకు అవసరమైన చర్యలు వేగంగా జరుగుతున్నాయని, బడ్జెట్‌లో దీనిపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. అలాగే తమిళనాడులో ప్రస్తుతం పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల (వలస) కారి్మకుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందినట్లు మంత్రి మహమ్మద్ పర్వేజ్ తెలిపారు. ఈ విషయంలో మరింత పారదర్శకత కోసం అధికారులు ప్రతి జిల్లాలోనూ వలస కారి్మకుల జనాభా గణన కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.


