రామ్ మోహన్ .సిహెచ్ దర్శకత్వంలో సంజయ్ ఆర్, రావ్, రిచా జోషి, నటాషా సింగ్ , ప్రాచీ థాకర్, హీరో హీరోయిన్లుగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘యువర్స్ బాబీ’. జెనీషా ఏ వన్ మూవీ పతాకంపై మల్కాజిగిరి రవికుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని ఈరోజు( సెప్టెంబర్4) నటుడు బ్రహ్మాజీ విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మల్కాజిగిరి రవికుమార్ మాట్లాడుతూ ‘యువర్స్ బాబీ సినిమా నేటి యువతను ఆకట్టుకునే కథనంతో, డిఫరెంట్ సంగీతంతో ముందుకు సాగుతుంది. అలాగే సంగీతం మా చిత్రానికి గొప్ప ఎస్సెట్ కానుంది. ఈ చిత్రంలోని పాటలు కులుమనాలిలో 15 రోజులపాటు చిత్రీకరించాం. చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’ అని అన్నారు. కాగా ఈ సినిమాకి విజయ్ కూరాకుల సంగీతం అందిస్తున్నారు.


