గతవారం థియేటర్లలో 'ఇట్లు అర్జున' అనే సినిమా రిలీజైంది. ఇందులో అనీష్ అనే కొత్త కుర్రాడు హీరోగా నటించాడు. అయితే ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్, నాగార్జున, అఖిల్, నాని.. ఇలా చాలామంది ముందుకొచ్చారు. మరి ఇంతమంది ఓ కొత్త హీరోకు సపోర్ట్ చేస్తున్నారు? అని చాలామంది మాట్లాడుకున్నారు. ఇప్పుడు దీనికి స్వయంగా మెగాస్టార్ చిరంజీవినే సమాధానం చెప్పేశాడు.
(ఇదీ చదవండి: గుడిలో పూజలు.. ప్రభాస్ వీడియో ఇప్పుడెందుకు వైరల్?)
'ఇట్లు అర్జున' సక్సెస్ మీట్.. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన చిరు.. అనీష్ గురించి మాట్లాడుతూ అతడి తండ్రి ఏఆర్ఎం మహేశ్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆయనకు సినిమాలపై ఉన్న ప్రేమనే.. అనీష్‌కి వచ్చిందని, అలా హీరోగా మారిన తనకు అందరం కలిసి ప్రోత్సాహిద్దామనే ఉద్దేశంతోనే సపోర్ట్ చేశామని చెప్పుకొచ్చాడు. అయితే అనీష్‌కి దొరికినట్లు తనకు, నాగార్జునకు కూడా ఇలాంటి అవకాశం దక్కలేదని చెప్పుకొచ్చాడు.
కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీసిన 'ఇట్లు అర్జున'లో అనీష్ హీరో కాగా మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్. తమన్ అందించిన పాటలు ఆకట్టుకున్నాయి. స్టోరీ పరంగా రెగ్యులర్‌గానే ఉన్నప్పటికీ జనాలకు నచ్చింది. కాకపోతే థియేటర్లలో ప్రేక్షకులే పెద్దగా కనిపించట్లేదు. ఇప్పుడు చిరంజీవి వచ్చి ప్రమోట్ చేశారు కాబట్టి ఆడియెన్స్ కౌంట్ ఏమైనా పెరుగుతుందేమో చూడాలి?
(ఇదీ చదవండి: మళ్లీ విలన్‌గా గోపీచంద్? హీరో ప్రభాస్ కాదు!)
The Real Reason Behind Every Star Hero Supporting Aniesh's Debut Revealed by Megastar #Chiranjeevi !! #ItlluArjuna https://t.co/C64at1Ogb7
— Telugu Chitraalu (@CineChitraalu) November 17, 2026


