అమెరికాలో కాల్పుల ఘటనలు  | Shootings over Halloween weekend leave at least 6 dead and dozens injured across US | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పుల ఘటనలు 

Nov 2 2026 6:06 AM | Updated on Nov 2 2026 6:06 AM

Shootings over Halloween weekend leave at least 6 dead and dozens injured across US

ఐదుగురు మృతి, 36 మందికి గాయాలు 

డాలస్‌: అమెరికాలో హాలోవీన్‌ వేడుకల సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనల్లో ఐదుగురు చనిపోగా, మరో 36 మంది గాయపడ్డారు. డాలస్‌లో మూడు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోగా, 15 మంది వరకు గాయపడ్డారు. అర్ధరాత్రి దాటాక 12.20 గంటల సమయంలో ఎల్మ్‌ స్ట్రీట్‌లో, 1.05 గంటలప్పుడు మెయిన్‌ స్ట్రీట్‌లో, మూడో ఘటన 1.35 గంటలకు క్రోడస్‌ స్ట్రీట్‌లో చోటుచేసుకున్నాయని, వీటికి పరస్పరం సంబంధముందా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

కారణాలు కూడా తెలియడం లేదని, అనుమానితులు కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని చెప్పారు. అదేధంగా, అలబామాలోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు చనిపోగా, 8 మంది గాయపడ్డారు. డెలావెర్‌లోని నెవార్క్‌లో, అర్కన్సాస్‌లోని ఫయెట్‌విల్లేల్లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనల్లో ఆరుగురు చొప్పున, టెక్సస్‌లో ఒకరు గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement