ఉక్రెయిన్‌పై భీకర దాడి  | Russian strikes on Ukrainian cities kill at least 24 in a major attack | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌పై భీకర దాడి 

Oct 8 2026 4:22 AM | Updated on Oct 8 2026 4:22 AM

Russian strikes on Ukrainian cities kill at least 24 in a major attack

24 మంది దుర్మరణం

కీవ్‌: ఉక్రెయిన్‌పై దురాక్రమణ జెండా ఎగరేసి నాలుగున్నరేళ్లుగా దాడులతో తెగబడుతున్న రష్యా మరోమారు తీవ్రస్థాయిలో దాడులకు పాల్పడింది. దీంతో ఉక్రెయిన్‌ వ్యాప్తంగా నలుగురు చిన్నారులు సహా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది గాయపడ్డారు. బుధవారం పుతిన్‌ 74వ పుట్టినరోజు కానుకగా రష్యా సేనలు ఇలా బాంబుల మోత మోగించాయని ఉక్రెయిన్‌ ఆరోపిస్తుండగా శత్రుదేశ దాడులకు స్పందనగానే ప్రతిదాడులు చేశామని రష్యా సైన్యం స్పష్టంచేసింది.

 మరో 24 గంటల్లో తమపై రష్యా మెరుపుదాడులకు సిద్ధమవుతోందని మంగళవారమే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంచనా వేసినట్లే రష్యా సేనలు దాడిచేయడం గమనార్హం. బుధవారం ఉత్తర చెర్నిహివ్‌ రీజియన్‌లోని ప్రైలుకీ నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌పై జరిపిన రష్యా డ్రోన్‌ దాడిలో నలుగురు చిన్నారులు సహా 18 మంది చనిపోయారు.50 మంది గాయపడ్డారని ఉక్రెయిన్‌ అంతర్గత మంత్రి ఇహోర్‌ విహీవ్సీ్క తెలిపారు. రాజధాని కీవ్‌ సహా మూడు నగరాల్లోనూ రష్యా డ్రోన్, క్షిపణి దాడి చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో ఆరుగురు మరణించగా మరో 10 మంది గాయపడ్డారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement