విమానంపై మంచు పేరుకుపోతోంది.. గాలుల తీవ్రతకు విమానం అదుపు తప్పుతోంది. ఏం జరుగుతుందో పైలట్లకూ అర్థం కాని పరిస్థితి. చివరకు ప్రాణాలు కాపాడుకునే అవకాశం లేదని గ్రహించి.. ‘మనం నేలను ఢీకొట్టబోతున్నాం’ అంటూ పైలట్ చివరి మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొద్ది క్షణాల్లోనే తొమ్మిది మందితో వెళ్తున్న ప్రైవేట్ జెట్ జనావాసాల మధ్య కుప్పకూలిపోయింది. అయితే విమానం ఇళ్లకు అతి సమీపంలో కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు సైతం తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాయి
టెక్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్‌స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ ప్రైవేట్ జెట్ బహామాస్‌కు వెళ్తుండగా జరిగింది. మొదట 10 వేల అడుగుల వేగంతో కిందికి దిగిన విమానం.. ఆ తర్వాత 20 వేల అడుగులు, చివరకు 30 వేల అడుగుల వేగంతో పడిపోయినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రికార్డింగ్స్, విమాన ట్రాకింగ్ సమాచారం వెల్లడిస్తున్నాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానం వేగంగా కిందికి దిగుతున్న విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు తెలియజేశారు.
‘‘మేము నిమిషానికి 8 వేల అడుగుల వేగంతో కిందికి దిగుతున్నాం.. మేడే.. మేడే.. ఇప్పుడు నిమిషానికి 10 వేల అడుగుల వేగంతో దిగిపోతున్నాం’’ అని పైలట్ హెచ్చరించారు. ఆ తర్వాత పరిస్థితి మరింత విషమించింది. మేము అదుపు తప్పిన వేగంతో నిమిషానికి 20 వేల అడుగుల వేగంతో కిందికి దిగుతున్నామని పైలట్ తెలిపారు. చివరకు విమానం నేలను ఢీకొట్టబోతున్న విషయాన్ని గుర్తించి.. మేము భూమిని ఢీకొట్టబోతున్నాం అంటూ చివరి హెచ్చరిక చేశారు. కొద్దిసేపటికే విమానం కుడివైపునకు తీవ్రంగా ఒరిగి నేలను బలంగా ఢీకొట్టింది.
🇺🇸 Air traffic control audio from a Learjet 60 that crashed in Palm Beach County, Florida on November 1 captures the final moments. The jet, N722BD, left Austin, Texas for the Bahamas with 9 people aboard. Around 12:50 p.m. the crew reported a rapid descent of 10,000 then 20,000 feet per minute, banking 60 degrees, & declared a mayday. A voice is heard saying “We’re going to crash into the ground” & “Holy f*ck, we’re out of time.” The aircraft struck near a mobile home park by Military Trail, erupting in a fireball. All 9 aboard were killed. No one on the ground has been reported killed. FAA & NTSB are investigating. Source: New York Post
— Steven Latham (@StevenJLatham1) November 1, 2026
ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేసింది. విమానం కూలిన చోట రోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు కార్లలో ప్రయాణిస్తున్న వారు చిత్రీకరించారు. విమానం కూలి పేలిపోయిన దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. ఇళ్లకు, రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు అతి సమీపంలో విమానం పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద స్థలానికి సమీపంలోని మొబైల్ హోమ్ కమ్యూనిటీలో నివసిస్తున్న సుమారు 600 మందిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
ఇదీ చదవండి: ‘ఎన్నికల్లో ఓడితే..’ షాకిస్తున్న ట్రంప్ వ్యాఖ్యలు!


