బ్రాంప్టన్: పంజాబ్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడు కెనడాలో రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. తరన్‌తారన్ జిల్లాలోని పట్టి ప్రాంతానికి చెందిన సిమ్రన్‌జీత్ సింగ్ బ్రాంప్టన్‌లో రైలు ఢీకొని మృతి చెందాడు. సిమ్రన్‌జీత్ గత ఐదేళ్లుగా కెనడాలో నివసిస్తున్నాడు. అక్కడ ట్రక్కింగ్ రంగంలో పనిచేస్తున్నాడు. అక్టోబర్ 31న ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు తిరిగి రాలేదు.
ఎంతసేపటికీ ఇంటికి చేరకపోవడంతో అతడి స్నేహితులు, పరిచయస్తులు ఫోన్ చేయడం ప్రారంభించారు. పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అతడి ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు.ఈ క్రమంలో సిమ్రన్‌జీత్ రైలు ఢీకొని మృతి చెందినట్లు వారికి సమాచారం అందింది. అతడి మృతితో పంజాబ్‌లోని స్వగ్రామంలో విషాదం నెలకొంది.
ఇదీ చదవండి: షాకిస్తున్న 19 ఏళ్ల ‘పూకీ బాబా’.. ‘అందగాడే..వాడూ’..!


