మధుర: యూపీలోని బృందావన్‌కు చెందిన 19 ఏళ్ల యువ ఆధ్యాత్మిక ప్రవచనకర్త సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. తన ఆధ్యాత్మిక ప్రసంగాలతో పాటు ప్రత్యేకమైన హెయిర్‌స్టైల్, ఆకర్షణీయమైన రూపంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ‘జెన్ జెడ్ బాబా’, ‘పూకీ బాబా’ అంటూ నెటిజన్లు పిలుస్తున్నారు. ఈ యువ ఆధ్యాత్మిక గురువు పేరు శ్రీ శాశ్వత్ ఆచార్య. శ్రీ స్వామి శాశ్వతాచార్య జీ మహారాజ్‌గా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. బృందావన్‌లోని శ్రీధామ్ గోదా విహార్ మందిరానికి పీఠాధీశ్వరుడిగా వ్యవహరిస్తున్నారు. భాగవత కథా ప్రవచనకర్తగా ప్రసంగాలు చేస్తున్నారు.
ఆధ్యాత్మిక విషయాలను వివరిస్తూ ఆయన చేసే ప్రసంగాలు చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. అయితే ఆయన వయసు, కర్లీ హెయిర్, క్లీన్ షేవ్ లుక్ కూడా సోషల్ మీడియాలో ప్రత్యేక చర్చకు కారణమయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికల్లో ఆయనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు విస్తృతంగా షేర్ అవుతున్నాయి. నెటిజన్లు సరదా కామెంట్లు, మీమ్స్‌తో స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘జెన్ జెడ్ బాబా’, ‘పూకీ బాబా’ అనే పేర్లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ‘పూకీ బాబా’ అనే ముద్దుపేరు గతంలో ఆధ్యాత్మిక ప్రవచనకర్త అనిరుద్ధాచార్య జీ మహారాజ్‌కు సంబంధించి కూడా సోషల్ మీడియాలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు శాశ్వత్ ఆచార్యకు కూడా ఇదే పేరు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: ‘ఎన్నికల్లో ఓడితే..’ షాకిస్తున్న ట్రంప్ వ్యాఖ్యలు!


