breaking news
Curly Hair
-
హ్యాండ్సమ్ బాయ్ : సినీ స్టార్లా ఇంత అందమా? ఎలా?
సింహాలు పౌరుషంతో గంభీరంగా కనిపిస్తాయి.మగ సింహాలు అందమైన జూలుతో మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. మరి జూలు రింగు రింగులుగా ఉంటే. ప్రస్తుతం సోషల్ మీడియాలో కర్లీ మేన్ సింహం బ్యూటీ చర్చకు దారిసింది."హ్యాండ్సమ్ బాయ్ ఇన్ ది వైల్డ్" ("Handsome Boy In The Wild") అంటూ మసాయి మారా వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ కాంబిజ్ పౌర్ఘనాద్ తీసిన కర్లీ మేన్ సింహం అరుదైన ఫోటో ఆన్లైన్లో వైరలవుతోంది.ఇది వన్యప్రాణి ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Kambiz Cameo Pourghanad (@silent_whispers.photography) మగ సింహాల శరీరం రంగు ,ఆకృతి చాలా మారుతూ ఉంటాయి. కానీ జుట్టు ఇలా మారడం చాలా అరుదు. ఎంతో ఓపిగ్గా, వన్యప్రాణి ఫోటోగ్రాఫర్లు అలాంటి సింహ రాజాలను పరిచయం చేస్తూ ఉంటారు. అలా గిరిజాల జుట్టుతో ఉన్న సింహం అద్భుతమైన క్లోజప్ ఫోటోలను తీశారు. అడవిలో చాలా అరుదుగా కనిపించే దృశ్యాన్ని తన కెమెరాలలో బంధించారు. సెలూన్ బ్లోఅవుట్ చేసి చక్కగా మేకప్ చేసినట్టు అందంగా కనిపించింది. ఈ అందమై హీరో పేరు న్జురి - M6. ఒలెపోలోస్ కుమారుడు . అలాగే కెన్యాలోని మసాయి మారాలో ఏడు టోపి ప్రైడ్ సింహాల్లో ఒకటి. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన ఈ సింహం ఫోటోను షేర్ చేస్తూ ఇలా కామెంట్ చేశారు ’’రాసి పెట్టుకోండి, న్జురి ప్రస్తుతం మసాయి మారాలో అత్యంత అందమైన సింహాలలో ఒకటి. అలాగే అందంలో భవిష్యత్తులో ఆఫ్రికాలో బాన్ జోవి, కింగ్ మోయా ,బ్లాండీ సరసన నిలబడుతుంది’’ అని. View this post on Instagram A post shared by Kambiz Cameo Pourghanad (@silent_whispers.photography) ఫోటోలో న్జురి అద్భుతమైన అలలుగా, దాదాపుగా స్టైల్ చేయబడిన మేన్ తో కనిపిస్తుంది, ఇది సాధారణ అడవి సింహం మేన్ కంటే లాగా కనిపిస్తుంది. జన్యుశాస్త్రం, అధిక తేమ , వర్షంలో తడిసిన తర్వాత సహజంగా ఎండిన మేన్ కలయిక వల్ల కర్ల్స్ ఏర్పడి ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.ఈ ప్రకృతి చమత్కారాన్ని చూసి ఆశ్చర్యపోయిన వన్యప్రాణుల ఔత్సాహికులు, సాధారణ ప్రేక్షకుల నుండి ప్రశంసలందుకుంటోంది. భలే ముద్దుగా గిరజాలు అని ఒకరు, "హ్యాండ్సమ్ బాయ్! సినిమా స్టార్లా ఉన్నాడు" అని ఒక యూజర్ చమత్కరించారు. "ఎంత అందం, దురాశాపరుడైన మానవుని చేతిలో దానికి నష్టం కలగకుండా చూడాలి అతన్ని రక్షించాలి" అని ఒకరంటే, " ఒక అందమైన సింహం, మారా నుండి నాకు ఇష్టమైన వాటిలో ఒకటి" అని అంటూ మరొకరు కమెంట్ చేశారు. దీంతో న్జూరి మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను దక్కించుకుంటోంది.ఇదీ చదవండి : పాపం.. పిల్లి అనుకుని పాంపర్ చేశాడు, వైరల్ వీడియో -
చిటికెలో జుట్టుని నచ్చిన హెయిర్ స్టైల్లో మార్చుకోవచ్చు ఇలా..!
జుట్టును మృదువుగా, అందంగా సరిచేసుకోవాలంటే చేతిలో స్ట్రెయిటెనర్ ఉండాల్సిందే అంటారు చాలామంది ఆడవారు. అయితే సమయం ఉన్నా లేకున్నా, వీలున్నా లేకున్నా– పవర్ ప్లగ్ సమీపంలోనే చాలా స్ట్రెయిటెనర్లతో కేశాలంకరణ సాధ్యమవుతుంది. కానీ ఈ లేటెస్ట్ వైర్లెస్ గాడ్జెట్‌తో సులభంగా ఎక్కడైనా, ఎప్పుడైనా జుట్టును నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా ప్రయాణాల్లో ఈ గాడ్జెట్ భలేగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది రీచార్జబుల్ స్ట్రెయిటెనర్. దీన్ని వైర్లెస్ గాడ్జెట్‌లా వాడుకునే వీలుంటుంది. ఇది చూడటానికి, ఉపయోగించడానికి అచ్చం దువ్వెనలా ఉండటంతో జుట్టు దువ్వుకున్నట్లే దువ్వుకుని, ఈజీగా స్ట్రెయిటెనింగ్ చేసుకోవచ్చు. దీనిలో 120 డిగ్రీస్ నుంచి 200 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు మొత్తం మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఆరోగ్యమైన జుట్టుకు, బలహీనపడిన జుట్టుకు ఉష్ణోగ్రతను ఎంపిక చేసుకోవడంలో వ్యత్యాసం పాటించాలి. దీనితో పొడిబారి చిట్లిన జుట్టును సరి చేసుకోవచ్చు. వంకీల జుట్టును సులభంగా నిటారుగా మార్చుకోవచ్చు. ఉంగరాల జుట్టును మృదువుగా చేసుకోవచ్చు. ఈ గాడ్జెట్‌కు అటాచ్ చేసుకునేందుకు అనువుగా చార్జింగ్ బేస్ కూడా లభిస్తుంది. ఈ కూంబ్ మెషిన్ ముందువైపు పవర్ బటన్ పైన ఆప్షన్స్ టెంపరేచర్ డీటైల్స్‌తో పాటు చార్జింగ్ ఇండికేషన్ కూడా కనిపిస్తుంది. దీన్ని కొనుగోలు చేసే సమయంలో బ్యాటరీ సామర్థ్యాన్ని, వినియోగదారుల రివ్యూలను పరిగణనలోకి తీసుకోవడం ఉత్తమం.జుట్టు రాలు సమస్యకు చెక్..ఈరోజుల్లో చాలామందికి జుట్టు రాలడమే ప్రధాన సమస్యగా మారింది. అందుకు పరిష్కారంగా ‘హెయిర్ మెసోథెరపీ’ అనే విధానాన్ని సూచిస్తున్నారు ప్రొఫెషనల్ బ్యూటీషియన్స్. మెసోథెరపీలో చాలా సన్నని సూదులను ఉపయోగించి.. విటమిన్లు, ఎంజైమ్‌లు, హార్మోన్లు వంటివి జుట్టు కుదుళ్లలోకి నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. ఈ ప్రక్రియ జుట్టు రాలడాన్ని తగ్గించి, బలమైన జుట్టు పెరిగేందుకు దోహదపడుతుంది. ఈ థెరపీ మాడులో రక్త ప్రసరణను మెరుగుపరచి, జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. జుట్టు రాలడానికి కారణమయ్యే హార్మోన్ల అసమతుల్యతను సరిచేస్తుంది. ఈ చికిత్స సాధారణంగా కొన్ని వారాల వ్యవధిలో అనేక సెషన్లలో జరుగుతుంది. ఒక్కో సెషన్ సుమారు 30 నిమిషాలు పడుతుంది. హెయిర్ మెసోథెరపీని అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చేయించుకోవాలి. చికిత్సకు ముందు, తరువాత వైద్యుల సూచనలను కచ్చితంగా పాటించాలి. (చదవండి: Biodegradable Plastics: ప్లాస్టిక్‌ని వదిలించుకోవాలంటే.. చేతికి మట్టి అంటాల్సిందే..!) -
ఇంట్లోనే ఈజీగా కర్లీ హెయిర్..!
కొందరికి గిరజాల జుట్టు అంటే ఇష్టంగా ఉంటుంది. నిజానికి వేసుకున్న డ్రెస్‌కు తగినట్లుగా హెయిర్ స్టైల్‌ని మార్చేవాళ్లకు చిత్రంలోని ఈ హెడ్ బ్యాండ్ భలే చక్కగా పని చేస్తుంది. అందుకే చాలామంది కేశాలంకరణ ప్రియులు, హెయిర్ స్ట్రెయిటనర్తో పాటు హెయిర్ కర్లర్ వాడుతూ ఉంటారు. ఈ కర్లర్ హీట్‌లెస్ బ్యాండ్‌ను వెంట ఉంచుకుంటే, ఎలక్ట్రిక్ కర్లర్‌తో పని ఉండదు. దాంతో జుట్టు పాడవదు. పైగా ఈ రోలర్ టూల్‌ను ఉపయోగిస్తే చక్కటి హెయిర్ స్టైల్‌తో అందంగా మెరిసిపోవచ్చు.ఈ బ్యాండ్స్ చాలా రకాలు, చాలా రంగుల్లో లభిస్తున్నాయి. ఆయా బ్యాండ్స్‌ని ఆయా పద్ధతుల్లోనే తలకు అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం జుట్టును కొన్ని చిన్నచిన్న పాయలుగా విడదీసుకుని, బ్యాండ్ కిందకు వేలాడుతున్న లేసులకు ఆ పాయలను బిగించి చుట్టి, 2 లేదా 3 గంటల పాటు అలా ఉంచుకోవాలి. అనంతరం లేసుల నుంచి జుట్టును పాయలు పాయలుగా విడదీసేస్తే, జుట్టు మొత్తం కర్లీగా మారిపోతుంది. ఈ టూల్‌ని చిత్రంలో చూపిన విధంగా తల వెంట్రుకలకు బిగించుకుని ఇంటిపనులు, వంటపనులు చేసుకోవచ్చు, లేదా చక్కగా నిద్రపోవచ్చు. ఈ ఉంగరాలు తిరిగిన జుట్టు ఎక్కువ సమయం ఉండాలన్నా, ఎక్కువ రింగులు తిరగాలన్నా రాత్రి పూట తలకు ఈ బ్యాండ్ పెట్టుకుని పడుకుంటే, ఉదయం లేచేసరికి అందమైన హెయిర్ స్టైల్ మీ సొంతమవుతుంది. ఈ ప్రీమియం కర్లింగ్ మెటీరియల్ 100% సహజమైన, నాణ్యత కలిగిన స్పాంజ్‌తో రూపొందింది. ఇది ఎలాంటి ప్లాస్టిక్ వాసన రాదు. హానికరం కాదు. పైగా ఇది వాడుకోడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ బ్యాండ్ కేవలం రూ.500 కంటే తక్కువ ధరలోనే ఆన్లైన్లో అందుబాటులో ఉంది. నచ్చినవాళ్లకు ఈ టూల్‌ని బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. (చదవండి: నోటిలో నాటే ఇంప్లాంట్స్...) -
రింగుల జుట్టు, చిక్కని చిరునవ్వు, చక్కనమ్మ అందం (ఫోటోలు)


