సింహాలు పౌరుషంతో గంభీరంగా కనిపిస్తాయి.మగ సింహాలు అందమైన జూలుతో మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. మరి జూలు రింగు రింగులుగా ఉంటే. ప్రస్తుతం సోషల్ మీడియాలో కర్లీ మేన్ సింహం బ్యూటీ చర్చకు దారిసింది.
"హ్యాండ్సమ్ బాయ్ ఇన్ ది వైల్డ్" ("Handsome Boy In The Wild") అంటూ మసాయి మారా వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ కాంబిజ్ పౌర్ఘనాద్ తీసిన కర్లీ మేన్ సింహం అరుదైన ఫోటో ఆన్‌లైన్‌లో వైరలవుతోంది.ఇది వన్యప్రాణి ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది.
మగ సింహాల శరీరం రంగు ,ఆకృతి చాలా మారుతూ ఉంటాయి. కానీ జుట్టు ఇలా మారడం చాలా అరుదు. ఎంతో ఓపిగ్గా, వన్యప్రాణి ఫోటోగ్రాఫర్లు అలాంటి సింహ రాజాలను పరిచయం చేస్తూ ఉంటారు. అలా గిరిజాల జుట్టుతో ఉన్న సింహం అద్భుతమైన క్లోజప్ ఫోటోలను తీశారు. అడవిలో చాలా అరుదుగా కనిపించే దృశ్యాన్ని తన కెమెరాలలో బంధించారు. సెలూన్ బ్లోఅవుట్ చేసి చక్కగా మేకప్ చేసినట్టు అందంగా కనిపించింది. ఈ అందమై హీరో పేరు న్జురి - M6. ఒలెపోలోస్ కుమారుడు . అలాగే కెన్యాలోని మసాయి మారాలో ఏడు టోపి ప్రైడ్ సింహాల్లో ఒకటి. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన ఈ సింహం ఫోటోను షేర్ చేస్తూ ఇలా కామెంట్ చేశారు ’’రాసి పెట్టుకోండి, న్జురి ప్రస్తుతం మసాయి మారాలో అత్యంత అందమైన సింహాలలో ఒకటి. అలాగే అందంలో భవిష్యత్తులో ఆఫ్రికాలో బాన్ జోవి, కింగ్ మోయా ,బ్లాండీ సరసన నిలబడుతుంది’’ అని.
ఫోటోలో న్జురి అద్భుతమైన అలలుగా, దాదాపుగా స్టైల్ చేయబడిన మేన్ తో కనిపిస్తుంది, ఇది సాధారణ అడవి సింహం మేన్ కంటే లాగా కనిపిస్తుంది. జన్యుశాస్త్రం, అధిక తేమ , వర్షంలో తడిసిన తర్వాత సహజంగా ఎండిన మేన్ కలయిక వల్ల కర్ల్స్ ఏర్పడి ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ప్రకృతి చమత్కారాన్ని చూసి ఆశ్చర్యపోయిన వన్యప్రాణుల ఔత్సాహికులు, సాధారణ ప్రేక్షకుల నుండి ప్రశంసలందుకుంటోంది. భలే ముద్దుగా గిరజాలు అని ఒకరు, "హ్యాండ్సమ్ బాయ్! సినిమా స్టార్‌లా ఉన్నాడు" అని ఒక యూజర్ చమత్కరించారు. "ఎంత అందం, దురాశాపరుడైన మానవుని చేతిలో దానికి నష్టం కలగకుండా చూడాలి అతన్ని రక్షించాలి" అని ఒకరంటే, " ఒక అందమైన సింహం, మారా నుండి నాకు ఇష్టమైన వాటిలో ఒకటి" అని అంటూ మరొకరు కమెంట్ చేశారు. దీంతో న్జూరి మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను దక్కించుకుంటోంది.
ఇదీ చదవండి : పాపం.. పిల్లి అనుకుని పాంపర్ చేశాడు, వైరల్ వీడియో


