సోషల్ మీడియా విశేషాల పుట్ట. మంచో, చెడో, విశేషమో, వికారమో ఏదో ఒక వీడియో నెట్టింట సందడి చేస్తూనే ఉంటుంది. తాజాగా ఒక వీడియో ఎక్స్‌లో చక్కర్లు కొడుతోంది. మరీ ముఖ్యంగా ఫేక్ వీడియోలు, ఏఐ వీడియోలు తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. ఇపుడు మీరు చదవబోయేది అలాంటిదే..
మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఉన్న పెంచ్ నేషనల్ పార్క్ సమీపంలో అక్టోబర్ 4వ తేదీన ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. 52 ఏళ్ల కూలీ రాజు పటేల్ పుల్‌గా మద్యం తాగి రోడ్డుపై వెళుతున్నాడు. అయితే ఇటీవలి వర్షాలు వరదల కారణంగా , సమీపంలోని పెంచ్ టైగర్ రిజర్వ్ బయటకు వచ్చిన చిన్న బెంగాల్ టైగర్ రోడ్డుపైకి వచ్చింది. అటు బెంగాల్ టైగర్, ఇటు రాజు.. ఇద్దరూ తారసపడ్డాడు. అర్థరాత్రి దాన్ని పిల్లి అనుకున్న రాజు దాన్ని మెల్లిగా బుజ్జగించడం మొదలు పెట్టాడు. ఒక చేత్తో బాటిల్ పట్టుకొని నెత్తిమీద సున్నితంగా నిమిరాడు. అంతేకాదు..దానికీ ఓ చుక్క తాగిద్దామని ప్రయత్నించాడు. కానీ ఆ పులి పట్టించుకోలేదు. ఏయ్.. పిల్లీ పక్కకు వెళ్లు అంటూ తాగిన మత్తులో గొణిగాడు. ఇది చూసి ఆ పులి పట్టించుకోలేదు. ఇంత జరుగుతున్నా అది ఏమీ అనలేదు. దీంతో బతికిపోయాడు రాజు. పుస్సీ కేట్ అనుకుంటూ అక్కడినుంచి సర్దుకున్నాడు. దాదాపు 10 నిమిషాల ఈ తంతు అంతా సీసీటీవీలో రికార్డైంది. తరువాత అటవీ అధికారులు స్పాట్‌లైట్లు, తేలికపాటి ట్రాంక్విలైజర్లతో వచ్చి అలసిపోయిన పులిని తెల్లవారుజామున 3 గంటలకు అడవిలోకి తిరిగి పంపించారు. ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నాడు. అయితే రాజు మాత్రం ఇప్పుడు భారీ పోలీసు రక్షణలో ఉన్నాడట. అతని సోషల్ మీడియా ఖాతాను బ్లాక్ చేశాడు . మరోవైపు అంత ధైర్యం ఎలా వచ్చింది.. నీవు తాగిన డ్రింక్ రెసిపీ చెప్పు భయ్యా.. అంటూ పెళ్లైన మగాళ్లు వెంటబడుతున్నారంటూ పలు జోక్స్ పేలుతున్నాయి. @dekhane_mukul నిజంగా జరిగిందే అంటూ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేసింది. అసలు నిజం ఏమి మాత్రం వేరేలా ఉంది.
అయితే ఇది ఏఐ జెనరేటెడ్ వీడియో అని ఫారెస్ట్ అధికారు ఒకరు స్పందించారు. ఇలాంటి వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
AI generated. Please stay away from such AI generated videos and don’t forward them. May create unnecessary panic. https://t.co/SXoc6hqCnA
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 29, 2025
— Mukul Dekhane (@dekhane_mukul) October 29, 2025


