ఇప్పుడు చెప్పబోయే విషయం బాగా ఆశ్చర్యపర్చవచ్చు లేదా మీరు అస్సలు నమ్మలేక పోవచ్చు. కాన్సెప్ట్ అలాంటిది. ఈ కథనంలో విషయం విన్న తరువాత ఔరా అని ముక్కున వేలేసుకోకుండా ఉండలేరు. ఆలస్యం చేయకుండా అసలు విషయం చెప్పేస్తాను, చకచక చదివేయండి మరి..!.
ఈ ఆధునిక సమాజంలో బంధం అనేది పిడికిలిలో ఉన్న మట్టి లాంటిది. ఎంత సేపు ఒడిసి పట్టుకున్నా వేళ్ళ సందుల్లోంచి జారిపోతాయి ఈబంధాలు. అటువంటి బంధాలకు సంబంధించినదే ఈ స్టోరీ. ఇటీవల ఓ సర్వే ప్రకారం మగవాళ్ల గురించి పెద్ద మార్కులే వేసింది. అది మార్క్ డీబుల్ సర్వే. దీని ప్రకారం 66శాతం మగవాళ్లు ఏకపత్నీవ్రతులుగా తేలారు. ఇది నిజమా అబద్ధమా అన్నది ఓ సారి చూద్దాం. అసలు ముందు మార్క్ డీబుల్ అనేది డాక్టర్ మార్క్ డైబుల్ అనే సైంటిస్టు నుంచి పుట్టిన పేరు.
ఆయన 2025లో *Proceedings of the Royal Society: Biological Sciences*లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, మగవాళ్ళలో 66 శాతం ఏకపత్నీత్వ రేటు ఉంది. ఇది సాదా సీదా సర్వే కాదు, అంటే ఆయన ప్రపంచంలోని అన్నీ జీవచరాలలో ఉన్న మగజాతిపై చేసిన సర్వే. అసలు ఆయన ఈ సర్వే ఎలా చేశాడంటే.. ఏకంగా 11 జాతుల మామల్స్ తోపాటు 94 మానవ సమాజాల డేటాను వాడి, కంప్యూటేషనల్ మోడల్‌తో విశ్లేషించారు.
ఈ సర్వే ప్రకారం ఏకపత్నీతత్వంలో ఏఏ జాతులు, ఏఏ ప్రాంతంలో ఉన్నాయో ఓ సారి చూద్దాం. టాప్‌లో కాలిఫోర్నియా ప్రాంతంలోని డీర్‌మౌస్ వందశాతంతో , ఆఫ్రికన్ వైల్డ్ డాగ్ లు 85శాతంతో ఉన్నాయి. ఇక చివర్లో మౌంటైన్ గొరిల్లాలు 6శాతం చింపాన్జీలు 4శాతంగా ఉన్నాయి. అంటే వీటికి అచంలత్వం ఎక్కువ. ఇక మనుషులు 4 శాతం మాత్రం ఉన్నారు. భారతదేశంలో ఏకపత్నీత్వం సాంప్రదాయం ఎక్కువగా ఉండేది . కానీ ఓ బ్రిటిష్ సర్వే ప్రకారం ఆధునిక యువతలో 31శాతం దీన్ని అసాధ్యం అని చెబుతున్నారు.
ఇప్పుడు ఈ అధ్యయనం వల్ల మనకు తెలిసింది ఏమిటంటే ఏకపత్నీత్వం అనేది మన జీన్స్‌లో లేదు, సమాజంలో ఏర్పడింది. ఇది మనల్ని ఓ విధంగా ఒత్తిడి కలిగిస్తుంది. ఆధునికంగా, జెన్ Zలో 50శాతం మంది మోనోగమీని అంటే ఏకపత్నీత్వం ఔట్‌డేటెడ్ అని చెబుతున్నారు – ఓపెన్ రిలేషన్‌షిప్స్ పెరుగుతున్నాయి.
మగవాళ్లు పాలిగినీకి అంటే ఒకరి కన్నా ఎక్కువ సంబంధాలు పెట్టుకోవడం పట్ల 6 రెట్లు ఆసక్తి చూపుతున్నారని మరో అధ్యయనం చెబుతుంది. అయితే మన తెలుగు సంస్కృతిలో "ఒక్కటి మంచిది" అనే సామెత ఉంది, కానీ ఈ డేటా మనల్ని ప్రశ్నించేలా చేస్తుంది: మన సంబంధాలు ఎంత "నేచురల్" అనే ప్రశ్న పెరుగుతుంది.
ఫ్రెండ్స్..ఒకరితో బంధం అంటే జీవితాంతం అది అనుబంధం అవుతుంది. అదే ఒకరి కన్న ఎక్కవైతే అది బంధాలకు అతీతం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ జీవితబంధమా లేక అతీతసంబంధమా అనేది ఎవరికి వారే తెలుసుకోవాలి మరి..!.
(చదవండి: 'చాట్ జీపీటీతో లవ్'..! ఎందుకో తెలిస్తే షాకవ్వడం ఖాయం..ముఖ్యంగా భారతీయులే..)


