ఒకేసారి సాధారణ గది, సాధారణ కేక్, సాధారణ ఫ్రెండ్స్ కూడా ఈ గాడ్జెట్స్‌తో ఒక ఫ్లాషింగ్ ఫ్యాంటసీ వరల్డ్‌లోకి మారతాయి. అవే ఈ గాడ్జెట్స్ మ్యాజిక్!
కూల్ పార్టీ!
సింగిల్ బటన్ తో గది మొత్తం పార్టీ వైబ్‌లోకి మారిపోతుంది అంటే నమ్ముతారా? అదే పీ–ట్రాన్‌ఫ్యూజన్ బ్లూటూత్ స్పీకర్ మ్యాజిక్! ఒకేసారి లైట్లు, మ్యూజిక్ అన్నీ ఫుల్ ఫన్ . చిన్న సైజ్, పెద్ద శబ్దం. వైర్‌లెస్ కరవోకే మైక్‌తో పాట పాడితే మీ వాయిస్ స్పష్టంగా, గట్టిగా వినిపిస్తుంది. ఫన్నీ వాయిస్ ఎఫెక్ట్స్‌తో స్మైల్ మోస్ట్ ఫన్! రంగురంగుల లైట్లు బీట్‌కు ట్యున్ అవుతూ గేమ్ మూడ్‌లోకి లాగేస్తాయి. సింగిల్ చార్జ్‌తో ఆరు గంటల నాన్ స్టాప్ మ్యూజిక్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆటో ప్లే మోడ్ సపోర్ట్. చిన్న బటన్‌లు, మల్టీ ఫంక్షన్. ఇలా ఏ ప్లేస్‌లోనైనా పార్టీ మూడ్‌ను సెట్ చేసే మాస్టర్! ధర రూ. 1,499 మాత్రమే!.
స్పిరిట్ స్టార్ట్!
ఐస్.. గ్లాస్‌లో వేస్తే కూల్ మాత్రమే కాదు, ఇప్పుడు కూల్ పార్టీ స్టార్‌లా కూడా మారిపోతుంది. ఎందుకంటే, ‘మల్టీకలర్ ఐస్ క్యూబ్స్’ రంగు రంగుల మహిమాన్విత రత్నాల్లా కనిపిస్తాయి. కాని, ఇవి గ్లాస్‌లో పడిన క్షణం నుంచే నీ డ్రింక్ ‘నేను మెరిసిపోతున్నా!’ అని లైట్స్‌తో చూపులను లాగేసుకుంటుంది. ఒక్క బటన్ నొక్కితే ఇంద్రధనుస్సులోని రంగులన్నీ కలసి ఒకేసారి డాన్స్ చేస్తాయి! స్టెడీ లైట్ కావాలా, డీజే ఫ్లాష్ మోడ్ కావాలా? మూడ్ ఏదైనా, ఈ చిన్న క్యూబ్స్ వెంటనే అర్థం చేసుకుని రంగులు మార్చేస్తాయి. ఐస్‌లో వేసినా, నీటిలో వేసినా వెలుగుతూనే ఉంటాయి. ప్రతి క్యూబ్ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది గంటలు పనిచేస్తుంది. ఒకసారి కొనుక్కుంటే రెండు, మూడు పార్టీలను ఈజీగా మెరిపిస్తాయి. ధర రూ. 2,680 మాత్రమే!
పాన్ చాట్
కావలసినవి: తమలపాకులు – 10పైనే, శనగపిండి– అరకప్పు నూనె, నీళ్లు, ఉప్పు– సరిపడా, పసుపు – కొద్దిగా
కారం– ఒక టీ స్పూన్ , ఆమ్‌చూర్, ధనియాలు జీలకర్ర పొడి– అర టీస్పూన్, గడ్డ పెరుగు – ఒక కప్పు, పంచదార – ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా – ఒక టీస్పూన్ , కొత్తిమీర చట్నీ లేదా చింతపండు చట్నీ – కొద్దికొద్దిగా, కారప్పూస, దానిమ్మగింజలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము – కొద్దికొద్దిగా
తయారీ: ముందుగా ఒక బౌల్‌లో శనగపిండి, పసుపు, కారం, కొద్దిగా ఉప్పు, ఆమ్‌చూర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్‌లో తమలపాకులు ముంచి, నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగులో పంచదార, గరం మసాలా వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక్కో తమలపాకు వడమీద కొద్దికొద్దిగా పెరుగు మిశ్రమాన్ని, కొత్తిమీర చట్నీ లేదా చింతపండు చట్నీ వంటివి వేసుకోవాలి. ఆపైన కారప్పూస, దానిమ్మ గింజలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుముతో మరిన్ని నచ్చినవి జల్లుకుని సర్వ్ చేసుకుంటే, ఈ పాన్ చాట్ భలే రుచిగా ఉంటుంది.
వెలుగుల బుడగలు!
బెలూన్స్ అంటేనే పార్టీ మోడ్ ఆన్ ! ఇప్పుడు ఆ మజా మరింత మెరిసేలా మార్చడానికి వచ్చేశాయి ‘పార్టీ ప్రాప్స్ ఎల్‌ఈడీ బెలూన్స్’. ఒక్క సెట్‌లో ఇరవై ఐదు బెలూన్స్, ప్రతి ఒక్కటి రంగురంగుల లైట్స్‌తో మెరిసి, వేడుకకు రాక్‌స్టార్ ఎఫెక్ట్ ఇస్తాయి. చిన్నపిల్లల పుట్టినరోజు, ప్రేమికుల వార్షికోత్సవం, ఫ్రెండ్స్ కలిసిన సందర్భం ఇలా ఏదైనా వీటి రాకతో, చిన్న ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ అయిపోతుంది. అన్నింటినీ సెట్ చేసి, కేవలం ఒక్క స్విచ్ నొక్కితే చాలు, బెలూన్స్‌లోని లైట్స్ ఆన్ అయి, వెలుగుల పండుగను ప్రారంభిస్తాయి. ఉపయోగించడం సులభం. ధర రూ. 397 మాత్రమే!
ఐస్ క్రీమ్ బర్గర్
కావలసినవి: బన్స్ – 2 లేదా 4, ఐస్‌క్రీమ్ – 4 లేదా 8 స్కూప్స్ (వీటిని సర్వ్ చేసుకునే ముందే ఫ్రిజ్‌లోంచి బయటికి తియ్యాలి, వెనీలా, చాక్లెట్, స్ట్రాబెర్రీ వంటి ఫ్లేవర్స్ ఎంచుకోవచ్చు), పీనట్ బటర్ – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి, బాదం, జీడిపప్పు – కొద్దికొద్దిగా (దోరగా నేతిలో వేయించి చిన్నచిన్నగా కట్ చేసుకోవాలి)
తయారీ: ముందుగా బన్స్‌ని మధ్యలోకి సమాంతరంగా కట్ చేసి ఓవెన్ లో నేతితో బేక్ చేసుకోవాలి. అనంతరం లోపలవైపు పీనట్ బటర్ పూసుకుని, నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం జల్లుకుని, రెండేసి బన్స్ ముక్కలు తీసుకుని, వాటి మధ్యలో ఐస్ క్రీమ్ స్కూప్స్ పెట్టుకోవాలి. నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఈ బర్గర్స్ చాలా టేస్టీగా ఉంటాయి.
అరటిపువ్వు సమోసా
కావలసినవి: అరటి పువ్వు– ఒక కప్పు (కచ్చా బిచ్చా కట్ చేసుకుని–మసాలా, ఉప్పు వేసి, ఆవిరిపై మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి), క్యారట్ తురుము – పావు కప్పు, కొబ్బరి తురుము–పావు కప్పు సోయా సాస్, టొమాటో సాస్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్ల చొప్పున, గోధుమ పిండి – 2 కప్పులు, మైదా పిండి – ఒక కప్పు మిరియాల పొడి – 1 టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో క్యారట్ తురుము, కొబ్బరి తురుము, మిరియాల పొడి, అరటి పువ్వు ముక్కలు, సోయా సాస్, టొమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, అర టేబుల్ స్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. అనంతరం ఆ ముద్దపైన తడిబట్ట కప్పి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, ఆ ఉండల్ని చపాతీలా ఒత్తి, సమోసాలా చుట్టి అందులో అరటి పువ్వుల మిశ్రమాన్ని పెట్టి, ఊడిపోకుండా ఫోల్డ్ చేసుకోవాలి. వాటిని కాగిన నూనెలో వేయించి తీస్తే సరిపోతుంది.


