
నోట్లో వేసుకోగానే జివ్వుమనిపించే ఐస్‌క్రీమ్ జిహ్వకు ఒక చల్లని చలువ వేడుక ఆబాల గోపాలానికీ నోరూరించే ఐస్‌క్రీమ్ తరతరాలకు తియ్యని రుచుల కానుక ప్రపంచవ్యాప్తంగా ఐస్‌క్రీమ్ ఒక భావోద్వేగం తియ్యని చల్లని ఐస్‌క్రీమ్ ఒక మధురోత్సాహం!
స్కూల్ విడిచిపెట్టగానే ముందు సందులోనూ..సెలవలొచ్చి ఇంట్లో ఉంటే, వీధి చివరి సందులోనూ..ప్రత్యేకమైన ఒక బెల్ మోగుతుంటుంది. అది వినగానే పిల్లలకు ఆకలి మొదలైపోతుంది! అది అట్టాంటి ఇట్టాంటి ఆకలి కాదు,కేవలం ఐస్‌క్రీమ్ ఆకలి! ఆరు నూరైనా ఐస్‌క్రీమ్ తింటేనే తీరుతుంది! ఇక ఆ బెల్ ఏ బండిదో చెప్పుకోనక్కర్లేదు కదూ! నిజానికి ఆ శబ్దం– పెద్దలను కూడా బాల్యానికి నెడుతుంది! సందర్భమేమీ లేకపోయినా, ఉన్నపళంగా కుటుంబంలో తియ్యని వేడుకను సృష్టించగలుగుతుంది! అదే ఐస్‌క్రీమ్‌కి ఉన్న క్రేజ్!
‘పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి’ అంటారు పెద్దలు.
అయితే నోరూరించే తియ్యదనం, నాలుకపై చిందులేసే చల్లదనం ఊహల్లో మెదలగానే,
అన్ని జిహ్వలు కోరేది ఒక్కటే– ఐస్‌క్రీమ్! అది కేవలం ఆహారం మాత్రమే కాదు,
ఒక మధురానుభూతి!
శీతల పానీయాల నుంచి హిమక్రీములకు సాగిన ఐస్‌క్రీమ్ చరిత్ర– ఐస్‌క్రీమ్ తిన్నంత తియ్యగా ఉంటుంది. నిజానికి ఐస్‌క్రీమ్, సరిగ్గా ఎప్పుడు మొదలైంది? ఎవరు కనిపెట్టారు? అనే ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోయినా, క్రీ.పూ. 4 వేల సంవత్సరాల కాలంలోనే మనిషి చల్లని రుచులను ఆస్వాదించడం మొదలుపెట్టాడట! ‘టర్కీ–సిరియా–ఇరాక్ దేశాల గుండా ప్రవహించే టైగ్రిస్, యూఫ్రటిస్ నదుల పరివాహక ప్రాంతమైన మెసపొటేమియాను ‘ప్రపంచ నాగరికతకు పుట్టినిల్లు’గా గుర్తిస్తారు! అందులో భాగమైన దక్షిణ ఇరాక్‌లోని యూఫ్రటిస్ నది సమీపంలో ఎల్లవేళలా తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటాయి. అక్కడ జీవనం సాగించిన, క్రీ.పూ. ఐదో శతాబ్దం నాటికి పర్షియన్లు తమ నివాసాలను చల్లబరచుకోవడానికి, రాత్రి వేళల్లో సహజంగా ఏర్పడిన మంచును భూగర్భంలో నిల్వ చేసుకుని, వాడుకునేవారు. కాలక్రమేణా ‘యఖ్చాల్’ అనే హిమగృహాలను ఏర్పాటు చేసుకునేవారు. సాంకేతికాభివృద్ధి పెరిగి, రిఫ్రిజిరేటర్స్ వాడుకలోకి వచ్చాక ఐస్‌క్రీమ్ చరిత్ర చల్లని మలుపు తిరిగింది.
క్రీ.పూ. ఐదో శతాబ్దంలో గ్రీకు రాజధాని ఏథెన్స్ ్సలో వైన్స్ ను చల్లబరచడానికి మంచును విక్రయించేవారట! మరోవైపు ఒకటో శతాబ్దానికి చెందిన రోమన్స్ చక్రవర్తి నీరో– తేనెతో కూడిన చల్లని పానీయాలను ఆస్వాదించేవాడు. చైనాలో టాంగ్ రాజవంశీకుల కాలంలో కర్పూరం కలిపిన గేదె పాలతో తియ్యటి పానీయాలు చేసుకుని, చల్లగా తాగేవారట! అలాగే పర్షియన్స్ వంటకమైన ‘ఫాలూదా’ శతాబ్దాల నాటిదని చరిత్ర చెబుతుంది. ఎందరో ఇష్టపడి ఆస్వాదించే చల్లచల్లని ‘షర్బత్’కి ఏళ్లనాటి అరబిక్ మూలాలున్నాయి. తర్వాత తర్వాత చల్లగా తాగే తీపి పదార్థాలను గడ్డ కట్టించి ఐస్‌క్రీమ్‌లా ఆస్వాదించడం మొదలైంది. ఈ క్రమంలోనే భారత్‌లో మొఘల్ చక్రవర్తులు ‘కుల్ఫీ’ని ఇష్టంగా తినేవారట. ఇది పాల మీగడను గడ్డకట్టించి, తయారు చేసే ఒక రకమైన ఐస్‌క్రీమ్!
పాప్సికిల్ – ఓ అనుకోని రుచి
పాప్సికిల్ (పుల్ల ఐస్) చరిత్ర చాలా ఆసక్తికరంగా, అనుకోని రీతిలో మొదలైంది. ఫ్రాంక్ ఎపర్సన్స్ అనే పదకొండేళ్ల కుర్రాడు, దీనిని 1905లో తొలిసారి కనుగొన్నాడు. శీతకాలంలో ఒక రాత్రి– ఫ్రాంక్ తన పెరట్లో సోడా పౌడర్, నీళ్లు కలిపిన గ్లాసును, ఆ నీళ్లను కలపడానికి వాడే ఒక పుల్లతో సహా ఆరుబయట అలాగే వదిలేశాడు. తెల్లవారేసరికి, గ్లాసులోని మిశ్రమం రంగులో గడ్డకట్టి, పుల్లతో సహా చేతిలోకొచ్చిందట. దానిని కాస్త రుచి చూస్తే అదిరిపోయిందట! దానికి ‘ఎప్సికిల్’ అని పేరుపెట్టాడు ఫ్రాంక్. ఆ రుచిని వెంటనే తన స్నేహితులకు, పక్కింటి పిల్లలకు పరిచయం చేశాడు. వాళ్లు కూడా ఇష్టంగా తిన్నారు.
1922లో కాలిఫోర్నియా, ఆక్లండ్‌లో జరిగిన ఒక డ్యాన్స్ ్స పార్టీలో పాల్గొన్నవారందరికీ ‘ఫ్రాంక్ ఎపర్సన్స్ ’ తాను తయారు చేసిన పాప్సికిల్ రుచిని తొలిసారి పరిచయం చేశాడు. వారంతా ఆ రుచిని ఎంతో ఇష్టపడ్డారు. ఆ క్రేజ్‌తోనే ఆ మరుసటి ఏడాది దానిపై పేటెంట్ పొందాడు ఫ్రాంక్. ఆ రోజుల్లో, పాప్సికిల్‌ను ఎక్కువగా స్ట్రాబెర్రీ, నారింజ, చెర్రీ వంటి పండ్ల రుచులలో తయారు చేసుకునేవారు. కాలక్రమేణా ఈ పుల్ల ఐస్ చిన్ననాటి జ్ఞాపకాలకు, వేసవి వినోదానికి గుర్తుగా మారింది.
హిమక్రీములు విశేషాలు
వాతావరణం వేడెక్కుతున్నప్పుడు, ఎక్కువగా ఐస్‌క్రీమ్ తినడం సహజమే! శతాబ్దాలుగా అన్ని వయస్సులవారికీ ఆనందాన్ని పంచుతున్న ఈ తియ్యని, చల్లని పదార్థం కేవలం రుచికే కాదు, కొన్ని ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలకూ బెస్టేనట. ఒకటి లేదా రెండు హెల్దీ ఐస్‌క్రీమ్ స్కూప్‌లను తింటే తప్పేమీ లేదట. ప్రమాదమేమీ కాదట!
ఇంటర్నేషనల్ డైరీ ఫుడ్స్ అసోసియేషన్స్ ప్రకారం, సగటు అమెరికన్స్ సంవత్సరానికి 20 పౌండ్ల ఐస్ క్రీమ్‌ను తింటాడట. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏటా సుమారు 13 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతుందట!
పాల పదార్థాలతో చేసిన ఐస్‌క్రీమ్‌లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఐస్‌క్రీమ్ కొనుగోలు చేసేటప్పుడు ‘ప్రోబయోటిక్ ఐస్‌క్రీమ్’ లేదా ‘లైవ్ అండ్ యాక్టివ్ కల్చర్స్’ వంటి లేబుల్ ఉందో లేదో చూసి కొనుగోలు చేయడం మంచిది.
ఐస్‌క్రీమ్‌తో రికార్డ్స్!
ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారు అరుదుగా ఉంటారు. అయితే, కొందరు ఐస్‌క్రీమ్‌ను కేవలం తినడమే కాకుండా, దానితో ప్రపంచ రికార్డులను సైతం సృష్టించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైన ఐస్‌క్రీమ్ అద్భుతాలను చూద్దాం!
నిమిషంలో చప్పరించేవాడు
ఐస్ ఎక్కువగా తిన్నా, వేగంగా తిన్నా బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. తలలోంచి తీవ్రమైన నొప్పి వస్తుంది. అలాంటిది ఐజాక్ హార్డింగ్ డేవిస్ అనే వ్యక్తి 2017 జూలై 16న కేవలం ఒక నిమిషంలో 806 గ్రాముల ఐస్‌క్రీమ్‌ను లాగించేసి, వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.
నోరూరించే అతిపెద్ద స్కూప్
సాధారణంగా ఐస్‌క్రీమ్ లవర్స్‌కి పెద్ద స్కూప్ చూస్తే భలే సంబరంగా ఉంటుంది. అలాంటి వారి కోసం ‘కెంప్స్’ అనే సంస్థ, 2014 జూన్ 28న తన శత వార్షికోత్సవ వేడుకల్లో అతిపెద్ద స్కూప్‌ని ప్రదర్శించింది. ‘విస్కాన్సిన్స్ లోని సెడార్‌బర్గ్ స్ట్రాబెర్రీ ఫెస్టివల్’లో 5 అడుగుల 6 అంగుళాల పొడవు, 6 అడుగుల 2 అంగుళాల వెడల్పుతో భారీ స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్ స్కూప్‌ను తయారుచేసి, రికార్డు సృష్టించింది.
ఎత్తైన కోన్ ఐస్‌క్రీమ్
ఎంతపెద్ద కోన్ ఐస్‌క్రీమ్ అయినా అరచేతి సైజుకి మించదు. అలాంటిది 10 అడుగుల 1.26 అంగుళాల ఎత్తైన కోన్ ఐస్‌క్రీమ్‌ని సృష్టించారు నార్వేకు చెందిన హెనిగ్ ఓల్సెన్, ట్రోండ్ ఎల్. వాయిన్ అనే ఇద్దరు స్నేహితులు 2015 జూలై 26న ఈ భారీ కోన్ ఐస్‌క్రీమ్‌ను సృష్టించి రికార్డ్ సాధించారు.
ఒక కోన్స్ పై అత్యధిక స్కూప్‌లు
ఒక ఐస్‌క్రీమ్ కోన్స్ పై సాధ్యమైనన్ని ఎక్కువ స్కూప్‌లను పేర్చడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. అయితే ఇటలీకి చెందిన దిమిత్రి పాన్‌చెరా సాధించిన రికార్డ్‌ను మాత్రం ఎవ్వరూ కొట్టలేరనిపిస్తుంది. ఎందుకంటే, గతంలో తాను సృష్టించిన రికార్డ్‌ని తానే బద్దలుకొట్టాడు. అతడు 2018, నవంబర్ 17న ఒకే కోనుపై 125 స్కూపులను నిలిపి రికార్డ్ సృష్టించాడు. అయితే గతంలో 121 స్కూపులను నిలిపి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించాడు.
పొడవాటి తియ్యని వేడుక
2011 జూలై 23న యూకేలోని పోర్ట్ స్టీవర్ట్‌లో ‘మోరెల్లి ఐస్‌క్రీమ్ షాప్’ ఒక ప్రత్యేకమైన రికార్డును సాధించింది. ఆ కంపెనీ వార్షికోత్సవం సందర్భంగా 2,728 మందిని ఒక చోటికి చేర్చి; ప్రతి ఒక్కరికీ ఐస్‌క్రీమ్ కప్స్ ఇచ్చి, ఒకరికి ఒకరు తినిపించుకోమని చెప్పింది. అలా 2,728 మందీ పొడవాటి మానవహారంలా నిలబడి, ఒకరికొకరు ఐస్‌క్రీమ్ తినిపించుకోవడంతో అది ప్రపంచ రికార్డ్‌గా నిలిచింది.
ఐస్‌క్రీమ్ కోన్‌లా మారిన మనుషులు
చైనాలో నెస్లే లిమిటెడ్ ఐస్‌క్రీమ్ కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక వినూత్న రికార్డ్ సృష్టించింది. 2019, డిసెంబర్ 18న రెండు వేరువేరు రంగుల దుస్తులు ధరించిన 478 మందికి జనం ఒక భారీ ఐస్‌క్రీమ్ కోన్స్ ను రూపొందించారు. ఇది గిన్నిస్ రికార్డ్ సృష్టించింది.
ఐస్‌క్రీమ్ కాన్వాయ్
సాధారణంగా ఐస్‌క్రీమ్ బండి వేసే హారన్ కూడా మనసులో ప్రత్యేకమైన ఉల్లాసాన్ని కలిగిస్తుంది. బాల్యంలోని రుచులన్నింటినీ గుర్తు చేస్తుంది. అందుకే యూకేలో 2018 అక్టోబర్ 16న ‘ది ఐస్‌క్రీమ్ వ్యాన్ డ్రీమ్ టీమ్’ అనే బృందం 84 ఐస్‌క్రీమ్ ట్రక్కులు, వ్యాన్‌లతో ఒకేసారి భారీ ఊరేగింపు చేసి, అద్భుతమైన ప్రపంచ రికార్డును సృష్టించింది.
ఐస్‌క్రీమ్ శతాబ్దాల పాటు ఒక ప్రత్యేకమైన, ఖరీదైన విలాసవంతమైన ఆహారంగా ఉండేది. చౌకైన రిఫ్రిజిరేటర్లు సామాన్యులకు అందుబాటులోకి వచ్చేంత వరకు ఐస్‌క్రీమ్ లగ్జరీ రుచే! సాంకేతికత అందుబాటులోకి వచ్చాకే ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల వారు ఐస్‌క్రీమ్‌ను రుచి చూడగలుగుతున్నారు.
మరో అమెరికన్ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఐస్‌క్రీమ్ మీద ప్రేమతో జూలై నెలను ఐస్‌క్రీమ్ నెలగా ప్రకటించాడు. జూలై మూడో ఆదివారాన్ని ‘ఐస్‌క్రీమ్ డే’గా ప్రకటించాడు.
ఐస్‌క్రీమ్‌ను అత్యధికంగా తినే దేశాలలో యునైటెడ్ స్టేట్స్ రెండో స్థానంలో ఉంది. తొలిస్థానం న్యూజీలండ్‌దట. అక్కడ సంవత్సరానికి సగటున ప్రతి వ్యక్తి సుమారు 20 నుంచి 22 కేజీల ఐస్‌క్రీమ్‌ను తింటున్నారట.
ఐస్‌క్రీమ్‌లో కూడా శరీరానికి అవసరమైన ప్రొటీన్లతో పాటు విటమిన్స్ ఎ, డి, బి12 వంటివి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
ఒత్తిడి, ఆందోళన, విచారం ఉన్నప్పుడు చాలామంది ఐస్‌క్రీమ్ వైపు మొగ్గు చూపుతారట. ఐస్‌క్రీమ్ డోపమైన్, సెరోటోనిన్స్ వంటి హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తాయి. వీటిని ‘ఫీల్–గుడ్’ హార్మోన్లు అంటారు. అందుకే అప్పుడప్పుడు ఈ తియ్యని, చల్లని ట్రీట్‌ను ఆస్వాదించి, మానసిక స్థితిని మెరుగుపరచుకోవచ్చు.
మూడు నుంచి నాలుగు కేజీల ఐస్‌క్రీమ్ ఉత్పత్తికి, సుమారు 10 నుంచి 12 లీటర్ల పాలు అవసరమవుతాయి.
థామస్ జెఫర్సన్స్ – అమెరికా అధ్యక్షుడు కావడానికి కొన్నేళ్ల ముందు ఫ్రాన్స్‌్సలో అమెరికా రాయబారిగా పనిచేసేవాడు. అక్కడ ఆయన వెనీలా ఐస్‌క్రీమ్ తొలిసారి రుచి చూసి మైమరచిపోయాడు. ఆ వెంటనే ఆ రెసిపీ తయారీ విధానాన్ని నోట్ చేసుకుని మరీ, అమెరికా వంటకాల్లో భాగం చేసేశాడు. ఇక ఆ తర్వాత తన విందు భోజనాల్లో ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒక కప్పు ఐస్‌క్రీమ్ ఉండేలా చూసుకునేవాడు.
థామస్ జెఫర్సన్స్ అప్పటికే పరిచయం చేసిన ఆ ఐస్‌క్రీమ్ రుచి కోసం అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్స్ తపించిపోయేవాడట! ఆయన అధికారంలోకి రాగానే, వైట్‌హౌస్‌లో ఐస్‌క్రీమ్ తయారీ పరికరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించుకున్నాడు.
ఐస్‌క్రీమ్‌పైన చాక్లెట్ సిరప్ వేస్తే చాలామందికి నచ్చుతుందని సర్వేలు చెబుతున్నాయి. ఆ సిరప్.. ఐస్‌క్రీమ్ రుచిని మరింత పెంచుతుంది.
ఐస్‌క్రీమ్ రుచిని పరీక్షించే నిపుణులు బంగారు చెంచాలను ఉపయోగిస్తారు. దీనికి కారణం, ఇతర లోహాలతో తయారు చేసిన చెంచాలు ఐస్‌క్రీమ్ రుచిని సూక్ష్మంగా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. ఐస్‌క్రీమ్ అసలు రుచిని ఏమాత్రం మిస్ కాకుండా ఉండటానికే బంగారు చెంచాలను ఉపయోగిస్తారు.
బరాక్ ఒబామా
అమెరికా అధ్యక్షుడిగా మారడానికి ముందు, బరాక్ ఒబామా హవాయిలోని హోనోలులులో ఉన్న ఒక బాస్కిన్–రాబిన్స్ ్స ఐస్‌క్రీమ్ పార్లర్‌లో పనిచేశారు. ఈ ఉద్యోగం తనకు బాధ్యతలను నేర్పిందని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
జూలియా రాబర్ట్స్
ప్రముఖ హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ కూడా ఒకప్పుడు ఐస్‌క్రీమ్ స్కూప్ చేస్తూ పనిచేశారట. ‘మిస్టిక్ పిజ్జా’ చిత్రంలో ఆమె పాత్ర ప్రస్తావనతో పాటు ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఆస్కార్ అవార్డు గ్రహీత కూడా!
జూలియా లూయీ–డ్రైఫన్
‘కమేడియన్స్ ్స ఇన్ కార్స్ గెట్టింగ్ కాఫీ’ అనే కార్యక్రమంలో ప్రముఖ నటి జూలియా లూయీ–డ్రైఫస్ తన ఐస్‌క్రీమ్ పార్లర్ అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె స్వెన్స్ సెన్స్ ్స అనే ఐస్‌క్రీమ్ పార్లర్‌లో పనిచేసినట్లు వెల్లడించారు. ఆమె ఎమ్మీ అవార్డు గ్రహీతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
బాబీ ఫ్లే – ప్రసిద్ధ అమెరికన్ షెఫ్, టీవీ పర్సనాలిటీ అయిన బాబీ ఫ్లే కూడా యువకుడిగా ఉన్నప్పుడు ఐస్‌క్రీమ్ స్కూపర్‌గా పనిచేశారు.
హిమక్రీముల క్రేజు
‘ఐస్‌క్రీమ్ రుచుల కోసం మనుషులే కాదు, యమలోకం నుంచి యముడైనా కదిలి రావాల్సిందే’ అన్నట్లు నటించారు ‘యమలీల’ చిత్రంలోని కైకాల సత్యనారాయణ. ఆ సినిమాలో ఆయన ‘హిమక్రీములున్నాయా నాయనా?’ అంటూ ఐస్‌క్రీముల కోసం తపించడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం 1994లో విడుదలైంది. ఈ ఒక్క సన్నివేశంతో ఆనాడు ఐస్‌క్రీమ్ పట్ల ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా తెలియజేస్తుంది. నిజానికి, హిమక్రీములంటే జనాల్లో నేటికీ అదే మోజుంది, అదే క్రేజుంది!
ఐస్‌క్రీమ్ గురించి విన్నా, చూసినా, చదివినా వెంటనే తినాలనిపించే అనుభూతి కలగడం సహజం! చల్లని తియ్యని రుచులను కోరుకునే వారు ఇంట్లోనే ఐస్‌క్రీమ్ తయారు చేసుకోవచ్చు. పైగా ఇంట్లోనే సులభంగా ఐస్‌క్రీమ్స్ చేసుకునే మేకర్స్ కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి! మరోవైపు బయట అమ్ముడయ్యే కొన్నిరకాల ఐస్‌క్రీములు చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు! ఇక ఇంట్లో ఐస్‌క్రీమ్ తయారు చేసుకునేటప్పుడు పంచదార, ఐస్‌క్రీమ్ ఎసెన్స్ వంటివి ఆరోగ్యానికి అనర్థం అనుకుంటే, వాటిని కలపకుండా కూడా ఐస్‌క్రీమ్ చేసుకోవచ్చు. తియ్యటి పండ్లతోనో, కమ్మటి కూరగాయలతోనో మెత్తటి గుజ్జు చేసుకుని, దానిలో తేనెనో, ఖర్జూరాలో, బెల్లం తురుమో జోడించి డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఇంటిల్లిపాది చల్లని వేడుక చేసుకోవచ్చు. పండ్లు, కూరగాయలు ఇష్టంగా తినని పిల్లలతో ఇలా కూడా తినిపించొచ్చు. అయినా తియ్యని, చల్లని ఐస్‌క్రీమ్ రుచిని కాదనేవారు ఎవరుంటారు?
ఐస్‌క్రీమ్ పార్లర్లలో పనిచేసిన ప్రముఖులు
ఉన్నతమైన స్థానాలకు వెళ్లిన చాలామంది జీవితాల్లో ఆర్థిక కష్టాలు చాలానే ఉంటాయి. తొలినాళ్లలో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి చిన్నా చితకా పనులతో కాలం వెళ్లదీసిన ప్రముఖులు ఎందరో ఉంటారు. కొందరు ప్రముఖులు తమ కెరీర్ ప్రారంభంలో ఐస్‌క్రీమ్ పార్లర్లలో పనిచేశారు. వారిలో కొందరి ప్రముఖుల వివరాలు చూద్దాం.