సోషల్‌మీడియాలో రోజుకో కొత్త వింత పుట్టుకొస్తూనే ఉంటుంది. ఆశ్చర్యపరిచే, నవ్వించే ఫన్నీ వీడియోలు ఎన్నో వస్తుంటాయి. సాధారణంగా యువకులకు బైక్ లంటే చాలా క్రేజ్ ఉంటుంది, కానీ ఒక బాబా బైక్‌పై విన్యాసాలు చేయడం చూశారా? తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.
కాషాయ వస్త్రాలు ధరించి, రద్దీగా ఉండే రహదారిపై చేసిన బైక్ స్టంట్స్ చేశారు. రన్నింగ్ బైక్‌పై బైక్ హ్యాండిల్‌ను చేతులతో కాకుండా ఒక కాలుతో పట్టుకుని, రెండు చేతులు గాల్లో ఊపుతూ స్టంట్స్ చేశారు. ఆయన బ్యాలెన్సింగ్ చూసి చుట్టుపక్కల వాహనదారులు కూడా నోరెళ్లబెడుతున్నారు. తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోపై జనాలు ఎంతో రొమాంటిక్, ఫన్నీ కామెంట్స్ చేస్తూ బాగా లైక్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో bittu_22k అనే అకౌంట్ నుండి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 4.7 మిలియన్లకు పైగా వ్యూస్, అలాగే 1.79 లక్షలకి పైగా లైక్స్ వచ్చాయి. అయితే ఇది ఏ ప్రాంతానికి చెందిందనే వివరాలు అందుబాటులో లేవు.
రన్నింగ్ బైక్‌పై బాబా చేసిన ఈ స్టంట్ చూసి జనాలే షాక్ అవుతున్నారు. అయితే, రోడ్డుపై ఇలాంటి స్టంట్స్ చేయడం ప్రాణాంతకం కాబట్టి, చాలా మంది దీనిని ప్రమాదకరమైన చర్యగా పేర్కొంటున్నారు.'యమరాజుతో డైరెక్ట్ కనెక్షన్' అంటూ నెటిజన్లు తెగ సెటైర్లు వేశారు.
నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
"బాబాకు బహుశా యమరాజుతో డైరెక్ట్ ఫ్రెండ్‌షిప్ ఉన్నట్టుంది.", "నేను బాబా టిల్లూ..." అని కామెంట్ చేశారు. "బాబా గారి బైక్ బహుశా ఆటోమేటిక్ అనుకుంటా!" అని ఒకరు, "బాబా తన శక్తులన్నింటినీ ఇక్కడే వాడుతున్నారు." అని మరొకరుకామెంట్ చేశారు.
నోట్ : అత్యంత ప్రమాదకరమైన ఇలాంటి స్టంట్లు చేయడం అస్సలు సరికాదు. ఇది సదరు వ్యక్తి ప్రాణాలకే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుందని గమనించాలి. సో...ఇలాంటి నిర్లక్ష్యపు విన్యాసాలు ఏదో థ్రిల్ ఇస్తాయనుకోవడం పొరబాటే. కాదూ కూడదంటే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


