ముంబై: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను ‘నీమ్ కరోలీ బాబా’ అభినందించారు. ‘ఇండియా టుడే ముంబై కాన్‌క్లేవ్ 2026’లో పాల్గొన్న 'హనుమాన్ అంశ్' చిత్ర నటుడు, దర్శకుడు శోభినవ్ సత్య.. ఫ్లైదుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మఛార్ ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రశంసించారు. విమానంలో కో-పైలట్ దాడి చేసిన విపత్కర సమయంలో కెప్టెన్ హనుమాన్ చాలీసా పఠిస్తూ సంయమనం పాటించారని, దీనిపై సమాచారం తెలిసిన వెంటనే తాను వీడియో రూపొందించి షేర్ చేశానని తెలిపారు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో కో-పైలట్ అకస్మాత్తుగా దాడికి పాల్పడటంతో తీవ్ర అలజడి రేగింది. ఆ పెనుగులాట మధ్య విమానం కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే దాదాపు 14,000 అడుగుల మేర కిందికి పడిపోయి ప్రమాదకర స్థితికి చేరుకుంది. తీవ్ర గాయాలవుతున్నా కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ హనుమాన్ చాలీసా పఠిస్తూ విమానం నియంత్రణ కోల్పోకుండా చూశారు.
అనంతరం సిబ్బంది, ప్రయాణికులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దగా, విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌కు సురక్షితంగా మళ్లించి, అందులోని 174 మంది ప్రాణాలను కాపాడారు. తర్వాత ప్రధాని మోదీతో మాట్లాడిన సందర్భంలోనూ నొప్పిని భరిస్తూ చాలీసా పఠించడమే తనకు స్థైర్యాన్ని ఇచ్చిందని పైలట్ స్వయంగా వెల్లడించారు. ధైర్యసాహసాలు కేవలం కథలకే పరిమితం కాదని, నేటి కాలంలోనూ నిజమైన హీరోలు ఉన్నారని ఈ ఘటన రుజువు చేసిందని శోభినవ్ పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో పైలట్ ప్రదర్శించిన భక్తి, ఆధ్యాత్మిక విశ్వాసం ప్రతి ఒక్కరి నమ్మకాన్ని మరింత బలోపేతం చేశాయని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: దుర్గా పూజకు కోల్‌కతా.. ఈ ప్రదేశాలను తప్పక చూడండి!


