breaking news
congrates
-
స్మిత్ మచ్చార్‌కు ‘నీమ్ కరోలీ బాబా’ అభినందనలు!
ముంబై: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను ‘నీమ్ కరోలీ బాబా’ అభినందించారు. ‘ఇండియా టుడే ముంబై కాన్క్లేవ్ 2026’లో పాల్గొన్న 'హనుమాన్ అంశ్' చిత్ర నటుడు, దర్శకుడు శోభినవ్ సత్య.. ఫ్లైదుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మఛార్ ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రశంసించారు. విమానంలో కో-పైలట్ దాడి చేసిన విపత్కర సమయంలో కెప్టెన్ హనుమాన్ చాలీసా పఠిస్తూ సంయమనం పాటించారని, దీనిపై సమాచారం తెలిసిన వెంటనే తాను వీడియో రూపొందించి షేర్ చేశానని తెలిపారు.దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో కో-పైలట్ అకస్మాత్తుగా దాడికి పాల్పడటంతో తీవ్ర అలజడి రేగింది. ఆ పెనుగులాట మధ్య విమానం కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే దాదాపు 14,000 అడుగుల మేర కిందికి పడిపోయి ప్రమాదకర స్థితికి చేరుకుంది. తీవ్ర గాయాలవుతున్నా కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ హనుమాన్ చాలీసా పఠిస్తూ విమానం నియంత్రణ కోల్పోకుండా చూశారు.అనంతరం సిబ్బంది, ప్రయాణికులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దగా, విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్కు సురక్షితంగా మళ్లించి, అందులోని 174 మంది ప్రాణాలను కాపాడారు. తర్వాత ప్రధాని మోదీతో మాట్లాడిన సందర్భంలోనూ నొప్పిని భరిస్తూ చాలీసా పఠించడమే తనకు స్థైర్యాన్ని ఇచ్చిందని పైలట్ స్వయంగా వెల్లడించారు. ధైర్యసాహసాలు కేవలం కథలకే పరిమితం కాదని, నేటి కాలంలోనూ నిజమైన హీరోలు ఉన్నారని ఈ ఘటన రుజువు చేసిందని శోభినవ్ పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో పైలట్ ప్రదర్శించిన భక్తి, ఆధ్యాత్మిక విశ్వాసం ప్రతి ఒక్కరి నమ్మకాన్ని మరింత బలోపేతం చేశాయని ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: దుర్గా పూజకు కోల్‌కతా.. ఈ ప్రదేశాలను తప్పక చూడండి! -
సాక్షి, సింధులకు ‘ఇస్కఫ్’ జేజేలు
మొగల్రాజపురం : నూతన జాతీయ క్రీడా విధానాన్ని ప్రభుత్వాలు ప్రకటించాలని ఇండియన్ సొసైటి ఫర్ కల్చరల్ కో–ఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్ (ఇస్కఫ్) జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కె.సుబ్బరాజు అన్నారు. మంగళవారం ఉదయం ప్రజాశక్తినగర్‌లోని చండ్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సింధు, సాక్షి మాలిక్‌కు అభినందిస్తూ సభ జరిగింది. సుబ్బరాజు ముఖ్యఅతి«థిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు అన్ని స్థాయిల్లో ఆటలు, క్రీడలను ప్రోత్సహిస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేయాలన్నారు. సభకు ‘ఇస్కఫ్’ నగర అధ్యక్షుడు డాక్టర్ తాటి శ్రీకృష్ణ అధ్యక్షత వహించారు. ఎ.పి.ఎస్.వై.ఎఫ్.అధ్యక్షుడు నవనీతం సాంబశివరావు, ఇస్కఫ్ సభ్యులు మహాబూబ్ ఆజం, పూజారి దుర్గారావు, దంతలూరి రామలింగరాజు, జి.లలితానంద్ పాల్గొన్నారు. -
థాంక్యూ పోలీస్...
ఓ ఇంటికి విచారణ కోసం వెళ్లిన కానిస్టేబుల్‌కు ప్రతిఫలంగా డబ్బులి వ్వబోతే ప్రభుత్వం తనకు జీతమిస్తుండగా నాకెందుకు నజరానా అం టూ దరఖాస్తుదారు ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన పోలీస్ కానిస్టేబుల్ నారాయణరావుకు చేతులెత్తి సెల్యూట్ చేయాల్సిందే. లం చం లేనిదే ఎఫ్ఐఆర్ కూడా రాయడానికి వీలులేని పోలీసుశాఖలో తనకు వచ్చే జీతం చాలని ప్రకటించిన ఈ నిజాయితీ పరుడిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పిలిపించి అభినందించడంతో యావత్ పోలీసు శాఖను గౌరవించినట్లయింది. ఈ సాధారణ పోలీసు ప్రవర్తనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ప్రభుత్వోద్యోగి కూడా నజరా నాలు తీసుకోకుండా జీతభత్యాలతోనే పని చేయగలిగినప్పుడు తెలం గాణ రాష్ట్రం కొత్త ఉద్యోగ సంస్కృతిని నెలకొల్పినట్లే అవుతుంది. ఇదే సమయంలో పోలీసుశాఖలో ఏళ్ల తరబడి ఒకే పనిలో ఉంటున్న వారి నిజాయితీని, సీనియారిటీని గుర్తించి వారికి పదోన్నతులు కల్పించాలి. అలాగే ఉద్యోగులు, ప్రత్యేకించి తాహసిల్దార్ల పనివిధానం వల్లనే బం గారు తెలంగాణ సాధ్యమౌతుందని సీఎం గతంలోనే సెలవిచ్చారు. తమకూ, సంబంధిత విభాగానికి మచ్చ తేకుండా పనిచేయడం ద్వారా నే ఉద్యోగులు నూతన రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కాగలరు. చివ రిగా నిజాయితీని పుణికిపుచ్చుకున్న కిందిస్థాయి ఉద్యోగులను ప్రభు త్వం గుర్తించాలి. అదే సమాజానికి అసలైన రక్షరేకగా ఉంటుంది. - అమన్ రాజీవ్ బెల్లంపల్లి


