సాక్షి, సింధులకు ‘ఇస్కఫ్‌’ జేజేలు | congrates for olympics winners | Sakshi
Sakshi News home page

సాక్షి, సింధులకు ‘ఇస్కఫ్‌’ జేజేలు

Aug 23 2016 9:06 PM | Updated on Sep 4 2017 10:33 AM

నూతన జాతీయ క్రీడా విధానాన్ని ప్రభుత్వాలు ప్రకటించాలని ఇండియన్‌ సొసైటి ఫర్‌ కల్చరల్‌ కో–ఆపరేషన్‌ అండ్‌ ఫ్రెండ్‌షిప్‌ (ఇస్కఫ్‌) జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కె.సుబ్బరాజు అన్నారు.

మొగల్రాజపురం :
నూతన  జాతీయ క్రీడా విధానాన్ని ప్రభుత్వాలు ప్రకటించాలని ఇండియన్‌ సొసైటి ఫర్‌ కల్చరల్‌ కో–ఆపరేషన్‌ అండ్‌ ఫ్రెండ్‌షిప్‌ (ఇస్కఫ్‌) జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కె.సుబ్బరాజు అన్నారు. మంగళవారం ఉదయం ప్రజాశక్తినగర్‌లోని చండ్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సింధు, సాక్షి  మాలిక్‌కు అభినందిస్తూ సభ జరిగింది. సుబ్బరాజు ముఖ్యఅతి«థిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు అన్ని స్థాయిల్లో ఆటలు, క్రీడలను ప్రోత్సహిస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేయాలన్నారు. సభకు ‘ఇస్కఫ్‌’ నగర అధ్యక్షుడు డాక్టర్‌ తాటి శ్రీకృష్ణ అధ్యక్షత వహించారు. ఎ.పి.ఎస్‌.వై.ఎఫ్‌.అధ్యక్షుడు నవనీతం సాంబశివరావు, ఇస్కఫ్‌ సభ్యులు మహాబూబ్‌ ఆజం, పూజారి దుర్గారావు, దంతలూరి రామలింగరాజు, జి.లలితానంద్‌ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement