హైదరాబాద్‌ మహిళల టి20 జట్టు కెప్టెన్‌గా ప్రణవి చంద్ర | Pranavi Chandra named captain of Hyderabad womens T20 team | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ మహిళల టి20 జట్టు కెప్టెన్‌గా ప్రణవి చంద్ర

Oct 8 2026 4:04 AM | Updated on Oct 8 2026 4:04 AM

Pranavi Chandra named captain of Hyderabad womens T20 team

సాక్షి, హైదరాబాద్‌: బీసీసీఐ సీనియర్‌ మహిళల టి20 ఎలీట్‌ టోర్నీలో పాల్గొనే హైదరాబాద్‌ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ టీమ్‌కు వెలగపూడి ప్రణవి చంద్ర కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, వైస్‌ కెప్టెన్‌గా వికెట్‌ కీపర్‌ ఎం.మమతను ఎంపిక చేశారు. మహారాష్ట్రలోని పుణేలో ఈ నెల 26 నుంచి టోర్నమెంట్‌ జరుగుతుంది. గతంలో హైదరాబాద్‌ టీమ్‌కు మూడేళ్లు ఆడిన తర్వాత సౌత్‌జోన్‌ టీమ్‌కు ఎంపికైన ప్రణవి కేరళ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించింది. మహిళల కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌తో పాటు ఇంగ్లండ్‌లో ఈలింగ్, బిషప్‌ స్ట్రాట్‌ఫోర్ట్‌ జట్ల తరఫున ప్రణవి క్లబ్‌ క్రికెట్‌ కూడా ఆడింది.  

హైదరాబాద్‌ జట్టు: ప్రణవి చంద్ర (కెప్టెన్‌), ఎం.మమత (వైస్‌ కెప్టెన్‌), గొంగడి త్రిష, ధ్రుతి కేసరి, ఎస్‌. యషశ్రీ, వంకా పూజ, సంధ్య గోరా, కుంచల నితీశ, ఎం.సాక్షి రావు, కావ్యశ్రీ, ఎడ్ల సృజన, నల్లా క్రాంతి రెడ్డి, కె.నిధి, పి.పార్వతి, తాటి కృష్ణవేణి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement