Video: ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి | Russian Military Transport Aircraft Crashes In Siberia | Sakshi
Sakshi News home page

Video: ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి

Nov 18 2026 7:33 AM | Updated on Nov 18 2026 7:37 AM

Russian Military Transport Aircraft Crashes In Siberia

రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సైబీరియాలోని కెమెరోవో ప్రాంతంలో రష్యా సైన్యానికి చెందిన ఏఎన్‌-12 రవాణా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

విమానం కూలిపోవడానికి సాంకేతిక లోపమే ప్రాథమిక కారణమని.. జనసంచారం లేని ప్రాంతంలో విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద స్థలానికి చేరుకున్న అత్యవసర సహాయక బృందాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయని కెమెరోవో ప్రాంత గవర్నర్‌ ఇల్యా సెరెద్యుక్‌ తెలిపారు.

ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. యాగునోవో గ్రామ సమీపంలో విమాన ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి గవర్నర్‌ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలోనే విమానం ప్రమాదం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఉక్రెయిన్‌ దాడిలో కెర్చ్‌ వంతెన ధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement