ఆపిల్ సేవలకు అంతరాయం.. యూజర్లకు షాక్! | Apple down now? users report issues in accessing multiple services | Sakshi
Sakshi News home page

ఆపిల్ సేవలకు అంతరాయం.. యూజర్లకు షాక్!

Nov 18 2026 7:07 AM | Updated on Nov 18 2026 7:13 AM

Apple down now? users report issues in accessing multiple services

వాషింగ్టన్‌: అమెరికా సహా పలు దేశాల్లో ఆపిల్ సేవలు నిలిచిపోవడంతో వేలాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఆపిల్‌కు చెందిన ఐక్లౌడ్, యాప్ స్టోర్, ఆపిల్ పే, ఆపిల్ సపోర్ట్ సేవల్లో సాంకేతిక అంతరాయం ఏర్పడింది. దీంతో వినియోగదారులు తమ ఖాతాల్లోకి లాగిన్ కాలేకపోయారు.

సేవల్లో సమస్యలను గుర్తించే డౌన్‌డిటెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం తొలుత ఆపిల్ పే సేవలకు సంబంధించి ఫిర్యాదులు ఒక్కసారిగా పెరిగాయి. ఆ తర్వాత ఐక్లౌడ్ సేవల్లోనూ సమస్యలు తలెత్తాయి. క్రమంగా యాప్ స్టోర్, ఆపిల్ సపోర్ట్ సహా ఇతర సేవలకూ అంతరాయం విస్తరించింది.

ఆపిల్ బిజినెస్ మేనేజర్, ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ స్టోర్, సైన్ ఇన్ విత్ ఆపిల్, ఆపిల్ కార్డ్ వంటి సేవల్లోనూ సమస్యలు నమోదయ్యాయి. ఆపిల్ అధికారిక సపోర్ట్ పేజీ సైతం ఐక్లౌడ్ ఖాతాలు, సైన్ ఇన్ ప్రక్రియతో పాటు యాప్ స్టోర్, ఆపిల్ మ్యూజిక్ సేవల్లో సమస్యలు ఉన్నట్లు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement