'దొంగ నా కొడుకు వచ్చేస్తున్నాడు'.. రిలీజ్ ఎప్పుడంటే? | Little Hearts Fame Donga Naa Koduku Movie Release Date Locked | Sakshi
Sakshi News home page

Donga Naa Koduku Movie: 'దొంగ నా కొడుకు వచ్చేస్తున్నాడు'.. రిలీజ్ డేట్‌ ఫిక్స్

Oct 6 2026 8:05 PM | Updated on Oct 6 2026 8:08 PM

Little Hearts Fame Donga Naa Koduku Movie Release Date Locked

లిటిల్ హార్ట్స్ మూవీతో మెప్పించిన యూట్యూబర్, నటుడు మౌళి నటిస్తోన్న చిత్రం దొంగ నా కొడుకు. ఈ మూవీతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో మౌళికి జోడీగా సుస్మితా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్ ప్రకటించారు మేకర్స్.

ఈ మూవీని నవంబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్ చేసింది. ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు పోస్టర్‌లోనే అర్థమవుతోంది. ఈ చిత్రంలో మౌళికి తండ్రిగా టాలీవుడ్ కమెడియన్ అలీ నటిస్తున్నారు. ఈ మూవీకి సింజిత్ యర్రమిల్లి సంగీతం అందిస్తుండగా.. సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement