‘దొంగ నా కొడుకు’.. ఇలా ఏం మెసేజ్‌ ఇస్తున్నారంటూ ఫైర్‌ | Dongaa Naa Koduku Movie Title Sparks Controversy on Social Media | Sakshi
Sakshi News home page

ఇలాంటి సినిమా టైటిల్స్‌తో ఏం మెసేజ్‌ ఇస్తున్నారంటూ ఫైర్‌

Oct 21 2026 9:18 PM | Updated on Oct 22 2026 11:34 AM

Dongaa Naa Koduku Movie Title Sparks Controversy on Social Media

తెలుగు సినిమాల్లో ఒకప్పుడు కథతో పాటు టైటిల్‌కూ ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆకట్టుకునే పేర్లతోనే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేవారు. అయితే, ప్రస్తుతం కొన్ని చిత్రాలకు పెడుతున్న టైటిళ్లు చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా హీరో మౌళి నటిస్తున్న ‘దొంగ నా కొడుకు’ సినిమా పేరు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ టైటిల్‌పై కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

కుటుంబంతో కలిసి
కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే టైటిల్‌ కూడా అభ్యంతరకరంగా ఉండకూడదని, ఇలాంటి పేర్లతో సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, సినిమా పేరును బట్టే కథను అంచనా వేయడం సరికాదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

‘లిటిల్‌ హార్ట్స్‌’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మౌళి.. ఇప్పుడు ‘దొంగ నా కొడుకు’ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమా నవంబర్‌ 13న థియేటర్లలోకి రానుంది. టీజర్‌ విడుదలతో సినిమా టైటిల్‌పై చర్చ మొదలవడంతో ఈ వివాదం చిత్రానికి ఎలాంటి ప్రచారం తీసుకొస్తుందో చూడాలి.

(ఇదీ చదవండి: ‘B’ కేటగిరీ అవకాశాలైనా ఇవ్వండి: నటి రజిత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement