పెళ్లి చేసుకోమని 100 సార్లు అడిగితే.. అప్పుడు ఓకే చేశా: విజయ్‌ దేవరకొండ | Vijay Devarakonda Says Rashmika Asked Him To Marry Her For 100 Times | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోమని 100 సార్లు అడిగితే.. అప్పుడు ఓకే చేశా: విజయ్‌ దేవరకొండ

Oct 22 2026 8:55 AM | Updated on Oct 22 2026 9:01 AM

Vijay Devarakonda Says Rashmika Asked Him To Marry Her For 100 Times

టాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌లో విజయ్‌ దేవరకొండ-రష్మిక జంట ఒకటి. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ స్టార్‌ జంట.. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత కలిసి నటించిన తొలి సినిమా ‘రణబాలి’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం విజయ్‌, రష్మిక ఇద్దరు.. వేరు వేరుగా పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు.అయితే పెళ్లి తర్వాత జంటగా కలిసి ‘కాఫీ విత్‌ కరణ్‌’ టాక్‌ షోకు వెళ్లారు. ఈ సందర్భంగా తమ లవ్‌స్టోరీ,పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. పెళ్లికి ముందు రష్మికకు ప్రత్యేకంగా ప్రపోజ్‌ చేయలేకపోయానని విజయ్‌ చెప్పారు. అంతేకాదు పెళ్లి ప్రపోజల్‌  కూడా తొలుత రష్మికనే చేసిందట. 

‘రొమాంటిక్‌ విషయాలు ప్లాన్‌ చేయడంలో నేను వీక్‌. కానీ నా వల్ల రష్మిక ఓ అందమైన మూమెంట్‌  మిస్‌ కాకూడదని ప్రత్యేకంగా ప్రపోజ్‌ చేద్దామనుకున్నా. ఇద్దరం కలిసి ఇటలీ వెళ్లినప్పుడు ఆమెకు సర్‌ప్రైజ్‌ చేద్దామని ప్లాన్‌ చేశా. అయితే సరైన ఉంగరం దొరకలేదు. దీంతో అక్కడ ప్రపోజ్‌ చేయలేకపోయా. కానీ పెళ్లికి ముందు నిర్వహించిన సంగీత్‌లో మాత్రం రష్మికకు నేనే ప్రపోజ్‌ చేశా. స్నేహితులందరి సమక్షంలో మోకాళ్లపై నిలబడి పెళ్లి చేసుకోవాలని కోరాను. ఆ క్షణాలు ఆమె జీవితంలో ఎప్పటికీ గుర్తిండిపోతాయి’ అని విజయ్‌ అన్నారు. 

ఇక ఇద్దరిలో పెళ్లి ప్రపోజ్‌ ముందుగా చేసిందెవరని హోస్ట్‌ అడగ్గా.. రష్మికనే అని విజయ్‌  బదులిచ్చాడు. ‘నేను ఒకే చేసేలోపే వందసార్లు అడిగేసింది’అని విజయ్‌  చెప్పడంతో పక్కనే ఉన్న రష్మిక నవ్వుతూ..  ‘అవును, నేను నిజంగానే పెళ్లి కోసం ఆయన్ని ఒప్పించడానికి  ఏడాది పాటు అడుగుతూనే ఉన్నాను’ అని అనడంతో. ‘చూశారా.. తనే నన్ను వందసార్లు అడిగింది. అందుకే నేను ఓకే చెప్పాను. నేనేం అంత బ్యాడ్ పర్సన్‌ని కాదు’ అంటూ విజయ్ నవ్వులు పూయించారు.

(ఇదీ చదవండి: రెగ్యులర్‌ ముఖాలంటూ పక్కన పెడుతున్నారు: రజిత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement