అనపర్తి(తూర్పుగోదావరి జిల్లా): జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో కూటమి అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. రంగంపేట మండలం దొంతమూరు గ్రామంలో వైఎస్సార్‌సీపీకి చెందిన కుటుంబంపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఒకే కుటుంబానికి చెందిన ముత్యం వీరబాబు, సత్తిబాబు, సూర్యవేణిలపై టీడీపీ గూండాలు దాడులకు దిగారు.
తొలుత వారితో ఘర్షణకు దిగి వారు ఉంటున్న ఇంటిని కూల్చేశారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులను అనపర్తిలోని ఏరియా ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను మాజీ ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణరెడ్డి పరామర్శించారు.


