తాడేపల్లి : టీడీపీ గూండాల దాడిలో తమ దళిత నేత కాకుమాను రాజశేఖర్ మృతిచెందారని, ఆయనపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలకు సంబంధించి తాము శాంతియుతంగా నిరసన చేస్తే టీడీపీ గూండాలు దాడి చేశారని, ఆ దాడిలో తమ పార్టీకి చెందిన నేత రాజశేఖర్ మృతిచెందారన్నారు. దీనింతటికీ కారణం కూటమి ప్రభుత్వమే కారణమన్నారు. బాబు అండతో చెలరేగుతున్న ఏ ఒక్క అధికారినీ వదలమని హెచ్చరించారు టీజేఆర్.
ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 25వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో టీజేఆర్ మాట్లాడుతూ.. ‘డీఎస్సీ అక్రమాలపై చర్చకు వస్తానని నారా లోకేషే చెప్పారు. లోకేష్ మొట్టమొదటి రాజకీయ అడుగే దొడ్డి దారిన వేశారు. లోకేష్‌ది ఒక మంత్రి స్థాయి అని తెలుసుకోవాలి. కానీ ఆయన అంతకంటే ఎక్కువ ఊహించుకుంటున్నారు. లోకేష్ తన యువగళం బ్యాచ్‌కే ఉద్యోగాలిచ్చారు.
శాప్ ఆఫీసుకి వస్తామని ముందే ప్రకటించాం. లోకేష్ అక్కడకు వచ్చి వాస్తవాలు చెప్పవచ్చు కదా.. ?, శాప్ ఆఫీసుకు ఫేక్ సర్టిఫికేట్ టీచర్లు ఎందుకు వచ్చారు?, టీడీపీ గూండాలు మాపై దాడి చేశారు. ఆ దాడిలో మా దళిత నేత కాకుమాను రాజశేఖర్ మృతి చెందారు. రాజశేఖర్ పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ‘అక్రమాలపై ప్రశ్నిస్తే అర్ధరాత్రి ఇళ్లలో చొరబడతారా?


