దానం తర్వాత.. కడియం సంగతేంటి? | Party Defection: MLA Kadiyam Srihari Issue In Warangal | Sakshi
Sakshi News home page

దానం తర్వాత.. కడియం సంగతేంటి?

Sep 25 2026 11:28 AM | Updated on Sep 25 2026 11:36 AM

Party Defection: MLA Kadiyam Srihari Issue In Warangal

సాక్షిప్రతినిధి, వరంగల్‌: పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఉమ్మడి వరంగల్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు వేసిన అనర్హత వేటు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్‌ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన వ్యవహారంలో కడియం శ్రీహరితోపాటు దానం నాగేందర్‌పై కూడా అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. ఇద్దరి విషయంలోనూ విచారణ జరిపి, వారి వాదనలు స్వీకరించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ గత మార్చి 11న ఇద్దరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఫిరాయింపునకు సంబంధించి తగిన ఆధారాలు లేవని పేర్కొన్నారు. దీంతో కడియం శ్రీహరి వ్యవహారానికి అప్పట్లో తెరపడినట్లయింది.

‘కడియం’పై ఆ ప్రభావం ఎంత?
మార్చి 11న స్పీకర్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం సెప్టెంబర్‌ 18న తెలంగాణ హైకోర్టు స్పీకర్‌ నిర్ణయాన్ని పక్కనపెట్టి దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించింది. 2024 ఏప్రిల్‌ 23నుంచి ఆయన అసెంబ్లీ సభ్యత్వం రద్దయినట్లుగా కోర్టు పేర్కొంది. ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లుగా కూడా ప్రకటించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దానం నాగేందర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా గురువారం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. అదే రోజు స్పీకర్‌ కొట్టివేసిన కడియం శ్రీహరి అనర్హత పిటిషన్‌ విషయంలోనూ తదుపరి న్యాయపరమైన పరిణామాలు ఎలా ఉంటాయన్న చర్చ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో మొదలైంది.

‘కడియం’పై చేసిన ఫిర్యాదులేంటి..? 
2023, డిసెంబర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌నుంచి కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం 2024 మార్చి 31న సీఎం రేవంత్‌రెడ్డి, అప్పటి తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీల సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నట్లు బీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్‌ వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. కడియం శ్రీహరి పార్టీ మార్పు, కుమార్తె తరఫున కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రచారం చేయడం, బీఆర్‌ఎస్‌ కేసీఆర్‌ తదితరులపై చేసిన విమర్శలు కూడా అప్పట్లో బీఆర్‌ఎస్‌ అనర్హత పిటిషన్‌లో ప్రధానంగా ప్రస్తావించిన అంశాల్లో ఉన్నాయి.  

చదవండి: పిల్లలు పుట్టరని.. ట్రాన్స్‌జెండర్‌ సునంద ఆత్మహత్య!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement