సిద్దిపేటకమాన్: ఇష్టపడి వివాహం చేసుకున్న వ్యక్తి వదిలి వెళ్లాడాన్న మానసిక వేదనతో ఓ ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట వన్ టౌన్ సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలానికి చెందిన జెర్పాటి శివ (25) తనలో వచ్చిన జన్యుమార్పిడి వల్ల నాలుగేళ్ల క్రితం ట్రాన్స్‌జెండర్‌గా మారి సునందగా పేరు మార్చుకున్నారు. సిద్దిపేట పట్టణానికి వచ్చి స్థానిక లింగారెడ్డిపల్లి ఇందిరమ్మ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.
ట్రాన్స్‌జెండర్లతో కలిసి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సునందకు సిద్దిపేటకు చెందిన బత్తుల అజయ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడి రెండున్నరేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. కొంత కాలం తర్వాత మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడిపోతున్నట్లుగా ఈ నెల 21న బాండ్ పేపర్ రాసుకున్నారు. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి విడిపోతున్నాడనే బెంగతో సునంద మానసిక వేదనతో బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై మృతురాలి సోదరుడు మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇదీ చదవండి : ఫోజు కొడితే తాట తీస్తా..


