ఏపీలో భారీ వర్షాలు అప్‌డేట్స్.. తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్ర భారీ వర్షాలతో విలవిల్లాడింది.
శ్రీకాకుళం..
- నాగావళి, వంశధార నదులకు మొదటి ప్రమాద హెచ్చరిక
- నారాయణపురం ఆనకట్ట వద్ద 60వేల క్యూసెక్కులకు చేరిన వరద ప్రవాహం
- నాగావళి, వంశధారలో పెరుగుతున్న వరద ఉధృతి
- లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్
- అధికారులు సూచిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశం
- నదిలోకి దిగడం, ఈత కొట్టడం, చేపలు పట్టడం, నది దాటడం చేయొద్దని హెచ్చరిక
- అత్యవసర పరిస్థితుల్లో వెంటనే రెవెన్యూ, ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించాలని సూచన
ఏలూరు జిల్లా..
- భారీ వర్షాలకు ఏలూరు ఏజెన్సీలో పొంగిన వాగులు, వంకలు
- కొయ్యలగూడెం మండలం కన్నాపురం వద్ద కాజ్‌వేపై ప్రవహిస్తున్న తూర్పు, పడమర కాలువలు
- కన్నాపురం వద్ద రాత్రి తూర్పు కాలువలో గల్లంతైన భాస్కర్ మృతి
- గల్లంతైన ప్రదేశానికి కిలోమీటర్ దూరంలో కాలువలో భాస్కర్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు
- జంగారెడ్డిగూడెం మండలం పట్టిన పాలెం వద్ద ప్రవహిస్తున్న జల్లేరు వాగు
- కొండ వాగుల ఉధృతి నేపథ్యంలో గుబ్బల మంగమ్మ తల్లి దర్శనాలు నిలిపివేత
- ఎర్ర కాలవ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి
- ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న 370 క్యూసెక్కుల వరద నీరు
- ప్రస్తుత ప్రాజెక్టు నీటిమట్టం 79 మీటర్లు
- ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు
కాకినాడ జిల్లా..
- పిఠాపురం నియోజకవర్గంలో పొంగిపొర్లుతున్న ఏలేరు కాలువ, సుద్దగడ్డ వాగు
- ఏలేరు కాలువ వరద నీటితో పిఠాపురం రూరల్ జములపల్లి, నర్సింగపురంలో చెరువులను తలపిస్తున్న పంటలు
- వందలాది ఎకరాల్లో నీట మునిగిన వరి చేను
- సుద్దగడ్డ వరద నీటితో గొల్లప్రోలు-సూరంపేట, గొల్లప్రోలు-తాటిపర్తి రహదారిపై రాకపోకలు నిలిపివేత
- అవస్ధలు పడుతున్న వాహనదారులు
తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్ర భారీ వర్షాలతో విలవిల్లాడింది. ఎడతెరిపి లేని వర్షాలు, ఈదురుగాలులతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. మరోవైపు.. రానున్న మూడు గంటల్లో ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ విధించింది. రేపు ఉదయానికి అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది. నేడు ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన.
విజయనగరం జిల్లా..
ఒడిషాలో వర్షం ప్రభావంతో నాగావళి నదికి వరద ఉధృతి..
తోటపల్లి రిజర్వాయర్‌లోకి 40వేల క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లో
8 గేట్లు ఎత్తి దిగువకు 40 వేల క్యూసెక్కుల వరద నీటిని విడిచి పెడుతున్న అధికారులు.
తోటపల్లి ప్రాజెక్ట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్.
రిజర్వాయర్ బ్యాక్ వాటర్, పరిసర ప్రాంత గ్రామాలకు రెడ్ అలర్ట్..
జలదిగ్బంధంలో కలికోట గ్రామం.
నీట మునిగిన పంటలు కూరగాయల సాగు.
విజయవాడ..
ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాలు
భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు.
కృష్ణాజిల్లా..
మచిలీపట్నంలో భారీగా వర్షం....ఈదురుగాలులతో కూడిన వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం
కుండపోత వానతో జలమయంగా మారిన రహదారులు
చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదారులు
లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులు సైతం జలమయం

👉తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్ర భారీ వర్షాలతో విలవిల్లాడింది. గురువారం రోజంతా ఎడతెరిపి లేని వర్షాలు, ఈదురుగాలులతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. విశాఖలో కైలాసపురం, వెంకోజీపాలెం, చైతన్య నగర్ తదితర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలో భారీ వర్షానికి భవానీపురం హెచ్‌బీ కాలనీ, ఇందిరా ప్రియదర్శిని కాలనీ రోడ్లలో మోకాటి లోతులో నీళ్లు నిలిచాయి.

👉అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ భారీ నష్టం వాటిల్లింది. నదులు, వాగులు గ్రామాలను చుట్టుముట్టాయి. వంతెనలు కూలి, రోడ్లు కోతకు గురై అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. టెక్కలి, పాతపట్నంలో 33 కేవీ స్తంభాలు, ఏడు మండలాల్లో 11 కేవీ స్తంభాలు విరిగిపోవడంతో వందలాది పల్లెలు అంధకారంలో మగ్గాయి. వేగావతి నది ఉధృతితో బొబ్బిలి పట్టణానికి తాగునీటి సరఫరాను నిలిపివేశారు. అరకులోయలో నిత్యావసరాల కోసం గిరిజనులు ప్రాణాలకు తెగించి వాగులు దాటుతున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం...
రెండు రోజులు కుండపోతతో నేల పూర్తిగా నీటితో నిండిపోయింది. ఇక నీటిని పీల్చుకునే స్థితిలో లేదు. అందుకే ఇకపై కురిసే మోస్తరు వర్షం కూడా నేరుగా వాగులు, వంకల్లోకి చేరి ఆకస్మిక వరదలకు దారితీయవచ్చని తెలిపింది. అనకాపల్లి, కాకినాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఆకస్మిక వరదల ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొండవాలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం కూడా ఉంది.


