breaking news
rain forecast
-
తెలంగాణలో ఐదు జిల్లాలకు హెచ్చరిక.. అతి భారీ వర్షసూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శనివారం ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మరో 19 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.ఇక, అంతకుముందు.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. ఆదివారం మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాల ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని తెలిపింది.LOCALISED HEAVY THUNDERSTORMS ALERT TODAY ⚠️⛈️ Today, the Upper air circulation (UAC) centre is falling right on Telangana Scattered SEVERE THUNDERSTORMS expected in North, West, Central TG districts like Adilabad, Asifabad, Nirmal, Nizamabad, Karimnagar, Jagitial,…— Telangana Weatherman (@balaji25_t) September 13, 2025 Today’s Forecast (Sept 13, 2025) ⛈️⛈️Heavy to Very Heavy Rains likely across North, West, Central TG at few places. Moderate Rains in South, East TG‼️Hyderabad : Intense Spell at few places— Weatherman Karthikk (@telangana_rains) September 13, 2025 -
వరంగల్‌లో దంచికొట్టిన వర్షం.. ప్రాణ భయంతో ప్రయాణికుల కేకలు..
సాక్షి, వరంగల్: వరంగల్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కుండపోత వర్షం కురిసింది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా పలు కాలనీలు జలమయం కాగా.. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి పూర్తిగా జలమయమైంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాలో శనివారం అర్థరాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. హనుమకొండలోని అంబేద్కర్ భవన్ రోడ్డు, తిరుమల జంక్షన్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అండర్ బ్రిడ్జి దగ్గర వరదలో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. మోకాళ్ల లోతు మేరకు వరద నీరు నిలిచిపోవడంతో అతి కష్టం మీద ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. దీంతో, ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో కాలనీల్లోకి వరద నీరు చేరుకుంది. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. #Warangalrains!!After a heavy rains in warangal city Railway under bridge under water logging situation stay safe 🚨🌧️⚠️ pic.twitter.com/G2yyU4ZWv2— Warangal Weatherman (@tharun25_t) September 7, 2025భారీ వర్షం కారణంగా వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి కిందికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అది గుర్తించకుండా వెళ్లిన రెండు ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. అందులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో మిల్స్ కాలనీ పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాడు సాయంతో బస్సుల్లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీశారు. అన్నారం, మహబూబాబాద్ నుంచి వచ్చిన ఈ బస్సుల్లో సుమారు వంద మంది ప్రయాణికులు ఉన్నారు. #Warangalrains!!Now heavy downpour rains going in warangal tricity places Hnk Kazipet warangal city alert 🌧️🌧️🚨 pic.twitter.com/UBEfX6WgMn— Warangal Weatherman (@tharun25_t) September 7, 2025Today two RTC Buses were struck up at under bridge Warangal into 5 ft water and about 20 passengers were struck up in the buses. Immediately CI Inthezargunj along with his staff proceeded to the spot and rescued all the passengers in two buses.@cpwarangal @dcpczwrl @Acp_wrlc pic.twitter.com/9VAOBtSs3H— SHO INTHEZARGUNJ (@shointhezargunj) September 7, 2025 -
ఏపీలో మూడు రోజులు వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మళ్లీ వర్షాలు జోరందుకోనున్నాయి. పశ్చిమ బెంగాల్–ఒడిశా తీరాలను ఆనుకుని వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 నుంచి 1.8 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. సెప్టెంబర్ 2న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు పలుచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉంది.సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 2వ తేదీన విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, శ్రీకాకుళం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.మూడో తేదీన పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వివరించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. గరిష్టంగా 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందనీ, గురువారం వరకూ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. -
కామారెడ్డిలో మళ్లీ వర్షం.. రెండు గంటల పాటు అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అప్డేట్స్.. కామారెడ్డిలో మళ్లీ వర్షం.. కామారెడ్డిలో మళ్లీ వర్షం మొదలైంది. రానున్న రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం. ఇప్పటికే వరద గుప్పిట్లో పలు కాలనీలు, వరద నీటిలో ఉప్పొంగతున్న చెరువులు, నాలాలు..జల దిగ్బందంలో బోధన్ నియోజకవర్గంలో పలు గ్రామాలు. పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. పూర్తిగా నీట మునిగిన ఏడు పాయల ఆలయం. #WATCH | Medak, Telangana: Edupayala Tirumala Temple partially submerged in water after heavy rains. A flood-like situation prevails in the area. (Source: I&PR Telangana) pic.twitter.com/fwPRyi9Y3C— ANI (@ANI) August 29, 2025జల దిగ్బంధంలో ఏడు పాయల ఆలయం15 రోజులుగా జల దిగ్బంధంలో ఏడు పాయల వనదుర్గ ఆలయంగర్భ గుడి ముందు నుంచి రేకులను తాకుతూ ఉద్ధృతంగా ప్రవాహంరాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవారి దర్శనంఆనకట్ట వైపు భక్తులు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులుకోతకు గురైన జాతీయ రహదారిపోచారం ఉద్ధృతికి కోతకు గురైన జాతీయ రహదారికామారెడ్డి- మెదక్ మధ్య నిలిచిన రాకపోకలుపోచారం ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలుముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టిన ఆర్మీ అధికారులుఉమ్మడి మెదక్ జిల్లాలో తగ్గిన వరద ఉద్ధృతిమెదక్ జిల్లాలో వరదల దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవుదూప్సింగ్తండాలో కొనసాగుతున్న సహాయక చర్యలుసహాయ చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలుమంత్రి సీతక్క టెలీకాన్ఫరెన్స్భారీ వర్షాలతో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రహదారులపై మంత్రి సీతక్క టెలీకాన్ఫరెన్స్రాష్ట్రంలో 1,291 ప్రాంతాల్లో దెబ్బతిన్న గ్రామీణ రోడ్లు, కల్వర్టులురూ.374 కోట్ల నష్టం వాటిలినట్లు నివేదించిన అధికారులుతాత్కాలిక మరమ్మత్తుల కోసం రూ.22.71 కోట్లు అవసరమని ప్రాథమిక అంచనాశాశ్వత మరమ్మత్తుల కోసం రూ.352 కోట్లు అవసరమని ప్రాథమిక అంచనా22 గ్రామాలకు రాకపోకలు దెబ్బతినగా 14 గ్రామాలకు పునరుద్ధరణత్వరగా రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశాలు ఉధృతంగా మూసీ..యాదాద్రి భువనగిరి..భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు-రుద్రవెల్లి గ్రామాల మధ్య పొంగిపొర్లుతున్న మూసీ..ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పెరిగిన మూసీ వరదజూలూరు- రుద్రవెల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం.వరద ప్రవాహం ఎక్కువ కావడంతో బారికేడ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పోలీసులు..ఉస్మాన్‌సాగర్ ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదలమంచిరేవుల బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న నీరు.. నిజామాబాద్ జిల్లా..శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద39 గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదిలిన అధికారులుప్రస్తుత ఇన్ ఫ్లో 4,30,000ఔట్ ఫ్లో 5,29,822 క్యూసెక్కులుప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 80.5 టీఎంసీలుప్రస్తుతం 1086 అడుగులు 64 టీఎంసీలు తెలంగాణకు మళ్లీ టెన్షన్.. సెప్టెంబర్ మూడో తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.అల్పపీడన ప్రభావంతో తెలంగాణకు భారీ వర్ష సూచన. ఉత్తర తెలంగాణపై తీవ్ర ప్రభావం. NEXT SYSTEM🌪️ LOADING AROUND SEPT 03Another LPA likely to form across BOB around Sept 03, which will affect TG mainly North Region. Further More Updates in the coming days pic.twitter.com/nZMe1tqgZy— Weatherman Karthikk (@telangana_rains) August 28, 2025 👉రికార్డు స్థాయి వర్షాలతో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో దంచికొట్టిన వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. భారీ వర్షంతో పోటెత్తిన వరద ప్రవాహానికి, పలుచోట్ల చెరువులు, రోడ్లు తెగిపోయాయి. రహదారులు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలను వరద చుట్టుముట్టడంతో ఇళ్లు జలమయ్యాయి.👉ఉమ్మడి మెదక్ జిల్లాలో కురిసిన జోరు వానలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. చెరువులు మత్తళ్లు దూకుతుండటంతో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లు, కల్వర్టులు తెగిపోవడంతో అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో పలు చెరువులకు గండ్లు పడి వేలాది ఎకరాల పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసరాల తడవడంతో ఆందోళన చెందుతున్నారు.Even after the LPA has moved away, Medak is still witnessing Moderate/heavy rains 💥⛈️absolutely crazy Medak!Meanwhile, bands near HYDERABAD have weakened, so the city is likely to stay MOSTLY DRY tonight.👉 Stay tuned! The next LPA DATE will be revealed in my upcoming post… pic.twitter.com/q4LE04kIsu— Hyderabad Rains (@Hyderabadrains) August 28, 2025👉ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల జలదిగ్బంధంలోనే ఉంది. నదీ పాయలు ఉద్ధృతంగా ఉరకలెత్తుతుండటంతో అమ్మవారి ఆలయ మండపాన్ని తాకుతూ నీరు ప్రవహిస్తోంది. ఎల్లాపూర్ బ్రిడ్జిపై వరద పొంగుతుండటంతో మెదక్ - బొడ్మట్‌పల్లి రహదారికి రాకపోకలు బంద్ అయ్యాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. హవేలీ ఘనపూర్ మండలం రాజ్ పేట వద్ద నిన్న వరదలో చిక్కుకున్న 10 మందిని రెస్క్యూ టీమ్ కాపాడగా రాజ్ పేట గ్రామానికి చెందిన మరో ఇద్దరు గల్లంతయ్యారు. రేగోడ్ మండలం మర్పల్లి గ్రామంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు అవస్థలు పడ్డారు. భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం షమ్నాపూర్ దగ్గర రైల్వే ట్రాక్ కుంగడంతో మెదక్, అక్కన్నపేట మధ్య రాకపోకలు రద్దు చేశారు.👉మరోవైపు.. ఏపీలో రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆరు జిల్లాలో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది విశాఖ వాతావరణ కేంద్రం. కోస్తా తీరంలో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. కోస్తా జిల్లాల్లోని ప్రధాన ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశామన్నారు.👉అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల జోరువానలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలతో జనానికి అవస్థలు తప్పడం లేదు. వాగులు ఉప్పొంగగా పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.👉దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో ప్రస్తుతం 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 4.37 లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరింది. 69 గేట్ల ద్వారా 4.27 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి, తుంగభద్ర నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. -
భారీ వర్షాల ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో స్కూల్స్ బంద్
సాక్షి, విశాఖ: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రత దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే, ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. విద్యాసంస్థలకు నేడు సెలవు..శ్రీకాకుళం, విశాఖ, అల్లూరి జిల్లాలోని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల దృష్ట్యా సెలవులు ఈ మూడు జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుశ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలువిశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.కోనసీమ, తూగో, పగో, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలుకృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశంమత్స్యకారులు వేటకు వెళ్ళరాదుప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ.ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ ఇవాళ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో రాబోయే రెండు మూడు రోజుల్లో కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, NTR, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కృష్ణపట్నం, వాడరేవు, నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టులకు మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో బుధవారం వరకు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్‌జైన్ విజ్ఞప్తి చేశారు.ఇక, తెలంగాణలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకి రెడ్ అలర్ట్, జయశంకర్ భూపాలపల్లికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. హైదరాబాద్ నగరంలో మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో గట్టి వానలు
సాక్షి, విశాఖపట్నం: ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపరితల ఆవర్తనం కాస్త ఉపశమనం కలిగించనుంది. ఉత్తర తమిళనాడు, నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై కనిపించనుంది.ఈ క్రమంలో సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉంది. అదేవిధంగా.. ఉత్తరాంధ్రలో మాత్రం ఒకట్రెండుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి. తీరం వెంబడి 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సోమవారం• అనంతపురం,శ్రీసత్యసాయి, అన్నమయ్య,చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు-భారీ వర్షాలు • మన్యం,అల్లూరి,ఏలూరు, గుంటూరు,బాపట్ల,కర్నూలు, నంద్యాల,కడప,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి-మోస్తారు వర్షాలు,మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) August 3, 2025తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు.. అల్పపీడనం కారణంగా తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడి ఉంటాయని, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. SOUTH TG ALERT ⛈️⛈️Heavy to Very Heavy Rainfall is expected across South TG districts during next 8-9 days #Telangana ‼️Hyderabad will get One or Two Heavy Spell in this period #Hyderabad pic.twitter.com/ZcMZGmXL5R— Weatherman Karthikk (@telangana_rains) August 4, 2025నేడు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలపై ఈ వాయుగుండం ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు వివరించారు. ఆగస్టు 5 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.గత 24 గంటల్లో నారాయణపేట జిల్లాలోని మాగనూరులో అత్యధికంగా 3.13 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌లో 2.74 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇక ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఉత్తర భారతదేశం వైపు ఎక్కువగా కేంద్రీకృతం కావడంతో ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. నైరుతి గాలులు పొడిబారిపోవడం కూడా వర్షాలు తగ్గడానికి ఒక ముఖ్య కారణంగా నిపుణులు పేర్కొన్నారు.Telangana Rainfall – Last 24 HrsOvernight, Yadadri, Jangoan, Nalgonda (North), Suryapet (North), Mahabubabad, Khammam, Warangal, and Bhadradri districts experienced POWERFUL THUNDERSTORMS ⛈️.Valigonda (Yadadri) topped the charts with 107.8 mmIn HYDERABAD, Isolated spells… pic.twitter.com/0tiv9pkjXh— Hyderabad Rains (@Hyderabadrains) August 4, 2025 -
ఉత్తరాదిలో దంచికొడుతున్న వానలు.. ఈ రాష్ట్రాలకు రెడ్, ఎల్లో అలర్ట్
ఢిల్లీ: ఉత్తర, ఈశాన్యం భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటంతో పలువురు మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీ జిల్లాలో కుంభవృష్టి కారణంగా యమునోత్రి జాతీయ రహదారిలోని సిలాయ్ బైండ్లో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు మృతిచెందారు. ఏడుగురి ఆచూకీ గల్లంతైంది. ఘటనాస్థలానికి 18 కిలోమీటర్లల దూరంలోని తిలాడీ షాహిద్ స్మారక్ వద్ద ఆ ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద స్థలంలో మొత్తం 29 మంది ఉన్నారని, వీరిలో 20 మందిని రక్షించామని అధికారులు తెలిపారు.⛈️ Uttarakhand Cloudburst Triggers Chaos – Char Dham Yatra Halted, 9 Missing📍Uttarkashi, India –• Heavy rains and a cloudburst hit Uttarkashi, causing landslides and widespread disruption.• Nine workers missing near a hotel site on the Yamunotri Highway, search ops… pic.twitter.com/ZkxDgS2l03— Snap Media (@SnapMediaLive) June 29, 2025చార్ధామ్యాత్రపై ప్రభావం.. వరదల కారణంగా చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్, దేహ్రాదూన్, నైనీతాల్, తెహ్రీల్లో ఉన్న యాత్రికులను ముందుకు వెళ్లకుండా ఆపాలని స్థానిక యంత్రాంగానికి సమాచారం అందించారు. అనంతరం, మళ్లీ యాత్ర ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఇక, హిమాచల్‌లోని కుల్ ప్రాంతంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కుల్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 🌧️ #Uttarakhand | Heavy rains caused Dhangarhi & Dhikuli canals to overflow, disrupting traffic on NH-309 between Ramnagar & Kumaon-GarhwalVehicle movement halted, police managing traffic. Administration on alert; public advised to avoid unnecessary travel🛣️ #UttarakhandRains pic.twitter.com/NniieWLzYP— The Bharat Current (@thbharatcurrent) June 29, 2025 జార్ఖండ్‌లోని తూర్పు సింగ్బూమ్ జిల్లాలో భారీ వర్షం కారణంగా వరద నీటిలో మునిగిన ఓ ఆశ్రమ పాఠశాల భవనంలో చిక్కుకున్న 162 మంది విద్యార్థులను స్థానికుల సాయంతో రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 1 నుంచి 28 వరకు రాష్ట్రంలో 80 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. #WATCH | Kullu, Himachal Pradesh | IMD issues a yellow alert for Kullu as the state continues to receive heavy rainfall. pic.twitter.com/A71nfgEyML— ANI (@ANI) June 30, 2025 రాబోయే వారం రోజులు భారీవర్షాలు: ఐఎండీబంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాబోయే వారం రోజులు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది. ఈ మేరకు ఐఎండీ ఆదివారం రెడ్ అలర్ట్ జారీచేసింది. చండీగఢ్‌లో ఒక్కరోజే 119.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. -
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత!
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు, నాలుగు రోజుల పాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, ఇప్పటికే ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో రైతులకు మేలు జరగనుంది.బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు.వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశంఉందని #apsdma ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు,40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. pic.twitter.com/b65VwqYbHE— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) June 25, 2025ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.మరోవైపు.. తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.What a Day & Night (Yesterday) in TG 🌧️🌧️Adilabad, Karimnagar, Siddipet, Nizamabad, Nirmal, Medak, Warangal, Hanumakonda, Sircilla districts was observed Heavy to Very Heavy Rains. Still Adilabad district continuing Rains‼️Hyd got light rains at few places in the Overnight— Weatherman Karthikk (@telangana_rains) June 26, 2025 -
తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన
మహారాణిపేట (విశాఖ): వాయవ్య బంగాళాఖాతంలో ఆవరించి ఉన్న వాయుగుండం పశ్చిమ బెంగాల్–బంగ్లాదేశ్ తీరాల వెంబడి కదిలి గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారింది. మధ్యాహ్నానికి పశ్చిమ బెంగాల్–బంగ్లాదేశ్ తీరాలను దాటింది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో దక్షిణ ఛత్తీస్‌గఢ్, దానికి అనుకుని ఉన్న తూర్పు విదర్భపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, ఆంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. శుక్రవారం శ్రీకాకుళం,విజయనగరం, మన్యం,అల్లూరి, విశాఖ,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ,తూగో, పగో,ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్,బాపట్ల, పల్నాడు,ప్రకాశం,నెల్లూరు,నంద్యాల, వైఎస్ఆర్ కడప,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. pic.twitter.com/uPu8SrZk5i— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 29, 2025 ఇక, శుక్రవారం.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి, విశాఖ,అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు.. గురువారం పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.ఇదిలా ఉండగా.. ఏపీవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే భారీగా ఈదురు గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణ, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలపై రాష్ట్రంలోని పలు జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి.. తగిన విధంగా సూచనలు జారీ చేసినట్లు చెప్పింది. -
ఏపీలో భారీ వర్షం.. ఈ జిల్లాల ప్రజలకు విపత్తుల శాఖ హెచ్చరిక
సాక్షి, ప్రకాశం: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. కర్ణాటక నుంచి రాజస్థాన్ వరకూ.. ఒక బలమైన ద్రోణి ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై కూడా కనిపిస్తోంది. ఈ కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తాజాగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలివాన కారణంగా పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం దగ్గర రోడ్డుపై భారీ వృక్షం విరిగిపడింది. రోడ్డుపై చెట్టు పడటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. దీంతో, పిడుగురాళ్ల -సత్తెనపల్లి మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు.. చెట్టు తొలగించి రాకపోకలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు.రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు , శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు, pic.twitter.com/0sPdSsATQK— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 1, 2025మరోవైపు.. ప్రకాశం జిల్లాలో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తోంది. కనిగిరిలో ఈదురుగాలితో కూడిన భారీ వర్షం పడుతోంది. ఇక, అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు.. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ, తెలంగాణలో మరో ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయి. అలాగే.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కోసారి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల శాఖ హెచ్చరించింది. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదన్నారు. బలమైన ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.ఐఎండీ ప్రకారం నేడు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటూ.. కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో కొంత భాగం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతం నుంచి ఏపీలోకి గాలులు బలంగా వస్తున్నాయి. ఈ రోజంతా ఈ పరిస్థితి ఉంటుంది. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో సైతం భారీ వర్షం కురుస్తోంది. దీంతో, రోడ్లన్నీ జలమయమయ్యాయి. -
ఏపీకి వర్షం అలర్ట్.. ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఏపీలో రాబోయే మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది.ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ మాట్లాడుతూ.. సోమవారం.. కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇక, మంగళవారం.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.ఇదిలా ఉండగా.. కొన్ని జిల్లాలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదివారం అనకాపల్లి జిల్లా రావికమతం, వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో 41.4, విజయనగరం జిల్లా గుర్లలో 41.2, తూర్పుగోదావరి జిల్లా మురమండ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఇక, తెలంగాణలో గత కొద్ది రోజులుగా పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఆదివారం హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై.. మోస్తరు వర్షం కురసింది. దీంతో, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లగొండ జిల్లాలో వర్షం కారణంగా కల్లాల్లో పోసిన ధాన్యం వర్షం తడిసిపోయింది. ఈ నేపథ్యంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.Gadwal right now. As expected, dangerous storms smashing the district 😱Zaheerabad - Vikarabad too on ALERTVC :- @chaitanyak19142 pic.twitter.com/S3cmnQ4UMy— Telangana Weatherman (@balaji25_t) April 27, 2025 -
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
సాక్షి స్పెషల్ డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న 5 రోజులు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల రైతులు ఈ సమయంలో దుక్కులు దున్నుకోవాలని రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా.పి.లీలారాణి సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె బులెటిన్ విడుదల చేశారు.మామిడి పంటలో పండు ఈగ నియంత్రణకు ఇదే మంచి సమయమని తెలిపారు. వాతావరణ పరిస్థితులను బట్టి పంటల సాగులో ఈ నెల 26 (శనివారం) నుంచి 30 వరకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక బులెటిన్లను విడుదల చేస్తున్నదని వెల్లడించారు.రైతులకు సూచనలు 5 రోజులు మండే ఎండలు.. ఈదురుగాలులతో వర్షాలు.. వచ్చే 5 రోజులు పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని లీలారాణి తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావొచ్చని చెప్పారు. 26న ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 27 నుంచి 29 తేదీల మధ్య ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి. బులెటిన్లోని ప్రధాన సూచనలు ఇవే..వేసవి దుక్కుల వల్ల భూమిలో నిద్రావస్థలో ఉన్న చీడపీడలు కలిగించే పురుగులు బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. బయటపడిన ప్యూపాలను, గుడ్లను, పక్షులు తిని నాశనం చేస్తాయి. భూమి గుల్లబారి నీటి నిల్వ శక్తి పెరుగుతుంది. అందువల్ల వేసవి జల్లులను వినియోగించుకొని వేసవి దుక్కులను చేసుకోవాలి.పండ్ల తోటల్లో వేసవి కాలంలో గుంతలు తీసి ఎండకు ఆరనివ్వాలి. దీనివల్ల నేలలోని పురుగులు వాటి గుడ్లు తెగుళ్లను కలిగించే శిలీంద్రాలు నశిస్తాయి. ఆ తర్వాత పండ్ల మొక్కలు నాటుకోవటం మంచిది.ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల క్రింద నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి.కోసిన పంటలను (వరి, మొక్కజొన్న, శనగ, పెసర, మినుము, జొన్న, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు తదితర పంటలు) వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలి. మార్కెట్‌కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలి. తాత్కాలికంగా పురుగు మందుల పిచికారీని వాయిదా వేసుకోవాలి. మామిడిలో కాయమచ్చ తెగులు గమనించినట్లయితే 1 గ్రా. కార్బండజిమ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
తెలుగు రాష్ట్రాల వాతావరణంపై ... IMD షాకింగ్ ప్రకటన
-
హైదరాబాద్‌లో కుమ్మేసిన వర్షం.. మరో మూడు రోజులు వానలే
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొన్ని గంటల పాటు మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే నగరంలోని పలు చోట్ల వర్షం పడుతోంది. ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, ఖైరతాబాద్, లక్డీకపూల్, సోమాజిగూడ, ఎర్రమంజిల్, తార్నాక, నల్లకుంట, విద్యానగర్, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది.ఒక్కసారిగా వాతావరణం మారి.. వర్షం కురుస్తుండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్ల మీదకు రావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షం కురుస్తోన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాగం అప్రమత్తమైంది.తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ని జారీ చేసింది. దక్షిణ మధ్యప్రదేశ్ మధ్య నుంచి ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశాల మీదుగా దక్షిణ గ్యాంజెటెక్ పశ్చిమ బెంగాల్ వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. సగటున సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. -
ఏపీకి వర్షసూచన.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో మిశ్రమ వాతావరణం కొనసాగుతోంది. ఓవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్ నుంచి కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు.. కోస్తా, రాయలసీమలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.మరోవైపు.. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పులు వీస్తున్నాయి. అత్యధికంగా అమరావతిలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్న వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో కూడా రెండు రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్ సమీప ప్రాంతం నుంచి ఈశాన్య తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.కాగా, రాష్ట్రంలో రెండు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు. శనివారం ఖమ్మంలో గరిష్టంగా 41.8 డిగ్రీల సెల్సియస్, మెదక్‌లో కనిష్టంగా 22.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.రానున్న రెండు రోజులు మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. -
ఏపీకి వారం రోజుల పాటు వర్ష సూచన
-
ఏపీకి చల్లని కబురు.. వారం రోజుల పాటు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి.. ఈ సమయంలో విశాఖ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాజస్థాన్-కోస్తాంధ్ర మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.హిమాలయ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రాగల వారం రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.కాగా, గురువారం కురిసిన వర్షాలకు ప్రకాశం జిల్లా కురిచేడు, మర్రిపూడి, గిద్దలూరు, పామూరు, దర్శి, పొదిలి మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దర్శి మండలం చందలూరు, వెంకటచలంపల్లి, మారెడ్డిపల్లి, బసిరెడ్డిపల్లి, అబ్బాయిపాలెం, మల్లవరం, చిదంబరంపల్లి, గొల్లపల్లి, కుంచేపల్లి పాములపాడు గ్రామాల్లో బొప్పాయి తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. మిరప, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది. -
ఏపీకి వర్షసూచన.. మరో ఐదు రోజులు వానలే..
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని జిల్లాల్లో ఎండ దంచికొడుతోంది. అకాల వర్షాలు, పిడుగులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం.. ద్రోణి ప్రభావంతో మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.మరోవైపు.. ఆది, సోమవారాల్లో కొన్నిచోట్ల పిడుగులు పడతాయని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని తెలిపారు. శనివారం కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయి. అత్యధికంగా రాత్రి 8 గంటల వరకు కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.As predicted, Raining heavily near Kakinada for last 1 hour. Video by Venkata Ramesh Chandra. pic.twitter.com/yHUPi4C1DI— Andhra Pradesh Weatherman (@praneethweather) April 5, 2025 Synoptic features of weather inference of Andhra Pradesh dated 05-04-2025 #IMD #APWeather #APforecast #MCAmaravati pic.twitter.com/XFkFGXu3lK— MC Amaravati (@AmaravatiMc) April 5, 2025ఇక, తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఉపరితల ద్రోణి కారణంగా రేపు తెలంగాణలో పటు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. Enjoy the weather 🌧️🌧️Rains⛈️ to continue across TG till April 20 & Hyderabad will get rains occasionally in this periodTemperatures☀️ remains normal/above normal. Mostly No Heatwave is expected #Telangana #Hyderabad https://t.co/Sl4s8Ev2Of— Weatherman Karthikk (@telangana_rains) April 5, 2025 -
ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాల్లో గట్టి వానలు..
సాక్షి, విశాఖ: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. అకాల వర్షం తెలంగాణను అతలాకుతలం చేసింది. భారీ వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు.. ఏపీలో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొన్ని చోట్ల పిడుగులు పడతాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులూ వీయొచ్చని పేర్కొంది. కర్నూలు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. నిన్న కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వర్షాల అనంతరం, ఆదివారం నుంచి ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది.At Anantha Puram, Rayalaseema #APRains VC Chandu pic.twitter.com/h1hXSPx6jR— MasRainman (@MasRainman) April 3, 2025ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఈదురుగాలులతో ప్రారంభమైన వర్షం.. ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లతో విరుచుకుపడింది. భారీ వర్షం కారణంగా జన జీవనం స్తంభించింది. ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లో దాదాపు అన్ని డివిజన్లలో కురిసిన భారీ వర్షానికి నగర జీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాట్లు, గోడకూలిన ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. హైదరాబాద్‌లో రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హైదరాబాద్ లో అకాల వర్షం సృష్టించిన దృశ్యాలుఈ విపత్కర సమయంలో ఎవరినీ సహాయం కోరాలి?గతంలో @KTRBRS కు ట్వీట్ చేస్తే వెంటనే సహాయ సహకారాలు అందేవి. కానీ నేటి ప్రభుత్వంలో ఎవరినీ అడగాలి?#Hyderabad #Rains #Telangana #HyderabadRains #HeavyRains #WeatherUpdate pic.twitter.com/K6nIvabkoC— SARAKU (Sateesh Ravi kumar) (@sargam_ravi) April 3, 2025 Storms unleash heavy rains in Hyderabad, Telangana #India#Storm #Asia #Telangana #Hyderabad #Flood #Rain #Climate #Weather #Viralpic.twitter.com/3pBg13U2Ad— Earth42morrow (@Earth42morrow) April 3, 2025 -
వడగళ్ల వాన అలర్ట్.. ఏపీ, తెలంగాణలో రెండు రోజులు వర్షాలే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ద్రోణి కారణంగా వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇక, రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.ద్రోణి తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల వరకు తగ్గొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.Moderate Rainfall Recorded at Nirmal & Nizamabad.Upto 2:00 Am Nirmal 20.3 mm Rainfall#TelanganaRains pic.twitter.com/GPi65UJqZf— Telangana Weather Forecast....🛰⛈️ (@SkyForecastMaN4) March 20, 2025మరోవైపు.. ఇప్పటికే గురువారం రాత్రి పలు జిల్లాలో వర్షం కురిసింది. జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇదిలా ఉండగా.. అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర పంట నష్టం జరిగే అవకాశం ఉంది. Weather update!!Now scattered thunder storm rains going in nizamabad, Nirmal district later into jagtial places cover 🌧️— Telangana state Weatherman (@tharun25_t) March 20, 2025ఇక, ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి కారణంగా గంటకు 40-50 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
ఉపరితల ద్రోణి ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: రెండు రోజుల క్రితం తెలంగాణ, ఒడిశా మీదుగా ఏర్పడిన ద్రోణి బలహీనపడింది. రాయలసీమ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు తూర్పు ప్రాంతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల, తెలంగాణలో అక్కడకక్కడా తేలికపాటి జల్లులు కురిసే సూచనలు ఉన్నాయని, పలుచోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం తెలిపారు.ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణం చల్లబడే సూచనలు మాత్రం కనిపించడం లేదని, గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రానున్న మూడు రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు, రాయలసీమ జిల్లాల్లో 1 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.తెలంగాణకు వర్ష సూచన..తెలంగాణలో చూస్తే పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. రాబోయే మూడు రోజులు ఉదయం వేళ కొన్నిచోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఆ తర్వాత మళ్లీ పొడి వాతావరణమే ఉంటుందని అంచనా వేసింది.మరోవైపు ఏపీ, తెలంగాణలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. చాలాచోట్ల ఇప్పటికే 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటిన పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. వేసవి నేపథ్యంలో ప్రజలంతా జాగ్రతగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
అలర్ట్: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు చలి, గట్టి వానలే
సాక్షి, విశాఖ/హైదరాబాద్: బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం కొనసాగుతోంది. దీంతో ప్రభావంతో తీరం వెంబడి తీవ్రమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇక, అల్ప పీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో(andhra Pradesh) విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.బంగాళాఖాతం(Bay Of Bengal)లో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ఏపీలో మూడు రోజుల పాటు విస్తరంగా వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అల్ప పీడనం ప్రభావం అధికంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో, పలు జిల్లాలో వర్షాలకు అవకాశం ఉంది. ఇదే సమయంలో దక్షిణ కోస్తా మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఐఎండీ హెచ్చరించింది. ఇక, అల్ప పీడనం కారణంగా తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఇక, తెలంగాణపై(telangana) కూడా అల్పపీడన ప్రభావం చూపుతోంది. దీంతో, వచ్చే రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే ఐదు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 2,3 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేసింది. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణా వైపు శీతలు గాలులు వీస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. దీంతో, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. -
కోస్తాంధ్రలో మూడు రోజులు భారీ వర్షాలు..
-
తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్..ఏపీలో మూడు రోజులు వర్షాలు..!
సాక్షి,విశాఖపట్నం: నైరుతి బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు,దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనించే అవకాశం ఉంది. తర్వాతి 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉత్తరం దిశగా పయనించే ఛాన్సుంది.రానున్న మూడు రోజులు పాటు ఉత్తరకోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుంచి ఒకటి రెండు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.రాబోయే మూడు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే పలుచోట్ల వర్షం కురుస్తోంది. తెలంగాణలో కూడా నేడు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలోని అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరాతబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, బేగంపేట్, కూకట్పల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, మూసాపేట సహా పాలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. ఇక, తెలంగాలో కొద్ది రోజులుగా మేఘావృత వాతావరణం నెలకొన్ని విషయం తెలిసిందే. Hyderabad looks so beautiful with light rain and the glowing city skyline. A perfect peaceful Morning! 🌧️🌃 #HyderabadRains #CitySkyline #BeautifulHyderabad #RainyVibes@HyderabadMojo@HiHyderabad @hyderabadprop @ikaranreddy pic.twitter.com/fQaWuSDSHl— HyderabadInfra (@HyderabdInfra) December 8, 2024 -
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రం–ఆగ్నేయ బంగాళాఖాతంపై విస్తరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ–వాయవ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో 25న వాయుగుండంగా బలపడే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అనంతరం వాయవ్య దిశగా కదులుతూ తదుపరి రెండు రోజుల్లో తమిళనాడు–శ్రీలంక తీరాల వైపు వెళ్లి.. తీరం దాటనుందని వెల్లడించారు. దీని ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 27 నుంచి మూడురోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 35 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయనీ.. వాయుగుండంగా బలపడిన తర్వాత గాలుల ఉద్ధృతి పెరగనుందన్నారు. 26వ తేదీ నుంచి దక్షిణ కోస్తా తీరం వెంబడి గరిష్టంగా 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని 29వ తేదీ వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. -
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి మరో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. వాయుగుండం కారణంగా ఏపీలో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.ఈ అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి, 27 నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు, మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. -
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు సహా ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఏపీవైపు పయనిస్తోంది. అల్పపీడనం ప్రభావం తమిళనాడులోని 12 జిల్లాలతో సహా ఏపీలోకి దక్షిణ కోస్తా, రాయలసీమపై పడనుంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నేడు బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, గుంటూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.మరోవైపు.. అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, ప్రభుత్వం అప్రమత్తమైంది. Villupuram, Pondy, Cuddalore, Mayiladuthurai stretch getting very good rains. Rains will continue for next few hours.Our chennai radar is clear, no heavy rains expected for next 1/2 hours. Get ready for Schools and Colleges :(#ChennaiRains | #ChennaiRainsUpdate | #RainAlert pic.twitter.com/lvTvFtog2Y— TamilNadu Weather (@TamilNaduWeath2) November 13, 2024 -
తీవ్ర తుపానుగా ‘దానా’
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను తీవ్రరూపం దాల్చింది. ఇది వాయవ్య దిశగా గంటకు 12 కి.మీ. వేగంతో కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు ప్రయాణిస్తోంది. గురువారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మరింత బలపడనుంది. ప్రస్తుతం పారాదీప్‌కు ఆగ్నేయంగా 420 కి.మీ., దమరకు 450 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో పూరీ–సాగర్ ద్వీపం మధ్య గురువారం అర్ధరాత్రి నుంచి తీరం దాటే ప్రక్రియ ప్రారంభం కానుంది. శుక్రవారం ఉదయానికి ఒడిశాలోని బిటర్క నికా–దమర వద్ద తీరం దాటే సూచనలు కనిపి స్తున్నాయని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తీవ్ర తుపానుగా బలపడటంతో తీరం దాటే సమయంలో గంటకు 100–110 కి.మీ. వేగంతో, గరిష్టంగా 120 కి.మీ. వేగంతో ఉధృత గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై తీవ్రంగా ఉంటుందన్నారు. అదేవిధంగా గురువారం మధ్యాహ్నం తర్వాత ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందనీ.. మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తరు వానలు పడతాయని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ.. మత్స్యకారులెవరూ 25వ తేదీ వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. -
తీరం దాటిన వాయుగుండం.. సముద్రం అల్లకల్లోలం
AP Rains Updates..👉బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం గురువారం తెల్లవారుజామున తీరం దాటింది. నెల్లూరు జిల్లాలోని తడా వద్ద వాయుగుండం తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అల్పపీడనంగా వాయుగుండం బలహీనపడనుంది. కోనసీమ: ఓడలరేవు వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది.సముద్రపు అలలు ఓఎన్జీసీ టెర్మినల్ గేటును తాకాయి.ఓఎన్జీసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.విశాఖ:విశాఖలో ముందుకొచ్చిన సముద్రంసముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి.విశాఖ, గంగవరం పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక 👉తిరుపతిలో భారీ వర్షాలు..వర్షాల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవుభారీ వర్షాలతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ వేంకటేశ్వ ర్భారీ వర్షాలు కారణంగా ఈరోజు శ్రీవారి మెట్టు మార్గం మూసివేసిన టీటీడీ 👉గడిచిన ఆరు గంటల్లో 22 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం తీరం దాటింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, ఇప్పటికే అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లోనూ రెండు రోజులుగా ఎడతెగని వర్షాలు పడుతున్నాయి. వర్షాల తీవ్రతకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. నెల్లూరు నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై ఉండడంతో జన జీవనానికి ఇబ్బంది ఏర్పడింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వాయుగుండం కారణంగా తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
వాయుగుండం : ఏపీలో దంచికొడుతున్న వానలు (ఫొటోలు)
-
ఏపీలో భారీ వర్షాలు.. రేణిగుంటలో రన్‌వే పైకి వరద నీరు
AP Rains Updates..👉దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తీవ్రరూపం దాల్చి మంగళవారం అర్ధరాత్రి వాయుగుండంగా బలపడింది. దీంతో, రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి.👉తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయంలో రన్‌వే పైకి వరద నీరు చేరుకుంది. దీంతో, రేణిగుంట రావాల్సిన ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. 👉వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల వ్యాప్తంగా రాత్రి నుంచి భారీ వర్షంకడప నగరంతో పాటు పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయంరైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో అత్యధిక వర్షపాతం నమోదుభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్లుజిల్లా కలెక్టరేట్లతో పాటు రెవిన్యూ డివిజన్లలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు👉అనంతపురం..భారీ వర్షాల నేపథ్యంలో 16, 17 తేదీల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్👉శ్రీ సత్యసాయి జిల్లా..భారీ వర్షాల నేపథ్యంలో 16, 17 తేదీల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్👉నెల్లూరులో భారీ వర్షం..ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరపిలేని భారీ వర్షాలు.నేడు రేపు జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ.జలదంకిలో అత్యధికంగా 17 సెం.మీల వర్షపాతం.మూడో రోజూ విద్యా సంస్థలకి సెలవు ప్రకటించిన కలెక్టర్..గ్రామాలు, మండల కేంద్రాల్లోనే అధికారులు, ఉద్యోగులు.సముద్రంలో ఎగిసిపడుతున్న అలలు. పెరుగుతున్న గాలుల తీవ్రత.సోమశిల డ్యాంలో 52 టీఎంసీల నీటి నిల్వ. ఎగువనుంచి పెరుగుతున్న ఇన్ ఫ్లోనెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, శ్రామిక్ నగర్, గాంధీ గిరిజన కాలనీ ప్రాంతాలలో భారీగా రోడ్ల మీదకు చేరిన వర్షపు నీరు.తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది. 👉ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడుకు తూర్పు–ఆగ్నేయంగా 490 కి.మీ, పుదుచ్చేరికి తూర్పు–ఆగ్నేయంగా 500 కి.మీ, నెల్లూరు(ఆంధ్రప్రదేశ్)కి ఆగ్నేయంగా 590 కి.మీల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఈ నెల 17వ తేదీన తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పశ్చిమ–వాయువ్య దిశగా కదిలి ఉత్తర తమిళనాడు–దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. రానున్న మూడు రోజులు ఈ మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 👉విశాఖపట్నం, అనకాపల్లి, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నెల్లూరుకు సమీపంలో తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారనుందని, తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.పలుచోట్ల భారీ వర్షాలు ఇప్పటికే రెండు రోజుల నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా విడదలూరు మండలం ఊటుకూరులో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు అత్యధికంగా 15.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.భారీ వర్షాల నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు..రాయచోటి కలెక్టరేట్లో జిల్లా కంట్రోల్ రూమ్: 08561-293006.రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నెంబరు: 08565 240079.రాయచోటి ఆర్డీఓ కార్యాలయం లో కంట్రోల్ రూమ్: 08561-293039.మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మూడు షిఫ్టుల వారిగా కంట్రోల్ రూమ్ నంబర్ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు: 99899176247మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి 10 గంటల వరకు: 9490827676రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు: 6303308475 -
తెలంగాణకు రెండురోజులు వర్ష సూచన
సాక్షి,హైదరాబాద్: మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం బలపడింది.సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది.దీని ప్రభావంతో మంగళ,బుధ వారాల్లో తెలంగాణలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే చాన్సుందని వాతావరణ కేంద్రం తెలిపింది.గంటకు 40 నుంచి 50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కొమరంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ ,రంగారెడ్డి,వికారాబాద్,సంగారెడ్డి,మెదక్,కామారెడ్డి,మహబూబ్‌నగర్,నాగర్‌కర్నూల్,వనపర్తి,నారాయణపేట,జోగులాంబ గద్వాలకు భారీ వర్షసూచన ఉంది.దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇదీ చదవండి: రాష్ట్రంలో ప్రజారోగ్యం అస్తవ్యస్తం -
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, మయన్మార్ దక్షిణ తీరం పరిసర ప్రాంతాల్లో రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాటి ప్రభావంతో పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని చాలాచోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని అధికారులు చెబుతున్నారు.ఈ మేరకు పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. 31 శాతం అధికంగా వర్షాలు... నైరుతి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 70.36 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఏకంగా 91.90 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 31% అధికమని రాష్ట్ర ప్రణాళిక శాఖ అధి కారులు తెలిపారు. ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 19 జిల్లాల్లో అధిక వర్షపాతం, తొమ్మిది జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సె ప్టెంబర్ నెలాఖరుతో నైరుతి రుతుపవనాల సీజ న్ ముగుస్తుంది.సీజన్ ముగిసే నాటికి వర్షపాతం గణాంకాలు మరింత పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది నైరుతి సీజన్లో ఒక్క జిల్లాలో కూడా లోటు వర్షపాతం నమోదు కాకపోవడం విశేషం. మండలాలవారీగా వర్షపా తం నమోదును పరిశీలిస్తే 108 మండలాల్లో అ త్యధిక వర్షపాతం, 283 మండలాల్లో అధిక వర్షపాతం, 216 మండలాల్లో సాధారణ వర్షపాతం, 5 మండలాల్లో మాత్రం లోటు వర్షపాతం ఉన్న ట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. -
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా భారీ కురుస్తోంది. ఆదివారం ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగానే ఉన్నా.. సాయంత్రానికి వర్షం దంచికొడుతోంది.కాగా, నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, బేగంపేట్, యూసఫ్‌గూడ సహా పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం మొదలైంది. మరోవైపు.. వర్షం కారణంగా గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ఆటంకం కలుగుతోంది. Now ✅West Hyderabad to see Short Rains for 5 Minutes — 5:00 PM— Gachibowli — Kondapur — Hitech City — Miyapur⚠️Near-by Areas #HyderabadRains— Hyderabad Rainfall Alert⛈️ (@Hyderabadstorm) September 15, 2024ఇది కూడా చదవండి: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్.. సీఎం రేవంత్ వార్నింగ్ -
ఏపీకి వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: నేడు(శుక్రవారం) బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో అల్ప పీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి బెంగాల్ సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో, ఏపీలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.ఇక, తాజాగా వాయుగుండం ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల, రాయలసీమ, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బీహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 20 నుంచి అక్టోబరు మొదటి వారం వరకు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: సుందర కొల్లేరు.. ఉప్పొంగితే ‘ముప్పు’టేరు -
ఈనెల 5న మరో అల్పపీడనం.. ఏపీకి మళ్లీ భారీ వర్ష సూచన!
సాక్షి, విశాఖపట్నం: భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీ ప్రజలకు మరో హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ. ఈనెల ఐదో తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో, కోస్తా జిల్లాలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.కాగా, ఈనెల ఐదో తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలహీనపడి తుపాన్‌గా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ పేర్కొంది. ఇక, తుపాన్‌గా బలపడిన అనంతరం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిస్సా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో, కోస్తా తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.ఇదిలా ఉండగా..తాజాగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద రికార్డు స్థాయిలో వరద ప్రవాహం వెళ్తోంది. దీంతో, విజయవాడ జల దిగ్భందమైంది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగడానికి నీరు, తినడానికి తిండి లేకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో సర్కార్ తీరుపై మండిపడుతున్నారు. మరోవైపు.. తాజాగా వరదల కారణంగా 15 మంది మరణించినట్టు తెలుస్తోంది. -
TG: దంచికొడుతున్న వర్షం.. జల దిగ్బంధంలో పలు ప్రాంతాలు
Heavy Rain In Telangana Updates..👉తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీగా వానలు పడుతున్నాయి. వర్షాల కారణంగా నదులు, చెరువులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. రహదారులపై నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.👉బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు 14 జిల్లాలకు రెడ్ అలర్ట్, పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. NEXT 24-48Hrs FORECAST!🚨 RED ALERT...!! for EAST, CENTRAL &SOUTH #TELANGANA 🌧️🚨⚠️⚠️#Hyderabad on Red Alert!! For the next 48Hrs, Let's Hope for the Best.STAY ALERT!! pic.twitter.com/85ZKbRd3Z8— Hyderabad Rains (@Hyderabadrains) August 31, 2024👉నల్లగొండ జిల్లాలోని వేములపల్లి మండలం బుగ్గవాయిగూడెం వద్దం నార్కెట్‌పల్లి- అద్దంకి హైవే పైకి నీరు చేరుకుంది. దీంతో, వాహనాల రాకపోకలకు స్వల్ప ఇబ్బందులు ఎదరవుతున్నాయి. 👉ఖమ్మం జిల్లాలో మున్నేరు నది ఉగ్రరూపం దాల్చింది. 15 అడుగులు దాటి మున్నేరు నది ప్రవహిస్తోంది. దీంతో, భయాందోళనలో మున్నేరు నది ప్రాంతం ప్రజలు. మరోవైపు.. నగరంలోని చెరువు బజార్, కవిరాజ్ నగర్, జెడ్పీ సెంటర్ ప్రగతి నగర్, ఖనాపురంలో భారీగా వరద నీరు చేరుకుంది.👉ఖమ్మం నగరంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. -
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర వైపు అల్పపీడనం దూసుకొస్తోంది. రేపు తీవ్ర అల్పపీడనంగా బలపడి విశాఖ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావారణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని స్పష్టం చేసింది.ఈ సందర్భంగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ మాట్లాడుతూ.. అల్పపీడనం ప్రభావంతో నేడు ఏపీలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సెప్టెంబర్ రెండో తేదీ నాటికి అల్పపీడనం వాయుగుండంగా మారి తెలంగాణ మీదుగా పయనించనుంది. ఈ క్రమంలో తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దన్నారు. NOWCAST UPDATE Currently parts of Coastal prakasam, scattered parts of central Ap, Godavari, Uttrandhra getting light to moderate rains in few places. Low pressure is around 300km away from #Vizag coast. As system comes closer to coast we can see gradual increase in rainfall pic.twitter.com/qyep9CEEi2— Eastcoast Weatherman (@eastcoastrains) August 30, 2024వర్షం కురిసే అవకాశం జిల్లాల వారీగా..అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలుకృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశంశ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలుకర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. Daily Weather Inference 30.08.2024Influence of Low Pressure Area over North Bay Heavy rains will continue in Central & North Coastal AP Telangana Odissa Chhattisgarh Vidarbha Kerala & Coastal Karnataka. Moderate/Heavy Rains likely in Nilgiris Valparai Ghats OVer TN.Sivagnagai… pic.twitter.com/ZYWqT8iIjB— MasRainman (@MasRainman) August 30, 2024 -
ఉత్తరాంధ్ర వైపు అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఉత్తర బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా ఉత్తరాంధ్ర వైపు దూసుకురానుంది. ఈ నెల 31న విశాఖపట్నం సమీపంలో తీరాన్ని దాటే సూచనలు కనిపిస్తున్నాయి. తీవ్ర అల్పపీడనం తీరం దాటిన తర్వాత.. మరింత బలపడి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వైపు ప్రయాణిస్తూ సెప్టెంబర్ 2 నాటికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. శుక్ర, శనివారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. కోస్తా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. -
తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు: ఐఎండీ
సాక్షి,హైదరాబాద్: జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. ఆవర్తనం కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.రాబోయే ఐదు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది.కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. -
రోజంతా ముంచెత్తిన వాన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. అయితే తెల్లవారు జామునుంచే గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమై చెరువులను తలపించాయి. ఫలితంగా ఆయా రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలు కురుస్తాయనే ముందస్తు సమాచారంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాల్లోని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ముందస్తుగా సెలవు ప్రకటించాయి. హైదరాబాద్ సమీప జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు సైతం నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు లోటు వర్షపాతంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు సమీప జిల్లాలకు ఈ వర్షంతో భారీ ఊరట దక్కింది. రాష్ట్రంలో 2.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం...ఉత్తర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవగా, దక్షిణ ప్రాంత జిల్లాల్లో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 2.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 7.31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రంలో 50.6 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, మంగళవారం నాటికి 58.27 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 15శాతం అధికంగా వానలు కురిసినట్టు ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుంలాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు, ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.– భారీ వర్షాలతో హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. ముషీరాబాద్ పార్శిగుట్టకు చెందిన విజయ్‌కుమార్(43) వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. కారులు, బైకులు కూడా కొట్టుకొని పోయాయి. ఒక అపార్ట్‌మెంట్‌పై పిడుగు పడి కొద్దిమేర ధ్వంసమై బీటల వారింది.పలు ప్రాంతాల్లో గోడలు కూలి వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి మూసీకి వరద పోటెత్తోంది. దీంతో మూసారాంబాగ్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. దీంతో దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జంటజలాశయాల్లో సైతం భారీ వరద నీరు వచ్చి చేరింది.– ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని వంద పడకల ఆస్పత్రి భవన ప్రాంగణం జలమయమైంది. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద రెండు అడుగుల వరద నీరు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గద్వాల జిల్లా అయిజ మండలంలో ఓ అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. – రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వాగులు, వంకలు ఉరకలెత్తాయి. లోతట్లు ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. కడ్తాల్ మండలం మేడికుంట చెరువుకు గండి పడి, నీరంతా వృథాగా పోయింది. -
మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే నదులు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. ఏపీలో, తెలంగాణలో రాబోయే 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారుకాగా, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నాలుగు రోజులు పాటు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. అల్పపీడనం కారణంగా తీరం వెంబడి గంటలకు 40-50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో కూడా రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టు తెలిపింది. ఇక, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మూడు రోజుల పాటు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
Telangana: కరువుతీరా వర్షాలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: కరువుతీరేలా.. వరుణుడు కరుణించాడు. వానాకాలం ప్రారంభమైన నలభై రోజుల అనంతరం ఒకేసారి రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని పలు వాగులు, ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. పలుచోట్ల పంట పొలాల్లోకి నీరు చేరింది. శనివారం జిల్లాల వారీ గణాంకాలు పరిశీలిస్తే.. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో సగటున 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత ములుగు జిల్లాలో 4.19 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4.0 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో 12.15 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా అంతటా.. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా రెండురోజులుగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కాగా, ఇంకొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా ఖమ్మం ఎన్నెస్పీ గెస్ట్‌హౌస్ ప్రాంతంలో 2.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ముసురు వాన ఉండడంతో పలుచోట్ల వరి నారుమడులు, పత్తి చేన్లలో వరద నీరు నిలిచింది. పలుచోట్ల చెరువులు నిండి అలుగు పోస్తుండగా అక్కడక్కడా రహదారులు, లోలెవల్ బ్రిడ్జిలపైకి వరద చేరింది. ఉధృతంగా జంపన్న, ముసలమ్మ వాగులు ములుగు జిల్లాలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో ఏజెన్సీలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఏటూరునాగారం మండలంలోని కొండాయి, ఎలిశెట్టి గ్రామాల సమీపంలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మర పడవలను ఏర్పాటు చేశారు. ఎలిశెట్టిపల్లి సమీపంలో జంపన్న వాగు ఉధృతి ఎక్కువ కావడం, దబ్బగట్ల శైలజ, పులిసె అనూష అనే గర్భిణులు పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో వారిని పడవల్లో వాగు దాటించి ఆస్పత్రికి తరలించారు. రామన్నగూడెం పుష్కరఘాట్‌కు 6 కిలోమీటర్ల దూరంలో కరకట్ట కోతకు గురవుతుండటంతో ఇరిగేషన్ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. మంగపేట మండలంలోని రాజుపేట ముసలమ్మవాగు వరద ఉధృతికి ఒడ్డు కోతకు గురవుతుండటంతో ఒడ్డు వెంట నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాజేడు మండల పరిధిలోని కొప్పుసూరు గుట్టల వద్ద ఉన్న గుండ్లవాగు ప్రాజెక్టు కట్ట ప్రమాదకరంగా ఉండటంతో అధికారులు పరిస్థితిని సమీక్షించారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పోతుల్వాయి సమీపంలోని బొర్రవాగు, గుండ్రాత్‌పల్లి సమీపంలోని అలుగువాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద కాజ్‌వేల పైనుంచి వెళ్తుండడంతో పలు గ్రామాలకు మండలం మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో పత్తి చేలల్లోకి వరద నీరు చేరింది. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వర్షాలతో మల్హర్ మండలం తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్‌రెడ్డి, మైన్ మేనేజర్ కేఎస్ఎన్ మూర్తిలు తెలిపారు. వర్షాల కారణంగా 1.30 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ, 6 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. గోదావరిలో కలెక్టర్, ఎస్పీ బోటు ప్రయాణం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్, పలిమెల మండలాల్లో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే పర్యటించారు. గోదావరిలో బోటులో ప్రయాణించి వరద ఉధృతిని పరిశీలించారు. అక్కడి నుండి ఛత్తీస్‌గఢ్ సరిహద్దు మారుమూల గ్రామమైన దమ్మూరుకు చేరుకొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్రి–సాంగిడి దారి మూసివేత ఎడతెరిపిలేని వర్షాలతో వరద నీరు పోటెత్తడంతో ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని ఉమ్రి వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన తెగిపోయింది. దీంతో ఉమ్రి–సాంగిడి దారిని పోలీసులు మూసి వేశారు. రెండు మండలాల పరిధిలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వాగుపై కొత్త బ్రిడ్జి పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో, తాత్కాలిక వంతెన గుండానే రాకపోకలు కొనసాగుతున్నాయి. 60 గ్రామాలకు నిలిచిన రాకపోకలు మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లాలోని ఎల్లంపల్లి, ర్యాలీవాగు, గొల్లవాగు, నీల్వాయి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పలు మండలాల్లో 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సింగరేణి ప్రాంతాల్లోని శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి, కైరిగూడ, డొర్లి ఏరియాల్లోని ఓపెన్ కాస్టుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడి రూ.కోట్ల నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లా కడెం మండలంలో అత్యధికంగా 65.5మి.మీ వర్షపాతం నమోదైంది. ఖానాపూర్ మండలంలోని దిలావర్పూర్ వెళ్లే మార్గంలో రెంకోనివాగుపై వేసిన తాత్కాలిక రోడ్డు వర్షాలకు కొట్టుకుపోయింది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు జిల్లాలో 13.9 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సింగరేణి ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో శనివారం రోజంతా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కమ్మర్‌పల్లిలో 34.3 మిల్లీమీటర్లు, మెండోరాలో 28.0, నవీపేట్లో 27.5, బాల్కొండలో 24.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పాలమూరులో ముసురు వాన వనపర్తి జిల్లాలో 2.7 సెంటీమీటర్లు, నారాయణపేట జిల్లాలో 2.69, మహబూబ్‌నగర్ జిల్లాలో 2.49, జోగుళాంబ గద్వాల జిల్లాలో 2.04, నాగర్‌కర్నూల్ జిల్లాలో 1.42 సెంమీటర్ల వర్షపాతం నమోదైంది.ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా మహమ్మదాబాద్ మండలంలో 4.9 సెంమీ వర్షపాతం నమోదైంది. కొత్తకోట, జడ్చర్ల, ఆత్మకూరులో ముసురు వర్షానికి తడిసిన మట్టి ఇళ్లు కూలిపోయాయి. వీడని ముసురు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రెండు రోజులుగా ముసురు కొనసాగుతోంది. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో శనివారం 1.43 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదవగా కడ్తాలలో అత్యల్పంగా 0.95 సెంటీమీటర్లు నమోదైంది. వికారాబాద్ జిల్లాలోని పలు వాగులు ఉరకలెత్తుతున్నాయి. సగటు వర్షపాతం కంటే ఎక్కువగా.. శనివారం రాష్ట్రంలో 1.79 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోంది. శనివారం 0.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా రెట్టింపు వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్లో భాగంగా జూన్1 నుంచి ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో కురవాల్సిన సగటు సాధారణ వర్షపాతం 26.46 సెంటీమీటర్లు కాగా, ఇప్పటివరకు 33.11 సెంటీమీటర్ల వర్షపాతం (25 శాతం అధికం) నమోదైంది. గతేడాది ఇదే సీజన్లో 32.84 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత నైరుతి సీజన్లో శనివారం నాటికి రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఖమ్మం, నాగర్‌కర్నూల్, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ములుగు, కరీంనగర్, సూర్యాపేట, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షం కురిసింది. మిగిలిన జిల్లాలో గడిచిన నాలుగు రోజుల క్రితం వరకు సాధారణం కంటే తక్కువ నమోదైనా.. శుక్ర, శనివారాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో సాధారణ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ శనివారం రాత్రి ప్రకటించింది. వాయుగుండానికి తోడు ఉపరితల ద్రోణి పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం శనివారం మరింత ముందుకు సాగి ఒడిశాలోని చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమైంది. రానున్న ఆరు గంటల్లో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టంపై 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండురోజులు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. నేడు అతిభారీ, అత్యంత భారీ వర్షాలు!ఆదివారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. ఆ మేరకు పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. -
ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంపైన నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్టు వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు, అతి భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వాతావరణశాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. సోమవారం రాష్ట్రంలో సగటున 1.85 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో సగటున 4.39 సెం.మీ. వర్షం కురవగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4.33 సెం.మీ. వికారాబాద్ జిల్లాల్లో 4.16 సెం.మీ., మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 4.04 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. -
రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ద్రోణి ప్రభావంతో వచ్చే మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఏపీ, యానాం మీదుగా నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో పలు చోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ⇒ మంగళవారం శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ⇒ బుధవారం అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ⇒ గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ⇒ జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా సగటు సాధారణ వర్షపాతం 99.4 మిల్లీ మీటర్లు నమోదుకావాల్సి ఉండగా 162.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 19 జిల్లాల్లో అత్యధిక, 5 జిల్లాల్లో అధిక, 2 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. -
మూడు రోజులు వర్షాలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు ఉత్తర, తూర్పు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, అలాగే వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణ స్థితిలో నమోదైనప్పటికీ.. కొన్ని జిల్లాల్లో మాత్రం లోటు వర్షపాతం ఉంది. ఈ మూడు రోజుల పాటు వర్షాలు ఆశాజనకంగా ఉంటే రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 13.07 సెంటీమీటర్ల వర్షపాతం రాష్ట్రంలో నైరుతి సీజన్లో జూన్ నెలలో కురవాల్సిన సగటు వర్షపాతం 12.94 సెంటీమీటర్లు. ఈ నెలలో గురువారం నాటికి నమోదు కావాల్సిన సగటు వర్షపాతం 11.14 సెంటీమీటర్లు కాగా.. 13.07 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాగా, మూడు జిల్లాల్లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. 16 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 8 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు చెపుతున్నాయి. సాగు పనులు ముందుకెళ్లాలంటే ఈ వారం వర్షాలే కీలకం కానున్నాయి. సాగు విస్తీర్ణం పెరుగుదలకు ఈ వర్షాలు ఉపయోగపడతాయని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
వానలే వానలు.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఏపీలో ఐదు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాల పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. తెలంగాణలో రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని.. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.ఏపీలో కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం చురుకుగా మారాయి. మరోవైపు రాష్ట్రంపైకి దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న ఐదు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించిందిగురు, శుక్రవారాల్లో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని పేర్కొంది. అదేసమయంలో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతోపాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని వివరించింది. -
అరచేతిలో వాతావరణ సమాచారం
రాయవరం: ఈ మధ్యకాలంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా ఒకరోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మరోరోజు ఈదురు గాలులతో కూడిన అకాలవర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు అయోమయానికి గురయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌లు రూపొందించింది. డామిని, మేఘ్‌దూత్, రెయిన్ అలారం.. యాప్‌లు ఆవిష్కరించింది. వీటిద్వారా వాతావరణ పరిస్థితులను అంచనా వేయవచ్చని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు.ప్రధానంగా వర్షాకాలం మొదలుకానున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతల వివరాలు, వర్షాల రాక సమాచారాన్ని కూడా యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. ఉరుములు, మెరుపుల నుంచి రక్షించుకోవడం, వర్షం పరిస్థితులను అంచనా వేయడం సులభమవుతంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ శాఖ రూపొందించిన ఈ యాప్‌లు రైతులకు సాగులో తోడ్పడనున్నాయి. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ ద్వారా వీటిని డౌన్లోడ్ చేసుకుంటే చాలు. వాతావరణ సమాచారం మొత్తం మన అరచేతిలో ఉన్నట్టే. ‘డామిని’లో ఉరుములు, మెరుపుల హెచ్చరిక ఒక్కోసారి వాతావరణంలో అప్పటికప్పుడు మార్పులు సంభవించి ఉరుములు, మెరుపులు వస్తాయి. పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ఇలాంటి హెచ్చరికలను తెలిపేందుకు డామిని యాప్ ప్రయోజనకరంగా ఉంటుంది. మెరుపు ఎప్పుడు వస్తుంది? మెరిసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అప్రమత్తంగా ఉండాల్సిన తీరును ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. లొకేషన్ ఆధారంగా మెరుపులు వచ్చే అవకాశం ఉందో? లేదో? కూడా తెలుస్తుంది. పిడుగు పడినప్పుడు తోటివారికి అందించాల్సిన వైద్యసహాయం వంటి ప్రాథమిక సమాచారాన్ని తెలియజేస్తుంది. రైతులకు, రైతుకూలీలకు బయటి ప్రాంతాల్లో పనిచేసేవారికి ఈ యాప్ ఎంతో తోడ్పడుతుంది. వాతావరణ సమగ్ర వివరాలతో ‘మేఘదూత్’ మేఘదూత్ యాప్‌లో వాతావరణానికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. వర్షపాతం వివరాలు, గాలిలో తేమ, గాలి వేగం, గాలి వీచే దిశ, నమోదైన ఉష్ణోగ్రతలు, రానున్న 24 గంటల్లో వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. గడిచిన వారం రోజులు, రానున్న మరో నాలుగు రోజుల వాతావరణ వివరాలు కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. వర్ష సూచనకు ‘రెయిన్ అలారం’ వర్షం ఎప్పుడు పడుతుంది. వర్షపాతం వివరాలు, రానున్న కాలంలో వర్ష సూచనలను రెయిన్ అలారం యాప్ తెలియజేస్తుంది. మనం నివసిస్తున్న ప్రాంతంలో వాతావరణ, వర్ష సూచనలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయో తెలియజేస్తుంది. -
నేడు రాయలసీమలో భారీ వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు స్థిరంగా కదులుతున్నాయి. గాలుల కోత, షీర్ జోన్ ప్రస్తుతం సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరోవైపు మరఠ్వాడా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మంగళవారం రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో, బుధవారం నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. గురువారం బాపట్ల, కోనసీమ, పశి్చమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవవచ్చని పేర్కొంది. -
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు గట్టి వానలే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఇక, వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో రేపటి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది. మరోవైపు.. మే 30వ తేదీన కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు తెలంగాణలో జూన్ ఐదు, ఆరో తేదీల్లో విస్తరించనున్నాయి. రుతుపవనాల రాకతో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. Weather update #TelanganaNow GFS showing super rains for South East Telangana super rains for next 24 hours be prepared ⛈️ pic.twitter.com/xJXBSv1ysl— Telangana state Weatherman (@tharun25_t) June 2, 2024 ఇదిలా ఉండగా.. ఉపరితల ఆవర్తనం కారణంగా నేడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఎల్లో అలర్ట్ విధించింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఇక, హైదరాబాద్‌లో ఈరోజు మధ్యాహ్నం నుంచి వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. 7-day forecast(Morning) of Telangana state based on 0000 UTC issued at 1000 Hrs IST Dated : 02/06/2024@CEO_Telangana @TelanganaCMO @SpokespersonECI @ECISVEEP @TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @CommissionrGHMC @HYDTP @IasTelangana @tg_weather #ECISVEEP pic.twitter.com/Eo9tNPmTK5— IMD_Metcentrehyd (@metcentrehyd) June 2, 2024 -
AP Rains: చల్లటి కబురు.. పలుచోట్ల భారీ వర్షం
సాక్షి, విశాఖపట్నం: ముందస్తు నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచే విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది.కాగా, ఏపీలో వాతావరణం చల్లబడింది. పలుచోట్ల ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. మెరుపులు, ఈదురు గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్థంభాలు కూలిపోయాయి. దీంతో, పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.1st June 6:11 am : Heavy to very heavy rainfall ahead for Ambedkar Konaseema district as the storms from #Kakinada is coming down. During next 2 hours, Amalapuram - Razolu - Ramachandrapuram belt will see heavy rains with strong lightning bolts. ⚠️⚠️— Andhra Pradesh Weatherman (@praneethweather) June 1, 2024 Early Morning heavy rains triggered along #Visakhapatnam city :Gajuwaka - 60 mmBheemili - 57 mmGopalapatnam - 50 mmSimhachalam - 42 mmPendurthi - 41 mmMaharanipeta - 36 mmArilova - 36 mmSeethammadhara - 35 mmMore rains to happen today and tomorrow in and around Vizag…— Andhra Pradesh Weatherman (@praneethweather) June 1, 2024 -
రెండ్రోజులు వానలు
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరఠ్వాడ, కర్ణాటక, తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో అత్యధికంగా 40.5 డిగ్రీ సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో అత్యధికంగా 24.8 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఈనెల 14 నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని ఆ శాఖ తెలిపింది. -
AP: నేడు 13 జిల్లాలకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు(పోలింగ్ రోజు) కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది.కాగా, ఏపీ వివిధ ప్రాంతాల్లో రాబోయే అయిదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే, నేడు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టు తెలిపింది. Weather update 12th May,2023#AndhraPradesh & #Telangana:North AP , central AP -central,west TG will get scattered thunderstorms today.#TamilNadu : west & south interior TN and parts of Delta TN will get scattered thunderstorms, coastal TN will tomorrow early morning rains pic.twitter.com/KbLZe7L6Xg— Eastcoast Weatherman (@eastcoastrains) May 12, 2024 ఇక, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఆదివారం కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. -
తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వాతావరణం చల్లబడింది. ప్రజలు వేసవి ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు.. అకాల వర్షాల కారణంగా పంట నష్టంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది.తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదే సమయంలో ఎన్నికలు జరిగే మే 13వ తేదీన కూడా ఏపీ, తెలంగాణలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ పేర్కొంది. 7-day forecast(Morning) of Telangana state based on 0000 UTC issued at 1000 Hrs IST Dated : 09/05/2024@CEO_Telangana @TelanganaCMO @SpokespersonECI @ECISVEEP @TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @CommissionrGHMC @HYDTP @IasTelangana @tg_weather #ECISVEEP pic.twitter.com/8L03NcJSOq— IMD_Metcentrehyd (@metcentrehyd) May 9, 2024 ఇదే సమయంలో రాబోయే 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక, మంగళవారం ద్రోణి ప్రభావంతో భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, వచ్చే నాలుగు రోజులు వాతావరణం చల్లగా ఉండి, అక్కడక్కడ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందన్నారు. REALISED WEATHER OVER TELANGANA DATED:08.05.2024@CEO_Telangana @TelanganaCMO @SpokespersonECI @ECISVEEP @TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @CommissionrGHMC @HYDTP @IasTelangana @tg_weather #ECISVEEP pic.twitter.com/PrzDH17gFu— IMD_Metcentrehyd (@metcentrehyd) May 9, 2024 -
AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. నెలన్నర రోజులుగా వడగాడ్పులు, వడగాడ్పులు వీస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకుంటున్నాయి.ఈ తరుణంలో ఒకపక్క వడగాడ్పులు కొనసాగుతూనే మరోపక్క ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పతున్నాయి. ఆది, సోమవారాల్లో కోస్తాంధ్ర, రాయల సీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం నివేదికలో వెల్లడించింది.ఈ నెల 7న (మంగళవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు, ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.మరోవైపు శనివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 47.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. 28 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 187 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. ఆదివారం 30 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 247 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. సోమవారం 15 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 69 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. -
తెలంగాణకు వర్ష సూచన.. 10 రోజుల పాటు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త అందించింది. వచ్చే పది రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గి.. పలు చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తర్వాత ఎండ తీవ్రత పెరిగే సూచనలు ఉన్నట్టు స్పష్టం చేసింది. కాగా, వర్షాల కారణంగా తగ మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు కాస్త పడిపోయాయి. వచ్చే పది రోజులపాటు అంటే.. ఈ నెల 25 వరకు రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు ఉండవని, సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి 25 వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అంచనా వేసింది. రాజస్థాన్ మీదుగా నైరుతి రుతుపవనాలు తుఫానుగా మారి కోస్తా కర్ణాటక వరకు వ్యాపించాయని తెలిపింది. మరో ఐదురోజులపాటు హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నది. మరోవైపు గురు, శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక, అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తెలంగాణకు చల్లటి కబురు.. రెండు రోజులు వర్షాలే..
సాక్షి, హైదరాబాద్: వేసవి ఎండతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందిన తెలిపింది. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా, వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఆరో తేదీ వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. ఈనెల 7, 8 తేదీల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. @CEO_Telangana @TelanganaCMO @SpokespersonECI @ECISVEEP @TelanganaCS @DCsofIndia @IASassociation @IasTelangana @tg_weather @metcentrehyd #ECISVEEP #CEO_Telangana pic.twitter.com/DWngGDsOSh — IMD_Metcentrehyd (@metcentrehyd) April 3, 2024 మరోవైపు.. తెలంగాణలో ఈ ఎండా కాలంలో తొలిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత బుధవారం నమోదైంది. ఖమ్మంతోపాటు భద్రాద్రి కొత్తగూడెంలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎల్‌నినో పరిస్థితులు జూన్ చివరి వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ వేసవిలో ఎండలు ఎకువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. నిజామాబాద్‌లో 41.2, ఆదిలాబాద్‌లో 41.3, మెదక్, రామగుండం, నల్లగొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. -
AP: కోస్తా జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఇక, రానున్న రెండు రోజుల్లో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అనంతరం, మళ్లీ సాధారణ ఉష్ణోగ్రతలే నమోదు కానున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. తాజాగా విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద మీడియాతో మాట్లాడుతూ.. కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావం ప్రధానంగా ఉత్తర కోస్తాపై ఉంటుంది. అక్కడక్కడా చెదురుమొదురు వర్షాలు కురుస్తూ.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.కోస్తా ప్రాంతంలో రెండు రోజులపాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. ఈ రెండు రోజుల తర్వాత మళ్లీ సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. వర్షాలు పడే ప్రాంతాల్లో గాలుల వేగం కూడా ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు. మరోవైపు.. తెలంగాణలో ఇప్పటికే పలు భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో కూడా మంగళవారం పలుచోట్ల వర్షం కురిసింది. రానున్న మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. -
HYD: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. ఇక, మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక, హైదరాబాద్ ఈరోజు ఉదయం దిల్సుఖ్నగర్, చైతన్యపురి, సరూర్‌నగర్, కర్మాన్‌ఘాట్, వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్ నగర్, చార్మినార్, కోఠి పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఇక, కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కౌడిపల్లి మండలం జాబితాండలో అకాల వర్షం, ఈదురు గాలుల కారణంగా ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి సంగీత చనిపోయింది. pic.twitter.com/GaPhmhUzwC — kutharamp OG (@nanisumanth29) March 19, 2024 ఇక, ఈదురు గాలల వర్షం కారణంగా పలుచోట్ల రైతులకు తీవ్ర నష్ట వాటిల్లింది. గాలుల కారణంగా మామిడి పూత, కాయలు రాలిపోయాయి. అలాగే, వరి పంట, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది. -
చల్లటి కబురు: తెలంగాణకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు అందించింది. ఈరోజు, రేపు తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఇక, ఇప్పటికే ఉత్తర తెలంగాణలో పలుచోట్ల వర్షం కురిసింది. కాగా, ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలో వాతావరణం కొంత చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కొనసాగుతుండటం వల్ల రాగల 24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలో మోస్తురు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ పేర్కొంది. మరోవైపు.. ఉత్తర తెలంగాణలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. కాగా, ఇప్పటికే ఆదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, మెదక్‌లో ఈదురు గాలులతో వర్షం కురిసింది. కామారెడ్డిలో పిడుగుపాటు కారణంగా ఇద్దరు మృతిచెందినట్టు తెలుస్తోంది. Good Summer Rains ☔ in #Telangana . Thank God.@Rajani_Weather @balaji25_t pic.twitter.com/ED4qNYMsim — Mohd Abdul Sattar (@SattarFarooqui) March 16, 2024 #24HrWx North and adjoining West #Telangana districts most likely to see thunderstorms today. pic.twitter.com/BMGJt6h8uw — Weather@Hyderabad|TS|AP 🇮🇳 (@Rajani_Weather) March 16, 2024 Weather update!! #Telangana Now scattered thunderstorms rains going in North telangana Asifabad karimnagar bhupalpally Medak warangal will see heavy thunderstorms rains activity ⛈️ pic.twitter.com/Z9BLY4Isfy — Telangana state Weatherman (@tharun25_t) March 16, 2024 -
తెలంగాణకు వర్షసూచన.. ఈ జిల్లాల్లో వానలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముంది. ఇక, ఆవర్తనం కారణంగా హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతంగా మారింది. రానున్న 48 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. సాయంత్రం సమయాల్లో జంటనగరాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇక, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డిలో మోస్తరు వానలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. -
ఏపీ, తెలంగాణకు వర్ష సూచన..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబరు అందించింది. తెలంగాణ, ఏపీలో రెండు రోజుల పాటు అక్కడకక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వివరాల ప్రకారం.. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. శని, ఆదివారాల్లో పలు చోట్లు వర్షం కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో మూడు రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఖమ్మం, నల్గొండ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. రాత్రిపూట ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. Clouds are forming the border of Telangana, Andhra ,chhattisgarh and orrisa with increase in some heat result in some good isolated spell over these areas in the coming 2 days. #Rains pic.twitter.com/Uqcwd397d5 — SadhuWeatherman (@abhiramsirapar2) February 23, 2024 -
ఏపీ, తమిళనాడుకు వర్షసూచన
సాక్షి, అల్లూరి/విశాఖపట్నం: ఏపీలోని రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా ద్రోణి కొనసాగుతోంది. ద్రోణికి అనుబంధంగా సముద్ర మట్టంపై 1.5 మీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతున్నట్టు ఐఎండీ పేర్కొంది. వీటి ప్రభావం ఉన్న తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక.. ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అల్లూరి జిల్లాలోని లంబసింగిలో ఏకంగా ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, చింతపల్లిలో ఎనిమిది డిగ్రీలు, అరకు లోయలో పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. అలాగే, పాడేరు అమ్మవారి పాదాలు వద్ద 8.2, మినుములూరు వద్ద 9.1, పాడేరులో 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. WEATHER UPDATE 5TH JAN: Light to moderate rain forecast for coastal #TamilNadu including #Chennai during next 24 hours. Parts of south #Ap Tirupati, Nellore can see scattered showers. West #TN to see isolated heavy rains. Rayalaseema to remain cloudy with isolated light rains. pic.twitter.com/OJNkKUCvq9 — Eastcoast Weatherman (@eastcoastrains) January 5, 2024 -
‘మిచాంగ్’ హోరు.. తీవ్ర రూపం దాల్చిన తుపాను.
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుపాను సోమవారం తీవ్ర రూపం దాల్చింది. గంటకు పది కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తాంధ్రకు సమాంతరంగా కదులుతుండడంతో తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగలో 28.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా పెళ్లకూరులో 23.1, దొరవారిసత్రంలో 26.4, నాయుడుపేట 21, సూళ్లూరుపేట 20.3, నెల్లూరు 24.3, ఇందుకూరుపేటలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆయా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తీరప్రాంతం అతలాకుతలమైంది. విపరీతమైన ఈదురుగాలులతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నెల్లూరు నగరం తడిసి ముద్దయింది. పలు ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయి. ప్రధాన వీధుల్లో రాకపోకలు స్తంభించాయి. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారుల్లో మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అండర్ బ్రిడ్జిలు జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. శివారు కాలనీలు నీట మునిగాయి. కృష్ణపట్నం పోర్టులో 10వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సోమవారం ఉదయం నుంచి బాపట్ల, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఈ మూడు జిల్లాల్లో వర్షాలు, గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. బాపట్ల, అవనిగడ్డ, మచిలీపట్నం, రేపల్లె తదితర ప్రాంతాల్లో సముద్రపు నీరు లోతట్టు ప్రాంతాలోఇకి చొచ్చుకుని వచ్చే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో మంగళవారం కోస్తా తీరమంతా తీవ్రమైన గాలులు వీస్తూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 60 గ్రామాలకు రాకపోకలు బంద్ తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. సుమారు 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, పలు గ్రామాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రధాన రహదారులలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపివేశారు. గూడూరు నియోజకవర్గంలోని చిట్టమూరు మండలంలో పిట్టవారిపల్లె వద్ద రొయ్యల చెరువులో ఐదుగురు కూలీలు చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సమన్వయంతో వారిని రక్షించారు. చిళ్లకూరు మండలంలోని తిప్పగుంట పాళెం వద్ద ఉప్పుటేరు ఉదృతంగా ప్రవహించడంతో ఆ ప్రాంతంలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సత్యవేడు నియోజకవర్గంలోనూ 40కి పైగా గ్రామాల్లో రాకపోకలు నిలిచి పోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు పదుల సంఖ్యలో నేలకొరిగాయి. విద్యుత్‌ను పునరుద్ధరించడానికి అధికారులు యుద్ద ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. తిరుపతి జిల్లాలో పొలాల్లా వరి పంట నీట మునిగింది. కాళంగి, మల్లెమడుగు, కళ్యాణిడ్యామ్లు, స్వర్ణముఖి, సదాశివకోన, అరణియార్ ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోగా ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తగా గేట్లు ఎత్తివేశారు. స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కరకట్ట దెబ్బతినకుండా జేసీబీల సహాయంతో అధికారులు ఎప్పటికప్పుడు మరమతులు చేస్తున్నారు. ఏర్పేడు మండలం చిందేపల్లి ఎస్టీకాలనీలో ఆదివారం గోడ కూలి యశ్వంత్ అనే బాలుడు మృతి చెందగా తక్షణమే స్పందించిన రెవెన్యూ అధికారులు రూ.4 లక్షలు ఆర్థిక సాయం అందించారు. చలి గాలులకు తట్టుకోలేక సోమవారం వాకాడు మండలం గొల్లపాళెం గ్రామానికి చెందిన బందిల పొండమ్మ (63) అనే వృద్ధ మహిళ మృతి చెందింది. నాగలాపురం మండలం కొట్తకాడు గ్రామంలో సంధ్య అనే మహిళకు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పురిటినొప్పులు వచ్చాయి. అయితే తీవ్ర వర్షాల వల్ల ఎక్కడికక్కడ దారులు మూసుకుపోయాయి. దీంతో గ్రామస్తులు, కుటుంబీకులు ఆమెను చేతులతో మోసుకొని వాగు దాటించారు. నగరి నియోజకవర్గ పరిధిలోని కుశస్థలి ఉధృతంగా ప్రవహిస్తోంది. కార్వేటి నగరం మండలంలోని క్రిష్ణాపురం జలాశయంకు అధికంగా వరద నీరు చేరుతోంది. పెనుమూరు మండలంలోని ఎన్టీఆర్ జలాశయం గేటు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సోమవారం ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. అలల ధాటికి పాకల సముద్ర తీరం కోతకు గురైంది. పడవలు, వలలు ఇతర సామాగ్రి సైతం జాగ్రత్త చేసుకునేలా మత్స్యకారులకు అవగాహన కల్పించారు. బాపట్ల జిల్లాలో తుపాన్ కారణంగా సముద్రంలో అలజడి రేగింది. అలలు ఉవ్వెత్తున ఎగిసి తీరంవైపు చొచ్చుకువచ్చాయి. చీరాల, బాపట్ల, నిజాంపట్నం తీరంలో సముద్రం కొంతమేర ముందుకు వచ్చింది. ఈదురు గాలులు పెరిగాయి. చీరాల, బాపట్ల, రేపల్లె ప్రాంతాల్లో సోమవారం సాయంత్రానికి వర్షం పెరిగింది. బాపట్ల వద్ద తీరం దాటే అవకాశం మిచాంగ్ తుపాను గత ఆరు గంటలుగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం ఇది నెల్లూరుకు ఆగ్నేయంగా 120 కిలోమీటర్ల దూరంలో, బాపట్లకు ఆగ్నేయ దిశలో 250 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణంగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర దిశగా దక్షిణ ఏపీ తీర ప్రాంతాలైన నెల్లూరు, మచిలీçపట్నానికి సమాంతరంగా ప్రయాణిస్తూ మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి వంద కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రకటించింది. అందుకనుగుణంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, ఏపీఎస్డీపీఎస్ (ఏపీ స్టేట్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ) అధికారులు జిల్లాలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ అప్రమత్తం చేస్తున్నారు. కాగా, తుపాను ప్రభావంతో మంగళవారం రాత్రి వరకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని మండలాల్లో అక్కడక్కడ సోమవారం చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. రైల్వేకోడూరులో మాత్రం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. రేణిగుంట ప్రధాన రహదారిలో శేషాచల అడవుల నుంచి భారీగా వచ్చిన వరద నీరు రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించింది. మామిడి, అరటి, బొప్పాయి తోటల్లో వర్షపు నీరు నిలిచింది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. పూసపాటిరేగ మండలం చింతపల్లి రేవులో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లలేదు. బోట్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆదివారం రాత్రి నుంచి గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దెబ్బతిన్న కాకినాడ–ఉప్పాడ బీచ్‌రోడ్డు కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ–ఉప్పాడ బీచ్‌రోడ్డు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర పూర్తిగా దెబ్బతింది. కెరటాలు బీచ్‌రోడ్డుపైకి దూసుకు వస్తుండడంతో రక్షణగా వేసిన బండరాళ్లు సైతం పక్కకు కదిలిపోతున్నాయి. సోమవారం ఉదయం నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ట్రాఫిక్‌ను ఉప్పాడ నుంచి పిఠాపురం మీదుగా మళ్లించారు. సోమవారం ఉదయం సముద్రం ఉగ్రరూపం దాల్చి గ్రామాలపైకి విరుచుకుపడింది. ఈదురు గాలుల ప్రభావం వల్ల పొన్నాడ శివారు కోనపాపపేట తీవ్ర కోతకు గురవ్వగా పలువురు మత్స్యకారుల గృహాలు ధ్వంసమయ్యాయి. సముద్రతీరంలో లంగరు వేసిన బోట్లు ధ్వంసమవుతుండడంతో మత్స్యకారులు తమ బోట్లను, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉప్పాడ తీరం వెంబడి వేసిన జియోట్యూబ్ రక్షణగోడ సైతం కెరటాల ఉధృతిని ఆపలేక ధ్వంసమైంది. పలుచోట్ల అండలు జారడంతో సముద్రపునీరు గ్రామాల్లోకి చొచ్చుకు వస్తోంది. కెరటాలతోపాటు రాళ్లు ఎగిరి పడుతుండడంతోపాటు బీచ్ రోడ్డు కోతకు గురైంది. తీరంలో కెరటాలు సుమారు 8 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి. తీరం వెంబడి పోలీసు, రెవిన్యూ సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేశారు. నేడు, రేపు భారీ వర్షాలు సాక్షి, విశాఖపట్నం: మిచాంగ్ తుపాను తీవ్రరూపం దాలుస్తూ కోస్తాంధ్ర వైపు దూసుకొస్తోంది. గుంటూరు జిల్లా రేపల్లె, ప్రకాశం జిల్లా చీరాల, ఒంగోలు, కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటల్లో సముద్రం 120 నుంచి 250 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకు వచ్చే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఐఎండీ సూచించింది. తుపాను ప్రభావం వల్ల మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు.. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఎఎస్సార్, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. ఫలితంగా తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, యానాం, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని ఖమ్మం, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వరదకు అవకాశం ఉందని పేర్కొంది. -
తెలంగాణపై తుపాను ఎఫెక్ట్.. నేడు, రేపు భారీ వర్షసూచన
సాక్షి, హైదరాబాద్: మిచౌంగ్ తుపాను దూసుకొస్తోంది. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించి.. రేపు మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక, తెలంగాణపై కూడా తుపాను ప్రభావం చూపనుంది. దీంతో.. నేడు, రేపు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. తుపాన్ ప్రభావం ఇలా.. తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్న గాలులు నేడు, రేపు తెలంగాణవ్యాప్తంగా ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీచేసిన వాతావరణ శాఖ నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఎల్లో అలెర్ట్ జారీ ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో వీచే అవకాశం #CycloneMichaung🌀 Impact will start from Today Evening in #Telangana 🌨️🚨 East Telangana District's will see Heavy -Very Heavy Rainfall starting from today Evening to 6th Early Morning ⚠️#Hyderabad overcast Weather with Light -moderate expected from tonight/Early Morning. pic.twitter.com/b2YL7vwB7D — Hyderabad Rains (@Hyderabadrains) December 4, 2023 కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురు గాలులు రేపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఆరెంజ్ అలెర్ట్ జారీ నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ , హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మీల వేగంతో వీచే అవకాశం మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం దీంతో తెలంగాణవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉదయం వేళల్లో దట్టమైన పొగ మంచు ఉండే అవకాశం ఉంది. Cyclone Michaung is brutally smashing Chennai city with 200-250mm rains & also Tirupati, Nellore side. Next in target is Ongole, Machilipatnam as Cyclone will cross the coast tomorrow at Bapatla From today evening/night , rain will start in Nalgonda, Suryapet, Khammam, Bhadradri pic.twitter.com/SgtXDhc7HI — Telangana Weatherman (@balaji25_t) December 4, 2023 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీకి తుపాను ముప్పు.. రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపటికి తీవ్రవాయుగుండంగా, ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం సాయంత్రం చెన్నై- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డా. అంబేద్కర్ వెల్లడించారు. చదవండి: మనసున్న మారాజు సీఎం వైఎస్ జగన్ -
తమిళనాడులో భారీ వర్షం.. స్కూల్స్, కాలేజీలు బంద్
చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడువ్యాప్తంగాలో కొద్దిరోజులుగా ఎడతెరిపిలేని వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు, ఐదు తాలుకాలను వర్షం ముంచెత్తడంతో స్కూల్స్, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. వివరాల ప్రకారం.. తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుపూర్, మధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో కుండపోత వాన కురుస్తోంది. ఇక, నీల్గిరి జిల్లాలోని ఐదు తాలుకాలను వర్షం ముంచెత్తింది. ఈ క్రమంలో ఈ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. VIDEO | Schools and colleges have been shut in Nilgiris district of #TamilNadu as the region continues to witness heavy rains. pic.twitter.com/HP3hArcvOP — Press Trust of India (@PTI_News) November 9, 2023 ఇదిలా ఉండగా.. రాబోయే 24 గంటల్లో తమిళనాడు, కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గత కొద్ది రోజుల నుంచి కేరళ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం కన్నూరు జిల్లాలో 7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కేరళలో కూడా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. Normal life in Tamil Nadu's Coimbatore has come to a halt as heavy rain continues to pound parts of the state. #TamilNadu #HeavyRain #Rain #Rains #Coimbatore pic.twitter.com/n5bZGrYExp — Vani Mehrotra (@vani_mehrotra) November 9, 2023 Holiday declared in schools in several Tamil Nadu districts, including Madurai, Coimbatore, Dindigul, Tiruppur, due to #HeavyRain #TamilNadu #India #Rain #floods #Oppenheimer #Railway_New_Vacancy #DishaPatani #Save_Tiruvannamalai_Temple #Coimbatore#Chennai #Rains #Flood pic.twitter.com/Jz3T5XI8i4 — Arun Gangwar (@AG_Journalist) November 9, 2023 Visuals from Coimbatore, where heavy rain has crippled normal life. #TamilNadu #Coimbatore #HeavyRain #Rain #Rains pic.twitter.com/7qzwlWzA57 — Vani Mehrotra (@vani_mehrotra) November 9, 2023 -
అలర్ట్.. తెలంగాణకు భారీ వర్ష సూచన..
సాక్షి, హైదరాబాద్: కొద్దిరోజులుగా తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇక, తాజాగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈ క్రమంలో తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కాగా, శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, జనగాం, యాదాద్రి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. Rains further traversed in entire Central, South, East TS pouring all over Nalgonda, Suryapet, Khammam, Jangaon, Yadadri, Warangal, Hnk, Siddipet Now these rains pouring over Mancherial, Peddapalli, Mulugu, Bhupalapally, Bhadradri will continue for 2hrs Other parts - overcast https://t.co/Uq5n4pu03G — Telangana Weatherman (@balaji25_t) September 22, 2023 Morning widespread rains in #TS and raining in North and east Telangana states with Thunderstorms, Rains ended in Hyderabad and no rains expected upto afternoon-night. Later again rains expected pic.twitter.com/okkFiCaaJ4 — Telangana meteorologist (@SaiSaisathvik72) September 22, 2023 -
ఏపీకి వర్షసూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక, అల్పపీడనం కారణంగా గంటలకు 40 నుంచి 45 కిమీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్ప పీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, ఈనెల 17వ తేదీ వరకు మృత్య్సకారుల చేపలవేటపై నిషేధం విధించింది వాతావరణశాఖ. మరోవైపు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక, రాజధాని హైదరాబాద్‌లో కూడా ఆకాశం మోఘావృతమై ఉంది. ఇది కూడా చదవండి: ఐరాస సదస్సుకు ఏపీ విద్యార్థులు -
తెలంగాణకు అలర్ట్.. ఐదు రోజులు భారీ వర్షాలే..
సాక్షి, హైదరాబాద్: గత కొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు నిండి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తెలంగాణలో వచ్చే ఐదురోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాతావరణ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం నుంచి కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. నేటిం నుంచి శనివారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మంగళవారం నిజామాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, జయశంకర్ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. ♦️ తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.#WeatherForecast #rains #Telangana #weatheralert pic.twitter.com/NrIupV9JqF — DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) September 12, 2023 ఏపీకి వర్ష సూచన.. ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలోని మధ్య భాగాలకు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి సమీపంలో వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మీదుగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. మరోవైపు నైరుతి ఉత్తరప్రదేశ్ నుంచి ఉపరితల ఆవర్తనం ప్రాంతం వరకు మరో ద్రోణి పయనిస్తోంది. వీటి ఫలితంగా రానున్న రెండురోజులు ఉత్తరకోస్తాలో అనేకచోట్ల, దక్షిణకోస్తాలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది కూడా చదవండి: ఆఫ్రికాకు ప్రకృతి శాపం! నాలుగు రోజుల గ్యాప్‌లో 6వేల మంది మృతి! -
Weather Update: వాతావరణ శాఖ హెచ్చరిక.. తెలంగాణలో మూడు రోజులు గట్టి వానలే!
సాక్షి, హైదరాబాద్: కొద్దిరోజులుగా తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. వర్షం కోసం ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాగల మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. అయితే, తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భువనగిరి, మహబూబ్‌నగర్, హన్మకొండ, భద్రాద్రి, సంగారెడ్డి, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. Weather update #Telangana Scattered thunderstorms rains Nirmal asifabad mancherial Jagtial peddapalli karimnagar siddipet Bhongir mahabubnagar Hnk Bhadradri sangareddy rangareddy places see good rains for next 1 hour ⛈️⛈️⛈️⚠️ pic.twitter.com/FGR2Ub938X — Telangana state Weatherman (@ts_weather) September 2, 2023 ఆదివారం నుంచి సోమవారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అతి భారీ వర్ష సూచన.. సోమవారం నుంచి మంగళవారం వరకు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వివరించింది. ఇది కూడా చదవండి: కొత్తవి ఇవ్వరు..పాతవాటిలో చేర్చరు -
ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 2,3,4 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వివరాల ప్రకారం.. ఏపీకి సమీపంలో పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక, సెప్టెంబర్ 4వ తేదీ వరకు వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం వైపు దిగువస్థాయిలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆవర్తనాల ప్రభావంతో రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు, భారీ వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్ 2,3,4 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇది కూడా చదవండి: తాగునీటి సరఫరాలో జలమండలి నిర్లక్ష్యం -
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో ఐదు రోజులు వానలే..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వచ్చే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక, అల్ప పీడనం ప్రభావకంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోని నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, తెలంగాణలో మేడ్చల్, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, జనగామ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఈ మేరకు ఎల్లో, గ్రీన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇది కూడా చదవండి: చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత -
Rain Alert: కోస్తా జిల్లాల్లో ఈదురు గాలులు, వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం దాని అనుకొని తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఆవరించి ఉంది. రేపు అల్పపీడనంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంలో కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు ఈ రోజు నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఏపీ తీరం వెంబడి చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. చదవండి: ఏపీ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల రాగల మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురవనున్నాయి. రేపు(శుక్రవారం), ఎల్లుండి(శనివారం) అక్కడక్కడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాగల 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే పశ్చిమ, వాయువ్య దిశల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండగా.. మూడు రోజులపాటు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. -
బలహీనపడిన అల్పపీడనం.. గట్టి వానలు తగ్గినట్టే!
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, నెట్వర్క్: అల్పపీడనం బలహీనపడటంతో రాష్ట్రంలో వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టింది. శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. ఉత్తరాంధ్రకు ఆనుకుని దక్షిణ ఒడిశా, దాని పొరుగు ప్రాంతాలపై విస్తరించిన అల్పపీడనం బలహీనపడి దక్షిణ ఒడిశా, దానికి ఆనుకుని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాషŠట్ర వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పలు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆదివారం ఒకటి, రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ప్రాజెక్టుల్లో జలకళ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. బుధవారంతో పోల్చితే గురువారం పలు జిల్లాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతం 2.24 సెంటీ మీటర్లుగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 6.02 సెంటీ మీటర్లు, విశాఖపట్నం జిల్లాలో 5.24 సెంటీ మీటర్లు, కృష్ణా జిల్లాలో 4.48 సెంటీ మీటర్లు, నంద్యాల జిల్లాలో 4.43 సెంటీ మీటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో 4.19 సెంటీ మీటర్లు చొప్పున అత్యధిక వర్షపాతం కురిసింది. తిరుపతి జిల్లాలో 0.21 సెంటీ మీటర్లు అత్యల్ప వర్షపాతం నమోదైంది. బుధవారం అర్ధరాత్రి వరకూ కురిసిన వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు ఏర్లు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడటంతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు, చెరువులు వరద నీటితో కళకళలాడుతున్నాయి. ఎర్రకాల్వ, తమ్మిలేరు ప్రాజెక్టుల నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. ఇరిగేషన్ అధికారులు ఎప్పటి కప్పుడు వరద పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గురువారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. తాజా వర్షాలతో జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళను సంతరించుకుంటున్నాయి. విజయవాడ–హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ మళ్లింపు మున్నేరు వాగు ఉద్ధృతి కారణంగా ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం, కీసర గ్రామంలో 65వ జాతీయ రహదారిపై నీరు ప్రవహిస్తున్న కారణంగా విజయవాడ–హైదరాబాద్ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. విజయవాడలోని పోలీస్ కమిషనరేట్‌లో గురువారం రాత్రి విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, దాచేపల్లి, మిర్యాలగూడ, నార్కెట్‌పల్లి మీదుగా వెళ్లాలన్నారు. వరద ప్రవాహం తగ్గే వరకు ఈ సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. వరద ప్రాంతంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వరద నీటిలో వాహనాలు నడిపే సాహసం చేయవద్దని హెచ్చరించారు. కాగా, విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద గురువారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో నగర డీసీపీ విశాల్‌గున్నీ, వెస్ట్‌జోన్ ఏసీపీ హనుమంతరావు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను మైలవరం, తిరువూరు, ఖమ్మం మీదుగా మళ్లించారు. ఇది కూడా చదవండి: వానల ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు -
Telangana: మరో రెండ్రోజులు కుండపోత
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో విస్తారంగా వానలు పడతాయని వాతావరణశాఖ ప్రకటించింది. పలుచోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రానికి రెండు రోజులపాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని.. దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. వర్షాలకు తోడు పలుచోట్ల గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రకటించింది. కరకగూడెంలో 22.7 సెంటీమీటర్ల భారీ వాన బుధవారం రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 2.26 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. బుధవారం రాత్రి 10 గంటల సమయానికి అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో 29.2 సెంటీమీటర్ల భారీ వాన పడింది. రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో 15 సెంటీమీటర్లకుపైగా, మరో 35 చోట్ల 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ లెక్కలు చెప్తున్నాయి. నైరుతి సీజన్‌కు సంబంధించి జూలై 26 నాటికి రాష్ట్రంలో 32.2 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. ఈసారి 43.25 సెంటీమీటర్లు కురిసింది. అంటే సాధారణంతో పోలిస్తే.. 34శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 5 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 24 జిల్లాల్లో అధిక వర్షపాతం, 4 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలంలోని కటాక్షపూర్ చెరువు పొంగడంతో మునిగిన జాతీయ రహదారి హైదరాబాద్‌లో భారీ వర్షం.. రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బుధవారం పొద్దున్నుంచి ముసురు వాన కురవగా రాత్రి భారీ వర్షం పడింది. నగరంలోని టోలిచౌకిలో 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో రెండు నుంచి మూడు సెంటీమీటర్ల మేర వాన పడింది. దీంతో డ్రైనేజీలు, మ్యాన్‌హోల్స్ పొంగాయి. ప్రధాన రోడ్లపై నీరు చేరి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఎగువ నుంచి వరద పెరగడంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ తీర ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. గోదావరిఖనిలో వరద నీటి ప్రవాహం జిల్లాల్లో దంచికొట్టిన వాన ► కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో మంగళవారం రాత్రి నుంచీ వానలు దంచి కొడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు పరవళ్లు తొక్కుతుంది. సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోనరావుపేట మండలం మామిడిపల్లి, వట్టిమల్ల గ్రామాల వద్ద రెండు చోట్ల కాజ్‌వేలు కొట్టుకుపోయాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌లోని చాలా కాలనీలు జలమయం అయ్యాయి. ► ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగ, ప్రాణహిత, గోదావరి, కడెం ప్రాజెక్టుల్లో భారీగా వరద చేరుతోంది. పెన్‌గంగ, ప్రాణహిత తీరాల్లోని పొలాలు నీటిలో మునిగాయి. పలుచోట్ల చెరువులు, సాగు నీటి కాలువలకు గండ్లు పడ్డాయి. మంచిర్యాలలో రోడ్లపై మోకాళ్ల లోతుకు చేరింది. జిల్లా ఆస్పత్రిలోని వార్డుల్లోకీ వరద ప్రవేశించింది. ► నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ మండలంలో పంటలు నీట మునిగాయి. దీనితో పాటు కామారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న చిన్న ప్రాజెక్టులు, చెరువులన్నీ నిండి అలుగు పోస్తున్నాయి. ► ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా బుధవారం భారీ వర్షం కురిసింది. ఆత్మకూర్ మండలంలోని కటాక్షపూర్ చెరువు మత్తడి దూకుతుండటంతో.. దిగువన ఉన్న 163 నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరకాల చలివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లాలోని రామప్ప జలాశయం, లక్నవరం చెరువు నిండిపోయాయి. కొంగాల వాగు, మర్రిమాగు వాగు, బొమ్మనపల్లి, గుండ్ల వాగు, ఇసుక వాగు ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరంగల్ నగరంలోని ఎన్టీఆర్ నగర్, సంతోషిమాతకాలనీ, భద్రకాళి నగర్, గాయత్రినగర్, సాయినగర్ కాలనీలు నీట మునిగాయి. నర్సంపేటలో ఎనీ్టఆర్ నగర్, సర్వాపురం కాలనీలు నీట మునిగాయి. ► ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం అతి భారీ వర్షాలు కురిశాయి. పాలేరు రిజర్వాయర్ అలుగు పోస్తోంది. వైరా రిజర్వాయర్, లంకాసాగర్ ప్రాజెక్టు, బేతుపల్లి చెరువు, జాలిముడి ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు నిండిపోయింది. పలుచోట్ల వాగులు, చెరువులు ఉప్పొంగి రోడ్లపైకి రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ► ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిధిలోని చాలా ప్రాంతాల్లో బుధవారం మోస్తరు వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో మండలంలో సముద్రం చెరువు, వీరుల చెరువు, మోటకొండూర్ చెరువులు అలుగు పోస్తున్నాయి. ఆత్మకూరు మండలంలోని బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భూదాన్‌పోచంపల్లి మండలంలోని జూలూరు–రుద్రవెల్లి మధ్య ఉన్న లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ నది ప్రవహిస్తోంది. గంధమల్లలో వర్షానికి రెండు ఇళ్లు కూలిపోయాయి. సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు, పాత చిలుకూరు మధ్య బ్రిడ్జిపై వరద ప్రవహిస్తోంది. బేతవోలు రోడ్డులోని పొలాల్లో ఇసుక మేటలు వేసింది. జాజిరెడ్డిగూడెం మండలంలో తిమ్మాపురం– సంగెం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. -
రాష్ట్రానికి రెడ్ అలర్ట్
నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో తాజాగా కురిసిన 46.3 సెంటీమీటర్ల వాన రాష్ట్రంలో మూడో అతి భారీ వర్షంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకుముందు 2013 జూలై 19న ములుగు జిల్లా వాజేడులో ఏకంగా 51.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే ఏడాది జూలై 23న కొమ్రంభీం జిల్లా దహెగాంలో 50.36 సెంటీమీటర్ల వాన పడింది. సాక్షి, హైదరాబాద్, సాక్షి నెట్వర్క్: ఎడతెరిపిలేని వానలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. ఆకాశం చిల్లులు పడిందా అన్నట్టుగా వానలు పడుతున్నాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఇప్పుడీ వానలు మరింత ముదురుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులు కుండపోత వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రమంతా రెడ్ అలర్ట్ జారీ చేసింది. అయితే సోమవారం రాత్రి నుంచే ఈ వర్షాల ప్రభావం కనిపించడం మొదలైంది. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లాలో అయితే రికార్డు స్థాయిలో వానలు పడ్డాయి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌నూ వాన వణికిస్తోంది. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనాల ట్రాఫిక్ ఇబ్బందిగా మారింది. రికార్డు స్థాయిలో వానలు.. మంగళవారం రాష్ట్రంలో సగటున 4.39 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిజామాబాద్‌తోపాటు జనగాం, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, మహబూబాబాద్, ఖమ్మం, మంచిర్యాల, కరీంనగర్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో ఏకంగా 46.3 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైనట్టు ప్రకటించింది. అదే జిల్లా ఆర్మూరు మండలం పెర్కిట్‌లో 33.1, వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తిలో 29.4, నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో 26.4, జనగాం జిల్లా కునూర్‌లో 24.2, నిజామాబాద్ జిల్లాలోని కోనసమందర్లో 22.6, జక్రాన్‌పల్లిలో 22.2 సెంటీమీటర్ల కుంభవృష్టి కురిసింది. హైదరాబాద్‌లో గరిష్టంగా చార్మినార్ ప్రాంతంలో 7.3 సెంటీమీటర్ల వాన పడింది. 25 జిల్లాల్లో అధిక వర్షపాతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమైన తర్వాత తొలి నెల రోజుల పాటు వర్షపాతం లోటు ఉండగా.. గత వారం రోజుల్లో అధిక వర్షపాతానికి చేరింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఏకంగా 60శాతం అధికంగా వానలు పడగా.. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, జనగాం, వరంగల్, కొమురంభీం, మేడ్చల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్, జగిత్యాల, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, హన్మకొండ, వనపర్తి, మంచిర్యాల జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వరకు అధిక వర్షపాతం నమోదైంది. మిగతా ఎనిమిది జిల్లాల్లో సాధారణ స్థాయిలో వానలు పడ్డాయి. ఈ మూడు రోజులు జాగ్రత్త బంగాళాశాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది మరో 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. దీనికితోడు రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని.. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. పొలాల్లో రైతులు సెల్ఫోన్లు వాడొద్దు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి. పొలాల్లో నీళ్లు నిలవకుండా చూసుకోవాలి. పొలాల్లో ఉన్న సమయంలో వాన, ఉరుములు, మెరుపులు వస్తుంటే రైతులు, ఇతరులు ఎవరైనా సెల్ఫోన్లు వాడొద్దు. అలా వాడితే పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది. పొలాల్లో ఉన్నప్పుడు నేలపై కూర్చోవాలి. ఎత్తుగా నిలబడి ప్రయాణం చేయవద్దు. విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద కూడా నిలబడొద్దు. – నాగరత్న, హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ -
వర్షాలపై కీలక అప్డేట్..!
-
తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ
సాక్షి, హైదరాబాద్: భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంతో.. తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మూడు రోజులపాటు కుండపోత వానలు ఉండడంతో అప్రమత్తం చేసింది. మంగళవారం(నేటి) నుంచి మూడు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు కోరుతున్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని చెబుతున్నారు. ► పనులకు వెళ్లేవాళ్లు వర్షం పరిస్థితులు.. ట్రాఫిక్‌ను అంచనా వేసుకుని బయటకు రావాలని సూచిస్తున్నారు. ► పాత భవనాల్లో ఉంటున్నవాళ్లు తక్షణమే ఖాళీ చేయాలని సూచిస్తున్నారు. ► కరెంట్ పోల్ల విషయంలో జాగ్రత్తలు సూచిస్తున్నారు. ► రోడ్లపై వెళ్తున్నప్పుడు మ్యాన్ హోల్స్‌ను గమనించాలని సూచిస్తున్నారు. ► సీజనల్ వ్యాధులు చెలరేగే అవకాశం ఉన్నందున.. తాగే నీరు, అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ సైతం సూచిస్తోంది. పలు జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్‌కు కుండపోత ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27 దాకా సెలవులు ప్రకటించాలంటూ పలువురు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
AP: వారం రోజులు వర్షాలే
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం, రుతు పవన ద్రోణులు ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ ఒడిశాకు ఆనుకుని ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటం, బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతోపాటు నైరుతి రుతుపవనాలు బలంగా ఉండటం వల్ల వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో ఈ నెల 29వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఆదివారం విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా విజయనగరం జిల్లా కొత్తవలసలో 11.3 సెం.మీ, విశాఖపట్నం మధురవాడలో 10.6 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. -
తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. రెండు రోజులు మళ్లీ భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడనం శనివారం బలహీనపడటంతో వానలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దక్షిణ ఒడిశా, ఉత్తర ఏపీ సమీపంలోని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 25, 26 తేదీల్లో విస్తారంగా వానలు పడతాయని అంచనా వేసింది. ఇదే సమయంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరించింది. ఈ మేరకు 25, 26 తేదీలకు సంబంధించి రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. ఇక శనివారం రాష్ట్రవ్యాప్తంగా 2.26 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 10 సెంటీమీటర్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 6.8 సెంటీమీటర్ల సగటు వాన కురిసింది. మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు వానలు పడ్డాయి. ఇది కూడా చదవండి: కడెం.. జనం గుండెల్లో సైరన్! -
వరదలో చిక్కుకున్న బస్సు 25 మంది.. జస్ట్ మిస్..
-
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇటు, ఎడతెరిపిలేని వర్షాల కారణంగా తెలంగాణలో స్కూల్స్‌కు కూడా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మరోవైపు.. ఇంకా రెండు రోజులు పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ► వివరాల ప్రకారం.. ఈనెల 24వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ► ఇదిలా ఉండగా.. గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 11.5 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. డెల్టా పంట కాల్వలకు 11వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇదే సమయంలో సముద్రంలోకి 9.32 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు.. రాజమండ్రి వద్ద గోదావరి ఘాట్లను ఆనుకుని నది ప్రవహిస్తోంది. గోదావరి పాయలు వశిష్ట, గౌతమి, వైనతేయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో, విలీన మండలాల్లో కొండవాగులు పోటెత్తుతున్నాయి. నాలుగు మండలాల పరిధిలో 100 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ► ఇక, పోలవరం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. స్పిల్‌వే వద్ద 32.315 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. 48 గేట్ల ద్వారా 6,75,910 క్యూసెక్యుల నీరు విడుదలవుతోంది. స్పిల్ వే దిగువన 23.470 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. ► కాగా, యానాం-ఎదుర్లంక వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. యానాం వద్ద 2 మీటర్ల ఎత్తు వరకు గౌతమి నది చేరుకుంది. దీంతో, అధికారులు.. లంక గ్రామాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇది కూడా చదవండి: తిరుమల: ఆగస్టు, సెప్టెంబర్‌కు 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల -
యాషెస్ నాలుగో టెస్ట్‌కు వర్షం ముప్పు.. బజ్‌బాల్ డోస్ పెంచుతామన్న స్టోక్స్
బజ్‌బాల్ అప్రోచ్ విషయంలో, యాషెస్ సిరీస్ నెగ్గే విషయంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఏమాత్రం తగ్గేదేలేదంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో యాషెస్ సిరీస్ గెలుస్తామని ధీమాగా చెబుతున్నాడు. నాలుగో టెస్ట్‌కు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్టోక్స్ మాట్లాడుతూ.. సిరీస్ అవకాశాలు సజీవంగా ఉంచే నాలుగో టెస్ట్‌లో ఎలాగైనా గెలిచి తీరతామని.. ఆసీస్ ఆధిక్యాన్ని 0-2 నుంచి 1-2కు తగ్గించాం, దీన్ని 2-2కు తీసుకువచ్చి, 3-2గా ముగిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. నాలుగో టెస్ట్ మొత్తానికి వర్షం ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలపై స్పందిస్తూ.. వాస్తవానికి మేము వాతావరణం గురించి ఆలోచించం. అయితే ప్రస్తుతం మేమున్న పరిస్థితుల్లో ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. వరుణుడు ఇబ్బంది పెడితే తమ సాధారణ ఆటలో శృతి పెంచి, ఫలితం సాధిస్తామని చెప్పాడు. తప్పక గెలవాల్సిన మూడో టెస్ట్‌కు ముందు కూడా వర్షం ఇలానే మమ్మల్ని బయపెట్టిందని, అదే తమలోని అత్యుత్తమ ఆటతీరును వెలికి తీసి విజయం సాధించేలా చేసిందని తెలిపాడు. కాగా, నాలుగో టెస్ట్‌కు వేదిక అయిన ఓల్డ్ ట్రాఫర్డ్, మాంచెస్టర్‌లో మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మ్యాచ్ తొలి రోజు (జులై 19) వర్షం పడే అవకాశాలు కాస్త అటు ఇటుగా ఉన్నా, మిగతా నాలుగు రోజుల్లో మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ జరిగే సమయంలో ఓ మోస్తరుకు మించి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తమ నివేదికలో పేర్కొంది. వర్షం కురువని సమయంలో గాలి వేగం అధికంగా ఉంటుందని తెలిపింది. ఇదిలా ఉంటే, వర్షం కురువకుండా గాలి వేగం అధికంగా ఉంటే ఫాస్ట్ బౌలర్లు రెచ్చిపోతారు. ముందస్తు వాతావరణ హెచ్చరికల కారణంగానే ఇరు జట్లు స్పిన్నర్లను పక్కకు పెట్టి, కేవలం పేస్ దళంతోనే బరిలోకి దిగుతున్నారు. ఆల్‌రౌండర్లతో కలిపి ఇరు జట్లు ఐదుగురు పేసర్లతో కత్తులు దూసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంగ్లండ్: బెన్ డకెట్, జాక్ క్రాలే, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ -
AP: రేపు అల్పపీడనం.. నాలుగు రోజులు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో గురువారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. కాగా, ఇది 24వ తేదీ లోపు ఒడిశాలో తీరం దాటే అవకాశం ఉంది. మరోవైపు రుతుపవన ద్రోణి రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు పయనిస్తోంది. ఈ ప్రభావంతో రానున్న 4 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీనివల్ల వచ్చే నెల 3వ తేదీ వరకు వర్షాలకు ఆస్కారముంది. నేడు గోదావరికి పెరగనున్న వరద! పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల్లో గోదావరి ఉద్ధృతి స్వల్పంగా పెరుగుతోంది. ఆ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద నది వరద బుధవారం పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువనున్న లక్ష్మి బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. దీని ప్రభావం ధవళేశ్వరం వద్ద కనిపించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం మంగళవారం 9.55 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 51,268 క్యూసె క్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఇది కూడా చదవండి: ఆ.. 9 రైల్వే స్టేషన్లలో మరిన్ని రైళ్లకు హాల్ట్ -
ఏపీ వైపు వస్తున్న ఉపరితల ఆవర్తనం
-
ఉత్తర ఒడిశాపై అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, గంగా పశ్చిమ బెంగాల్ తీరాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్ఫిరిక్ స్థాయిల వరకు విస్తరించి నైరుతి వైపు వంగి ఉంది. ఇది రెండురోజుల్లో జార్ఖండ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా పయనించనుంది. మరోవైపు సగటు సముద్రమట్టం వద్ద రుతుపవన ద్రోణి అల్పపీడన ప్రాంతం కేంద్రం.. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌కు ఆనుకుని ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో పలుచోట్ల, దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, సోమవారం ఉత్తర కోస్తాంధ్రలో ఒకటిరెండు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులు కూడా సంభవించవచ్చని తెలిపింది. మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఈనెల 18న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది ఆ మరుసటి రోజుకి అదే ప్రాంతంలో అల్పపీడనంగా మారనుంది. తరువాత ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అనంతరం రెండురోజుల్లో ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా మధ్య భారతదేశం వైపు వెళ్లనుంది. ఫలితంగా రుతుపవన ద్రోణి చురుకుదనం సంతరించుకోనుంది. దీంతో ఈనెల 18 నుంచి నాలుగు రోజుల పాటు రాయలసీమ మినహా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ప్రధానంగా ఉత్తర కోస్తాంధ్రలో పలుచోట్ల, దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీవర్షాలకు ఆస్కారం ఉంది. -
వాతావరణశాఖ హెచ్చరిక.. తెలంగాణలో నాలుగు రోజులు గట్టి వానలే..
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిన వర్షాలు దంచికొడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తెలంగాణలో రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, కామార్డె జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. మంగళవారం నుంచి గురువారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాతో పాటు నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇక, నేడు అత్యధికంగా మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 9 సెంటీమీటర్లకుపైగా వర్షాపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: పొంగులేటి అందుకే కాంగ్రెస్‌లో చేరారా? -
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. కేటీఆర్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా వ్యాపించాయి. ఇక, ఇప్పటి వరకు తెలంగాణవ్యాప్తంగా ఓ మోస్తరు వానలు మాత్రమే కురిశాయి. మరోవైపు.. ఈ వారాంతం నుంచి పలు జిల్లాలు, హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో, మంత్రి కేటీఆర్.. జీహెచ్ఎంసీ అధికారులను హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల ప్రారంభించిన వార్డు కార్యాలయాల వ్యవస్థపై మంత్రి కేటీఆర్ బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న స్పందనను అధికారుల ద్వారా మంత్రి తెలుసుకున్నారు. ఈ సమావేశంలోనే వర్షాలపై కూడా కేటీఆర్ సమీక్షించారు. ఈ క్రమంలో వర్షాకాలం నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. వారాంతం నుంచి హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అంతర్గత విభాగాలతో పాటు ఇతర శాఖలతో కలిసి వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను కోరిన కేటీఆర్.. అత్యంత కీలకమైన పారిశుద్ధ్య కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. -
నేడు అల్పపీడనం.. మూడు రోజులు వర్షాలే
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 7.8 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి నైరుతి వైపునకు వంగి ఉంది. దీని ప్రభావంతో ఆదివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం నివేదికలో వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు కూడా సంభవించవచ్చని, ఉత్తర కోస్తాంధ్రలో గంటకు 45–55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. అల్పపీడనం నేపథ్యంలో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. -
ఎల్లో అలర్ట్: తెలంగాణలో ఎనిమిది జిల్లాలకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: మొన్నటి వరకు వేసవి ఎండతాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ క్రమంలో ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన కొత్త అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే, ఒకట్రెండు రోజుల్లో తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు. వివరాల ప్రకారం.. తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. తూర్పు, ఉత్తరాన కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. జూన్ 25, 26 తేదీల్లో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు.. దక్షిణ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, తెలంగాణవ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా రైతులు విత్తనాలు వేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుందని చెప్పారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అప్రమత్తం! -
ఎల్లో అలర్ట్: తెలంగాణలో రెండు రోజులు వానలే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే, పలు జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. కాగా, తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది. మిగతా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. అలాగే కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇది కూడా చదవండి: కేసీఆర్‌కు ఊహించని షాక్.. -
TS: రెండు రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. మరో వైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కుదులుతున్నాయి. ఏపీ, కర్ణాటక, తమిళనాడు వరకు విస్తరించాయి. పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు రుతుపవనాలు విస్తరిస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక, ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. మిగతా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. అదే సమయంలో ఈ జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని హెచ్చరించింది. మరోవైపు.. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. ఇదే సమయంలో వడగాల్పులు కూడా వీచే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. Weather update!! Scattered thuderstorm rains now Adilabad Nirmal Asifabad Mancherial peddapalli nalgonda Places will see rains for next 2 hours with gusty winds also ☔⚡ — Telangana state Weatherman (@ts_weather) June 11, 2023 ఇది కూడా చదవండి: AP: ఇక వానలే.. ఏపీలోకి ప్రవేశించిన రుతుపవనాలు -
TS: రెండు రోజులు భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మిగతా ప్రాంతాల్లోనూ తేలికపాటి వానలు పడవచ్చని తెలిపింది. పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి దీనికి కారణమని వెల్లడించింది. మరోవైపు పలు ప్రాంతాల్లో మూడు రోజులపాటు 39 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఇటు వానలు.. అటు ఎండలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వానలు పడగా.. మరికొన్ని చోట్ల ఎండలు మండిపోయాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి, మంచిర్యాల జిల్లా జన్నారంలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హనుమకొండ జిల్లా శాయంపేట, హసన్‌పర్తి, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, జైపూర్, జగిత్యాల జిల్లా పెగడపల్లి, కొమురంభీం జిల్లా సిర్పూరు, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట, వరంగల్ జిల్లా ఆత్మకూర్, సంగెంలలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక నిర్మల్ జిల్లా తానూరులో 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా భైంసా, ఆదిలాబాద్ జిల్లా పిప్పలధరిలలో 41.2, అర్లిలో 40.9 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా బోమన్‌దేవిపల్లిలో 40.1, నిజామాబాద్ జిల్లా మాచిప్పలో 40, కల్దుర్కి, ఆదిలాబాద్ జిల్లా పొచ్చరలో 39.9, నిజామాబాద్‌లో 38.7, మెదక్‌లో 38.6, ఆదిలాబాద్‌లో 38.3, ఖమ్మంలో 36.2, హైదరాబాద్, రామగుండంలో 33.6 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: డ్రైవింగ్‌లోనే గుండెపోటుకు గురై.. -
IPL 2023 Final: 'రిజర్వ్ డే'కు కూడా వర్షం ముప్పు.. వాన పడిందా..!
వర్షం కారణంగా నేటికి (మే 29) వాయిదా పడిన ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్.. రిజర్వ్ డే రోజు కూడా సజావుగా సాగే పరిస్థితి కనబడటం లేదు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. మ్యాచ్‌కు వేదిక అయిన అహ్మదాబాద్‌లో ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం వేళ జల్లులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే నిన్నటి లాగా భారీ వర్షం కురవకపోవచ్చని సమాచారం. ఇదిలా ఉంటే, ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించేందుకు విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తారు. 20 ఓవర్ల నుంచి 15 ఓవర్ల లేదా 10 ఓవర్ల లేదా 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరిపేందుకు కృషి చేస్తారు. చివరకు అదీ సాధ్యం కాకపోతే చివరి ప్రయత్నంగా ‘సూపర్ ఓవర్’తోనైనా ఫలితాన్ని తేల్చేందుకు చూస్తారు. అయితే దానికీ అవకాశం లేకపోతే మాత్రం లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. అప్పుడు గుజరాత్ టైటాన్స్ చాంపియన్‌గా నిలుస్తుంది. కాగా, ఐపీఎల్ 2023 ఫైనల్స్‌కు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చేరిన విషయం తెలిసిందే. చదవండి: పన్నెండులో తొమ్మిదిసార్లు.. క్వాలిఫయర్-1 విజేత -
TS: చల్లని కబురు.. రెండు రోజులు వానలే..
సాక్షి, హైదరాబాద్: విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వర కు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండ్రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియ స్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 38డిగ్రీల సెల్సియస్ నుంచి 41డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతుందని వాతావరణ శాఖ వివరించింది. సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్‌లో 41.7 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 20.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కసరత్తు.. ఎర్రబెల్లిని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడెవరు? -
చల్లని కబురు.. వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, అమరావతి: వచ్చే మూడ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ బిహార్ నుంచి ఉత్తర తెలంగాణ వరకు ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ తెలిపారు. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక సోమవారం.. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మోస్తరు నుంచి భారీవర్షాలు సైతం నమోదయ్యే అవకాశం ఉందని సూచించింది. శనివారం ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ నెల 8న అల్పపీడన ప్రదేశం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 9న వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఆ తర్వాత దాదాపు ఉత్తరందిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తీవ్రతరమై తుపానుగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశంఉంది. శనివారం నల్లగొండలో 38.0 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 9వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది. ఇది కూడా చదవండి: ఏపీకి వర్ష సూచన.. మూడు రోజులు వానలు -
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీకి వర్ష సూచన
సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 8వ తేదీకి ఇది అల్పపీడనంగా ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అనంతపురం ఆగ్నేయ దిశగా కదిలి 9వ తేదీకి తుపానుగా మారి, ఉత్తర దిశగా మయన్మార్ వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అందువల్ల తుపాను ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండకపోవచ్చునని చెబుతున్నారు. అల్పపీడనం, వాయుగుండంగా ఉన్నంతవరకు కొద్దిమేర వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదిలా వుండగా తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతంలోనూ ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో 2, 3 రోజులు రాష్ట్రంలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు శనివారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో 7.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టిలో 6.4, ఏలూరు జిల్లా చాట్రాయిలో 5.9, బాపట్ల జిల్లా లోవలో 5, కొల్లూరులో 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో శనివారం పిడుగుపాటుకు ఇద్దరు గొర్రెల కాపరులు గాయపడ్డారు. 13 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. తిరుమలలో భారీ వర్షం తిరుమల: తిరుమలలో శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా తిరుమలలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. దీంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. శనివారం వర్షంతో భక్తులు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించారు. ఇది కూడా చదవండి: వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు -
విస్తృతంగా వర్షాలు... 11 నుంచి మళ్లీ వడగాడ్పులు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కూడా వర్షాలు విస్తృతంగా కురిశాయి. పశ్చిమ గోదావరి, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. బాపట్ల జిల్లా కవురులో 8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కసుమూరులో 7.5, బాపట్ల జిల్లా లోవలో 6.6, తిరుపతి జిల్లా చిలమన్నూరులో 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు ఏపీఎస్డీపీఎస్ డైరెక్టర్ శివశంకర్ తెలిపారు. దక్షిణ అంతర్గత కర్ణాటక, దానికి ఆనుకుని ఉన్న తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మరో నాలుగైదు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం రాత్రి వెల్లడించింది. ఇక శనివారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశముంది. నేడు ఉపరితల ఆవర్తనం.. మరోవైపు.. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 7వ తేదీ నాటికి ఇది అల్పపీడనంగా, 8వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఉత్తర దిశగా కదులుతూ తుపానుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ తుపాను బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల దిశగా వెళ్లే అవకాశముందని చెబుతున్నారు. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండే అవకాశంలేదని వాతావరణ శాఖ తెలిపింది. కానీ, అల్పపీడనం, వాయుగుండం ప్రభావం మాత్రం ఉండవచ్చని చెబుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే పరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, వేటకు వెళ్లిన వారు శనివారంలోగా తిరిగి రావాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో తమ కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసినట్లు ఆయన వివరించారు. అత్యవసర సాయం, సమాచారం కోసం టోల్‌ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101కు ఫోన్‌చేయాలని సూచించారు. 11 నుంచి మళ్లీ వడగాడ్పులు ఇక రాష్ట్రంలో ఈనెల 10 వరకు సాధారణ లేదా అంతకంటే తక్కువగా పగటి ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. తుపాను బలహీనపడిన తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. దీంతో ఈనెల 11వ తేదీ తర్వాత నుంచి పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు ఉధృతమవుతూ కోస్తాంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.) -
వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా, ఈ నెల 7వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటుచేసుకోనుంది. ఇది 8వ తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇక, బంగాళాఖాతం వైపు కదులుతూ తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి కారణంగా తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇక, ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఏపీలో నాలుగు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా గురువారం కూడా వర్షాలు కురిశాయి. జిల్లాలోని కాకుమాను మండలంలో 75, ప్రత్తిపాడులో 50.4, దుగ్గిరాలలో 41.2, వట్టిచెరుకూరులో 24.6, తెనాలిలో 23.8, మంగళగిరిలో 15, పెదకాకానిలో 13, చేబ్రోలులో 12.2 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను వానలు వీడలేదు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 60 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 46.6, ఇరగవరంలో 32.2, ఆచంటలో 20, పోడూరులో 19, పెంటపాడులో 17, తణుకులో 15 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రాయలసీమలోనూ పలుచోట్ల వర్షాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 15 మండలాల్లో వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు అనంతపురం జిల్లాలోని 10 మండలాల పరిధిలో 4 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లాలోని 5 మండలాల పరిధిలో వర్షం కురిసింది. ఇది కూడా చదవండి: వెన్ను విరగని వరి! -
వస్తోంది తుపాను.. రాష్ట్రంపైనా ప్రభావం, మరికొద్ది రోజులు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి,అమరావతి: బంగాళాఖాతంలో ఈ సీజన్లో తొలి తుపాను ఏర్పడబోతోంది. ముందుగా ఈనెల 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. అదే ప్రాంతంలో 7న అల్పపీడనంగా మారి, 8న వాయుగుండంగా బలపడనుంది. ఆ వాయుగుండం మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉత్తర దిశగా పయనిస్తూ తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం వెల్లడించింది. అల్పపీడనం ఏర్పడ్డాక తుపాను దిశ, కదలిక, వేగం, తీవ్రత వంటి వాటిపై తెలిపింది. ఈ తుపాను మరింతగా బలపడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే తుపాను పశ్చిమ బెంగాల్, మయన్మార్ల వైపు పయనిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ తుపాను కోస్తాంధ్ర వైపు కూడా రావొచ్చని చెబుతున్నారు. గతంలో మే నెలలో సంభవించిన తుపానులు ఆంధ్రప్రదేశ్ తీరం వైపు రావడాన్ని వీరు ఉదహరిస్తున్నారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ఫలితంగా రాష్ట్ర ప్రజలకు వారం రోజులపాటు ఉష్ణతాపం/వడగాడ్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని తెలిపారు. మే నెలలో తుపానులు సహజమే ప్రతి ఏటా మే నెలలో ఒకట్రెండు తుపానులు సహజమే. గత సంవత్సరం బంగాళాఖాతంలో మే మొదటి వారంలో ‘అసని’ తుపాను ఏర్పడింది. నైరుతి రుతుపవనాలు నాలుగు రోజులు ముందుగా కేరళలోకి ప్రవేశించడానికి ఇది దోహదపడింది. ఇది రాష్ట్రంలోని మచిలీపట్నం – నర్సాపురంల మధ్య తీరాన్ని దాటింది. 2021 మే రెండో వారంలో అరేబియా సముద్రంలో ‘టౌక్టే’ తుపాను ఏర్పడి బంగాళాఖాతంలో రుతుపవనాల ఆగమనానికి తోడ్పడింది. అదే సంవత్సరం మే 23న బంగాళాఖాతంలో ‘యాస్’ తుపాను సంభవించి సత్వరమే రుతుపవనాల ఆగమనానికి సహకరించింది. ఇది ఒడిశాలోని బాలసోర్ వద్ద తీరం దాటింది. 2020 మే 16న బంగాళాఖాతంలోనే ‘అంఫన్’ తుపాను ఏర్పడింది. ఇది పశ్చిమ బెంగాల్లో తీరాన్ని దాటింది. వీటన్నిటినీ పరిశీలిస్తే త్వరలో ఏర్పడనున్న తుపాను ప్రభావం ఏపీపై కూడా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. ఇది నైరుతి రుతుపవనాల ఆగమనంపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరోవైపు భూమిపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో తమిళనాడు, కర్ణాటక మీదుగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అరేబియన్ సముద్రం వైపు నుంచి గాలులు తోడవడంతో మరికొద్ది రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (ఏపీఎస్డీపీఎస్) డైరెక్టర్ శివశంకర్ తెలిపారు. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అనేక చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఎడతెగని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మండు వేసవిలో వర్షా కాలాన్ని మించి వానలు పడుతున్నాయి. విశాఖ, అనకాపల్లి, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో అత్యధికంగా 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో 95.75 మిల్లీ మీటర్లు, గుంటూరు జిల్లా తాడేపల్లిలో 95.2, శ్రీకాకుళం జిల్లా హరిపురంలో 90.25 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 88.4, ఘంటసాలలో 80.5 పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 80.2, శ్రీకాకుళం జిల్లా పలాసలో 76.75, నిమ్మాడలో71, పల్నాడు జిల్లా కారంపూడిలో 63.6, గుంటూరు జిల్లా మంగళగిరిలో 53.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
జోరుగా వానలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. వానాకాలాన్ని తలపించేలా అన్ని ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. గడచిన 24 గంటల వ్యవధిలో తిరుపతి జిల్లా నారాయణవనంలో అత్యధికంగా 103.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రంలో 96.2, సూళ్లూరుపేటలో 88.4, కుమార వెంకట భూపాలపురంలో 87.8, పెళ్లకూరులో 74.8, గూడూరులో 73.2, పుత్తూరులో 67.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరంలో 92.2, ముమ్మిడివరంలో 85.4, కాకినాడ జిల్లా తాళ్లరేవులో 91 మి.మీ. వర్షం పడింది. ఇక సోమవారం ఉ.8.30 గంటల నుంచి మంగళవారం ఉ.8.30 గంటల వరకు అనకాపల్లి జిల్లాలో సగటున 36.11 మి.మీ. వర్షం పడింది. అంబేద్కర్ కోనసీమలో 31.89, కాకినాడ జిల్లాలో 33.03, తిరుపతి జిల్లాలో 31.55 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రం మొత్తంగా 9.81 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. మండలాల్లో అత్యధిక వర్షం ఇలా.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో అత్యధికంగా 79 మిల్లీమీటర్ల సగటు వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో 61.50, కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలో 48.75, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో 67.75, పల్నాడు జిల్లా పెదకూరపాడులో 68, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 58.25, వైఎస్సార్ జిల్లా శ్రీ అవధూత కాశీనాయన మండలంలో 44 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి మరోవైపు.. విదర్భ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకూ విస్తరించి ఉన్న ద్రోణి (గాలుల కోత) మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉన్న మరో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల మధ్య ఉంది. అలాగే.. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ/దక్షిణ దిశలో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎండలు మండినా వర్షాలూ ఎక్కువే ఇక ఇప్పటికే మే నెలను తలపించేలా ఏప్రిల్‌లో ఎండలు మండగా.. పది రోజులకు పైగా వడగాడ్పులూ వీచాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు ఎగబాకి జనాన్ని బెంబేలెత్తించాయి. అయినప్పటికీ రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో వర్షపాతం ఎక్కువగానే నమోదైంది. ఈ నెలలో సాధారణ వర్షపాతం 21.9 మిల్లీమీటర్లు కాగా.. 27.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే కురవాల్సిన దానికంటే 26 శాతం అధికంగా వర్షం కురిసింది. కోస్తాంధ్ర–యానాం సబ్ డివిజన్లో 17.1 మి.మీలకు గాను 61 మి.మీలు (257 శాతం అధికంగా), రాయలసీమ సబ్ డివిజన్లో 19 మి.మీలకు 24.9 (31 శాతం అధికంగా) వర్షం కురిసింది. అత్యధిక వర్షపాతం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 73.8 మి.మీలు (+327 శాతం) రికార్డయింది. అత్యల్ప వర్షపాతం కురిసిన జిల్లాల్లో విశాఖ జిల్లా ఉంది. ఇక్కడ 27 మి.మీలు కురవాల్సి ఉండగా 4.1 మి.మీలు మాత్రమే నమోదైంది. మరో 3 రోజులు వర్షాలు, పిడుగులు మరో మూడ్రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో బుధవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు ఆయన తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. -
TS: వాతావరణశాఖ హెచ్చరిక.. ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి కారణంగా రేపు.. మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపుతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వానలు పడుతాయని పేర్కొంది. ఇక, బుధవారం మధ్యాహ్నం తర్వాత ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రైతులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉండగా.. బుధవారం తెల్లవారుజామున జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. ధరూర్ మండలం నీలహళ్లిలో పిడుగుపాటుకు రైతు నర్సింహులుకు చెందిన రెండు ఎద్దులు మృతిచెందాయి. ఇదిలా ఉండగా.. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. దీంతో, దక్షిణ, ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకి దిగువ స్థాయిలోని గాలులు వీస్తున్నాయి. దీంతో, రాగల మూడు రోజులు తెలంగాణలో మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాగల ఐదు రోజులు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40°C కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అవుతాయి. కొన్ని చోట్ల 35°C కన్నా తక్కువగా అక్కడక్కడ నమోదు అయ్యే అవకాశముంది. ఇక నేడు, రేపు తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి గంటకు 40 నుండి 50కిమీ) వేగంతో పాటు వడగళ్ళతో కూడిన వర్షములు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి.. వర్షాలకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు, ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఆదివారం రాష్ట్రంలోని పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్ నుంచి 43 డిగ్రీ సెల్సియస్ మధ్యన నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే, గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 39.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 20.0 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి. -
TS: మరో రెండు రోజులు మెరుపులు, ఈదురు గాలులలో వానలు
సాక్షి, హైదరాబాద్: కొద్దిరోజులుగా తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. పంటలు చేతికొచ్చే సమయంలో వడగండ్ల వానల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదిలా ఉండగా, కర్ణాటక పరిసర ప్రాంతాల మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనంసముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఇక, దీని ప్రభావంతో గురువారం రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల వడగండ్ల వానలు కురిశాయని వాతావరణ శాఖ వివరించింది. రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్నిచోట్ల ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. -
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఉరుములుతో రెండు రోజులు వానలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. శుక్రవారం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. అదిలాబాద్‌లో 37.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెదక్‌లో 20.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. -
ఏపీకి వర్షసూచన.. నాలుగు రోజులు వానలే..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో మరో నాలుగు రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. కొద్దిరోజులుగా రాష్ట్రంలో చెదురుమదురుగా వానలు పడుతున్నాయి. ప్రస్తుతం ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, కర్ణాటకల మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ గురువారం తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేటలో 2.6 సెంటీమీటర్లు, అన్నమయ్య జిల్లా నూతనకల్వలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
మూడు రోజులు వానలే.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగనున్నాయి. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ఫలితంగా శుక్ర, శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుంది. శనివారం దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 30నుంచి 40 కిలోమీటర్లు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మూడు రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ కోరారు. -
Rain Forecast: ఈ నెల 16 నుంచి వర్షాలు.. 20 వరకు కొనసాగే అవకాశం
సాక్షి, విశాఖపట్నం: ఈసారి వేసవిలోనూ వర్షాలు పలకరించనున్నాయి. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం పడమర గాలులతో ఏర్పడిన ద్రోణి సముద్ర మట్టానికి 5.8 కి.మీ. నుంచి 7.6 కి.మీ. ఎత్తులో ఉంటూ బిహార్ నుంచి దక్షిణ కర్ణాటక వరకు ఛత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా కొనసాగుతోంది. ఈ నెల 16న ఈస్టిండియాపై మరో ద్రోణి, దక్షిణాది రాష్ట్రాలపై మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతున్నాయి. వీటి ప్రభావంతో గాలుల దిశ మారనుంది. ప్రస్తుతం రాష్ట్రంపైకి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. నాలుగు రోజుల్లో ఈ గాలులు దిశ మార్చుకుని దక్షిణ దిశ నుంచి వీచే అవకాశం ఉంది. దీని ప్రభావం 4 రోజులపాటు ఉండనుంది. ఫలితంగా 16 నుంచి 20 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ శనివారం నాటి బులెటిన్‌లో తెలిపింది. అదే సమయంలో క్యుములోనింబస్ మేఘాలు కూడా ఏర్పడే అవకాశం ఉందని, దీంతో అవి ఏర్పడిన ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న ఐదారు రోజులు కూడా ఇవే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. ఫలితంగా ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉష్ణతాపానికి కాస్త విరామం లభించనుంది. పంటలు జాగ్రత్త సుమా! రాష్ట్రంలో కురవనున్న వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, కోత దశలో పంటలను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా రైతులకు సూచించారు. -
వాయుగుండంపై వాతావరణ శాఖ హెచ్చరిక.. 11 జిల్లాలకు అలర్ట్!
బంగాళాఖాతంలో (శ్రీలంక సమీపంలో) ఏర్పడిన అల్పపీడణ ద్రోణి క్రమంగా బలపడి సోమవారం వాయుగుండంగా మారింది. ఫలితంగా తమిళనాడులోని సముద్ర ప్రభావిత జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలను వేగవంతం చేసింది. కాగా అకాల వర్షం వల్ల కొన్నిచోట్ల పంటనష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాక్షి, చెన్నై: రాష్ట్రానికి మరో వాయుగండం ఎదురుకానుంది. ఫలితంగా దక్షిణ తమిళనాడు సహా డెల్టా జిల్లాల్లో ఫిబ్రవరి 1వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇక సముద్రంలో గాలి ప్రభావం అధికంగా ఉండడంతో వేటకు వెళ్ల వెళ్లొద్దని జాలర్లను వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. వివరాలు.. రాష్ట్రంలో గత ఏడాది ఈశాన్య రుతు పవనాల వల్ల వర్షాలు ఆశాజనకంగానే కురిశాయి. ముఖ్యంగా ఉత్తర తమిళనాడు, కొంగు మండలం, డెల్టా జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. అయితే దక్షిణ తమిళనాడులో ఈశాన్య రుతు పవనాల ప్రభావం తక్కువే. ఇక గత నెలాఖరుతోనే ఈశాన్య రుతు పవనాల సీజన్ ముగిసింది. వర్షాలు పూర్తిగా కనుమరుగైనట్లే అని కూడా వాతావరణ కేంద్రం ప్రకటించింది. కానీ ఉష్ణోగ్రత మార్పుల కారణంగా బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడన ద్రోణి, సోమవారం వాయుగుండంగా మారింది. ఇది శ్రీలంకకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఫలితంగా రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. లోతట్టు ప్రాంతాలపై దృష్టి.. దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాశి, రామనాథపురం, డెల్టాలోని నాగపట్పం, మైలాడుతురై, పుదుకోట్టై తదితర సముద్ర తీర జిల్లాల్లో ఈనెల 31న మోస్తారు వర్షం, ఫిబ్రవరి ఒకటో తేదీన అనేక భారీ వర్షం పడే అవకాశాలు ఉంది. ఇక రాజధాని నగరం చెన్నై, శివారు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, చిరు జల్లులు కురిసే అవకాశాలు ఉందని వివరించారు. సోమవారం చెన్నై శివారు ప్రాంతాలతో పాటు డెల్టా జిల్లాలో అనేక చోట్ల వర్షం స్వల్పంగా కురిసింది. ఇక ఫిబ్రవరి 1వ తేదీన భారీ వర్షం హెచ్చరికల నేపథ్యంలో 11 జిల్లాల్లోని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సముద్రంలో శ్రీలంక వైపుగా గాలి ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. జాలర్లు వేటకు వెళ్లొద్దని, సముద్రంలోకి వెళ్లిన వారు సైతం తిరిగి రావాలని సూచించారు. -
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి సోమవారం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఈ వాయుగుండం సోమవారం రాత్రికి శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఆగ్నేయంగా 530, భారత్‌లోని కరైకల్‌కు తూర్పు ఆగ్నేయంగా 750 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమై ఉంది. ఇది మంగళవారం సాయంత్రం వరకు పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుందని, అనంతరం మలుపు తిరిగి క్రమంగా దక్షిణ నైరుతి వైపు పయనిస్తుందని, బుధవారం మధ్యాహ్నానికి శ్రీలంక వద్ద తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో వివరించింది. దీని ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం నుంచి రెండురోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్య రేఖా ప్రాంతానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో శుక్రవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా మూడు రోజులపాటు నెమ్మదిగా పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో తెలిపింది. ఫలితంగా ఈ నెల 29, 30 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా జనవరి మొదటి వారం తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనాలు అరుదుగా ఏర్పడుతుంటాయి. అంతకుముందే ఈశాన్య రుతుపవనాలు కూడా నిష్క్రమిస్తాయి. దీంతో వర్షాలకు ఆస్కారం ఉండదు. కానీ, ప్రస్తుతం సముద్రంపై తేమ అధికంగా ఉండడం వల్ల ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ఏర్పడడానికి దోహదపడుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. క్షీణిస్తున్న కనిష్ట ఉష్ణోగ్రతలు.. మరోవైపు రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతల క్షీణత కొనసాగుతూనే ఉంది. కొద్దిరోజుల నుంచి ఏజెన్సీ ఏరియాతోపాటు రాయలసీమలో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు (ఏఎస్సార్), శ్రీకాకుళం, అనకాపల్లి, చిత్తూరు, కాకినాడ, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా క్షీణిస్తున్నాయి. అక్కడ 4 నుంచి 12 డిగ్రీల వరకు రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. రాష్ట్రంలో గురువారం వేకువజామున అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 4.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమల్లో రానున్న రెండు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. -
స్థిరంగా.. అల్పపీడనం! రాష్ట్రంపై ప్రభావం ఏ మేరకు ఉంటుందంటే..
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: మధ్య దక్షిణ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్యరేఖ ప్రాంతానికి ఆనుకుని హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో నెమ్మదిగా కదులుతూ శ్రీలంక తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. దీని ప్రభావం రాష్ట్రంపై స్వల్పంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంపైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. -
గాలిలో తేమ ఎఫెక్ట్.. కోస్తా, సీమలో రెండు రోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: మాండూస్ తుపాను తీరాన్ని దాటి మూడు రోజులవుతున్నా రాష్ట్రంలో ఇంకా వర్షాలు కొనసాగుతున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వానలు కురుస్తూనే ఉన్నాయి. గాలిలో తేమ అధికంగా ఉండడం వల్ల వర్షాలు కొనసాగడానికి దోహదం చేస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, వైఎస్సార్, గుంటూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో గాలిలో తేమ 90–95% నమోదవుతోంది. అందువల్లే ప్రస్తుతం అల్పపీడనాలు, ఆవర్తనాలు వంటివి లేకపోయినా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకంటే ఆయా చోట్ల వానలు ఇంకా కురుస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంపైకి ఈశాన్య/తూర్పు గాలులు వీస్తున్నాయి. కొద్దిరోజులకంటే ప్రస్తుతం వీటి వేగం తగ్గింది. ఇలా ఈ గాలుల వేగం, గాలిలో తేమ తగ్గితే వాతావరణంలో పొగమంచు ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. కాగా సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు పలుచోట్ల వర్షాలు కురిశాయి. -
ఏపీ: 15న మరో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: ఈనెల 13వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవిర్భవించనుంది. దీని ప్రభావంతో 15వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. వీటి ఫలితంగా సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి వెల్లడించింది. -
వాయుగుండం కాదు.. వచ్చేది తుపానే
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: కొద్దిరోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడుతుందనుకుంటున్న వాయుగుండం అంచనా తప్పి బలపడనుంది. తుపానుగా మారి తమిళనాడు–దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనించనుంది. దీని ప్రభావం మన రాష్ట్రంపై కూడా పడనుంది. కాగా.. దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అదే దిశలో పయనిస్తూ తుపానుగా బలపడి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఈ నెల 8న ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి–దక్షిణ కోస్తాంధ్ర సమీపంలో తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) సోమవారం తెలిపింది. దక్షిణ కోస్తా.. రాయలసీమపై అధిక ప్రభావం ఈ తుపాను ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఎక్కువగాను.. ఉత్తర కోస్తాలో స్వల్పంగాను ఉంటుందని తెలిపింది. బుధవారం దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం దక్షిణ కోస్తాలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదే రోజున ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం దక్షిణ కోస్తాలో అనేకచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ వివరించింది. వాయుగుండం, తుపాను ప్రభావంతో ఈ నెల 8, 9 తేదీల్లో కోస్తాలో తీరం వెంబడి గంటకు 40నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని పేరు ‘మాండూస్’ ఈ తుపానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సూచించిన ‘మాండూస్’ అనే పేరు పెట్టనున్నారు. ఈ పేరును వాయుగుండం తుపానుగా మారిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. 15న మరో అల్పపీడనం ఈ నెల 15వ తేదీన అండమాన్ సముద్రం లేదా దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావం 20వ తేదీ వరకు ఉండే అవకాశం ఉంది. ఏపీ తీరంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో అల్పపీడనాలు ఏపీ తీరంవైపు కదలడం లేదని అంచనా వేస్తున్నారు. -
కొనసాగుతున్న తూర్పు, ఈశాన్య గాలులు.. రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో దిగువస్థాయి నుంచి తూర్పు, ఈశాన్య గాలులు వీస్తున్నాయి. ఇవి మరికొద్ది రోజులు కొనసాగనున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి నివేదికలో తెలిపింది. అనంతరం పొడి వాతావరణం మొదలయ్యాక రాష్ట్రంలో చలి ప్రభావం అధికమవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా శనివారం తిరుపతి జిల్లా ఇనుగుంటలో 7.6 సెం.మీల భారీ వర్షం కురిసింది. -
బలహీనపడిన వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం బలహీనపడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో కొనసాగుతోంది. అక్కడ నుంచి నెమ్మదిగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండురోజులు కోస్తాలో ఒకటిరెండు చోట్ల, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
కొనసాగుతున్న వాయుగుండం.. ఉరుములు, మెరుపులతో వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వాయవ్యదిశగా కదులుతోంది. ఇది సోమవారం అర్ధరాత్రి త ర్వాత నుంచి పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తూ దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. మంగళవారం ఉదయానికి అల్పపీడనంగా బలహీనపడి దక్షిణాంధ్ర, తమిళనాడు, పుదు చ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ భారీవర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. -
న్యూజిలాండ్‌తో మూడో టీ20కి ముందు టీమిండియాకు గుడ్ న్యూస్
నేపియర్‌లోని మెక్లీన్ పార్క్ వేదికగా రేపు (నవంబర్ 22) న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడో టీ20కి ముందు టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ తెలిసింది. రేపు జరుగబోయే మ్యాచ్‌కు వరుణుడి నుంచి ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. మ్యాచ్ సమయానికి (భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు) ఆకాశం మేఘావృతమైనప్పటికీ.. వర్షం పడే అవకాశాలు చాలా తక్కువని అక్కడి వాతావరణ శాఖ వెదర్ ఫోర్‌కాస్ట్‌లో పేర్కొంది. మ్యాచ్ ఎటువంటి అంతరాయం లేకుండా 20 ఓవర్ల మ్యాచ్‌గా సాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆకాశం పూర్తిగా మబ్బు పట్టి ఉంటే పేసర్లకు అనుకూలిస్తుందని, పరుగుల ప్రవాహానికి కూడా అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉందని సమాచారం. కాగా, సిరీస్ డిసైడర్ కావడంతో ఈ మ్యాచ్ కచ్చితంగా జరగాలని ఇరు జట్ల ఆటగాళ్లు, అభిమానులు కోరుకుంటున్నారు. వెల్లింగ్టన్లో జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. మౌంట్ మాంగనూయ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో సూర్యకుమార్ విధ్వంసం (111 నాటౌట్), దీపక్ హుడా మాయాజాలం (4/10) చేయడంతో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌లో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో టీ20లో కివీస్ జట్టుకు టిమ్ సౌథీ నాయకత్వం వహించనున్న విషయం తెలిసిందే. మెడికల్ అపాయింట్మెంట్ ఉండటంతో రెగ్యలర్ కెప్టెన్ విలియమ్సన్ లీవ్ తీసుకోవడంతో సౌథీకి జట్లు పగ్గాలు అప్పజెప్పారు. విలియమ్సన్ స్థానాన్ని మైఖేల్ బ్రేస్‌వెల్ భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ మార్పు మినహా రెండో టీ20లో ఆడిన జట్టునే కివీస్ యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. ఇక టీమిండియా విషయానికొస్తే.. రెండో టీ20లో అంతగా ఆకట్టుకోలేని సుందర్ స్థానంలో హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. -
Rain Alert: వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/వాకాడు: ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఆదివారం రాత్రికి శ్రీలంకలోని జాఫ్నాకు తూర్పుగా 560 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం అదే తీవ్రతతో నెమ్మదిగా కొనసాగుతూ రానున్న 24 గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అనంతరం క్రమంగా అల్పపీడనంగా బలహీనపడుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలో మీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపింది. మత్స్యకారులు మంగళవారం వరకు దక్షిణ కోస్తా–తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ తెలిపారు. మరోవైపు వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గి చలి బాగా పెరిగే అవకాశం ఉంది. అల్లకల్లోలంగా సముద్రం వాయుగుండం ప్రభావంతో ఆదివారం తిరుపతి జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ మండలాల తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. -
IND VS NZ 2nd T20: గుడ్ న్యూస్.. వరుణుడి ముప్పు లేనట్టే..!
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మౌంట్ మాంగనుయ్‌లోని బే ఓవల్ వేదికగా ఇవాళ (నవంబర్ 20) జరగాల్సిన రెండో టీ20 సజావుగా సాగేలా కనిపిస్తుంది. నిన్న వెదర్ ఫోర్‌కాస్ట్‌లో ఇవాళ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించడంతో.. క్రికెట్ ప్రేమికులంతా ఆందోళన చెందారు. అయితే, బే ఓవల్‌లో తాజా వాతావరణ పరిస్థితి చూస్తుంటే మ్యాచ్ సజావుగా సాగేలా కనిపిస్తుంది. ఆకాశం క్లియర్‌గా ఉండి, ఎండ కాసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే వాతావరణం కంటిన్యూ అయితే మ్యాచ్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా 20 ఓవర్ల పాటు సాగే అవకాశం ఉంది. కాగా, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నవంబర్ 18న జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
వాయుగుండం: కోస్తా, సీమల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. అనంతరం రానున్న రెండు రోజులు అదే దిశలో తమిళనాడు–పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంల వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడుకు ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఆదివారం సాయంత్రం నుంచి తేలికపాటి వర్షాలు మొదలవుతాయని తెలిపింది. 21, 22 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల చెదురుమదురు వానలకు అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 23వ తేదీ వరకు తీరం వెంబడి గంటకు 45–55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, దీంతో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. -
న్యూజిలాండ్‌తో రెండో టీ20.. మళ్లీ అదే బ్యాడ్ న్యూస్..!
IND VS NZ 2nd T20: 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న టీమిండియాను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే నవంబర్ 18న వెల్లింగ్టన్లోని స్కై స్టేడియం వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. రేపు (నవంబర్ 20) మౌంట్ మౌంగనుయ్‌లోని బే ఓవల్‌లో జరగాల్సిన రెండో మ్యాచ్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. వర్షం కారణంగా ఈ మ్యాచ్ కూడా సాధ్యపడే అవకాశం లేదని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ సమయానికి (భారతకాలమానం ప్రకారంమధ్యాహ్నం 12 గంటలకు) ఆకాశం పూర్తిగా మేఘావృతం అయ్యి ఉంటుందని, 90 శాతం వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వెదర్ ఫోర్‌కాస్ట్‌లో పేర్కొంది. అయితే వాతావరణంలో అనూహ్య మార్పులు జరిగితే మాత్రం కొద్ది ఓవర్ల ఆట సాధ్యపడే అవకాశాలు కూడా లేకపోలేదని తెలిపింది. కాగా, టీ20 వరల్డ్‌కప్-2022 అనంతరం సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ రెస్ట్ తీసుకోవడంతో టీమిండియా యువ జట్లతో (టీ20, వన్డే సిరీస్‌లకు వేర్వేరు జట్లు) న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో టీ20 సిరీస్‌కు హార్ధిక్ పాండ్యా, వన్డే సిరీస్‌కు శిఖర్ ధవన్ టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నారు. వరుణుడు కరుణించి ఆట సాధ్యపడితే భారత తుది జట్టు ఎలా ఉండే అవకాశం ఉందంటే.. యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, ఉమ్రాన్ మాలిక్‌లకు తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్లు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ముగ్గురికి తుది జట్టులో ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. వరల్డ్‌కప్‌లో అవకాశాలు దక్కని దీపక్ హుడా, హర్షల్ పటేల్ మరోసారి బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఛాన్స్ కోసం ఎదురు చూడాల్సి రావచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. పేసర్ల కోటాలో స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ స్థానాలు పక్కా కాగా.. ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్‌ల మధ్య పోటీ ఉండే ఛాన్స్ ఉంది. తుది జట్టు (అంచనా).. శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్/చహల్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్/మహ్మద్ సిరాజ్. టీ20 సిరీస్‌కు భారత జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీ20 సారధిగా హార్దిక్ కన్ఫర్మ్, వన్డే, టెస్ట్‌లకు..? -
ఏపీ: బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధవారం అండమాన్‌కు ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం అది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 18 నాటికి దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం ఈ వాయుగుండం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అల్పపీడనం వాయుగుండంగా బలపడిన తర్వాత ఈ నెల 19 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 18 నుంచి తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ సూచించింది. -
16న మరో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం/నెల్లూరు (అర్బన్): కొద్దిరోజులుగా నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి ఆనుకుని కొనసాగుతున్న అల్పపీడనం ఆదివారం ఆగ్నేయ అరేబియా సముద్రంలో విలీనమైంది. మరోవైపు ఈ నెల 16న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో 18వ తేదీ నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, నాలుగు రోజుల నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది. నెల్లూరు జిల్లాలో కుంభవృష్టి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షం ఆదివారం నాటికి కుంభవృష్టిగా మారింది. నెల్లూరు నగరం జలమయమైంది. ఆత్మకూరు బస్టాండ్, రామలింగాపురం, మాగుంట లేఅవుట్లోని అండర్ బ్రిడ్జిల్లోకి నీరు చేరడంతో బారికేడ్లు పెట్టి మూసేశారు. ఉమ్మారెడ్డిగుంటలోని పలు పల్లపు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరింది. ప్రధానంగా కావలి, కొండాపురం, గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు మండలాల్లో కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కావలి మండలం రుద్రకోట పంచాయతీ గుమ్మడిబొందల గ్రామం వద్ద చప్టాపై నీరు పొంగి ప్రవహిస్తోంది. కావలి పట్టణం బాలకృష్ణారెడ్డినగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. బ్రాహ్మణక్రాక– కృష్ణాపాడు రోడ్డుపై వర్షపు నీరు చేరింది. కొండాపురం మార్గంలో మిడతలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుడ్లూరు–బసిరెడ్డిపాలెం గ్రామాల మధ్య ఉప్పుటేరు బ్రిడ్జిపై 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండడంతో శనివారం రాత్రి నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. గుడ్లూరు–తెట్టు ప్రధాన రహదారిలో చెమిడిదిపాడు వద్ద ఉన్న రాళ్లవాగు కూడా ఉధృతంగా పారుతుండడంతో మధ్యాహ్నం వరకు కావలి–కందుకూరు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉలవపాడు మండలంలో బద్దిపూడి–మాచవరం మధ్య ఉన్న ఉప్పుటేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మన్నేటికోట–ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రవాగు ఉధృతంగా పారుతోంది. దీంతో చుట్టుగుంటకు రాకపోకలు నిలిచిపోయాయి. -
బలహీనపడిన అల్పపీడనం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతం, ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి పరిసర ప్రాంతాలపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం శనివారం అల్పపీడనంగా బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అయితే, అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, కేరళ మీదుగా ప్రయాణించి ఆదివారం తూర్పు మధ్య అరేబియా సముద్రంలో విలీనమవుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్రలో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈ నెల 16న ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింది. కాగా, అల్పపీడనం ప్రభావంతో శనివారం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కారేడులో 5.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పొదిలి, కావలి, చీమకుర్తి, లింగసముద్రం, ఉలవపాడు, నగరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. -
IND VS ENG: సెమీస్ మ్యాచ్‌కు వర్షం ముప్పు..? రద్దయితే ఫైనల్‌కు టీమిండియా
టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య అడిలైడ్ వేదికగా ఇవాళ (నవంబర్ 10) రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం 1: 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు వర్షం ముంపు పొంచి ఉందని స్థానిక వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అడిలైడ్, పరిసర ప్రాంతాల్లో నిన్న రాత్రి వర్షం కురిసిందని, ఇవాళ ఉదయం కూడా ఉరుములు, మెరుపులతో 40 శాతం మేరకు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని అడిలైడ్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వార్త తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ అభిమానులకు ఈ వార్త అస్సలు సహించడం లేదు. ఎందుకంటే.. ఒక వేళ వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్ రద్దైతే, రిజ్వర్ డేలో మ్యాచ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. వర్షం కారణంగా మ్యాచ్ అప్పుడు కూడా సాధ్యపడకపోతే.. గ్రూప్ దశలో టాపర్‌గా ఉన్న జట్టును (భారత్) విజేతగా ప్రకటిస్తారు. ఇప్పుడు ఇదే అంశం ఇంగ్లండ్ జట్టును, ఆ దేశ అభిమానులను కలవరపెడుతుంది. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్.. న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఒకవేళ వర్షం పడకుండా ఇవాల్టి మ్యాచ్ సజావుగా సాగితే.. ఈ మ్యాచ్ విజేత నవంబర్ 13న పాకిస్తాన్‌తో టైటిల్ పోరులో తలపడనుంది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు అల్పపీడన ద్రోణి మధ్య బంగాళాఖాతం నుంచి ఉపరితల ఆవర్తన ప్రాంతం వరకు కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ 12వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలకు విస్తరిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. ఈ ప్రభావంతో గురువారం ఉత్తర కోస్తాలో అక్కడక్కడ, దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్ర, శనివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని వివరించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తీరం వెంబడి గంటకు 40–45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపింది. తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. -
ఏపీకి మరో అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న భూమధ్య రేఖా ప్రాంతంలోని హిందూ మహాసముద్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో గురువారం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. అనంతరం ఈ అల్పపీడనం 11వ తేదీ వరకు వాయవ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు కదులుతుందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో ఈనెల 11, 12 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. అల్పపీడనం కారణంగా కోస్తా తీరం వెంబడి గంటకు 45–55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఫలితంగా సముద్రం అలజడిగా మారుతుందని తెలిపింది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. -
10, 11 తేదీల్లో గాలులు, వానలు
సాక్షి, విశాఖపట్నం: మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ వానలు మొదలుకానున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో బుధవారం (రేపు) అల్పపీడనం ఏర్పడిన తరువాత ఈ వర్షాలు మరింత ఊపందుకోనున్నాయి. ఈ అల్పపీడనం వాయవ్యదిశగా తమిళనాడు, పుదుచ్చేరిల వైపు పయనించనుంది. దీని ప్రభావంతో బుధవారం ఒకటిరెండు చోట్ల తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉందని, ఈనెల 10వ తేదీ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. 11వ తేదీ నుంచి కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో వీచే ఈదురుగాలులతో సముద్రం అలజడిగా మారుతుందని, అందువల్ల మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. సోమవారం విజయనగరం, శ్రీసత్యసాయి, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, అనంతపురం జిల్లాల్లో చిరుజల్లులు కురిశాయి. -
9న అల్పపీడనం.. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో 9న ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దక్షిణ కోస్తా, రాయలసీమపై కొద్దిపాటి ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అధికారుల అంచనా. శ్రీలంక తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం.. వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. 48 గంటల్లోనే బలహీనపడి పుదుచ్చేరి, చెన్నై మధ్య 11, 12 తేదీల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం తమిళనాడు చెన్నై పైనే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఏపీలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కెల్లా కర్నూలులో అత్యధికంగా 33.8(+2.2) డిగ్రీల పగటి ఉష్ణోగ్రత రికార్డయింది. -
దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లులు
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాలో అక్కడక్కడా ఆదివారం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు లేవు. అయినా ఆదివారం దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని, సోమ, మంగళవారాల్లో రాష్ట్రమంతా పొడి వాతావరణం ఉంటుందని, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో 2.6, చిత్తూరు జిల్లా గుడిపాలలో 2.1 సెం.మీల వర్షపాతం నమోదైంది. -
రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/వాకాడు (తిరుపతి): కోస్తా, తమిళనాడు, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న రెండు రోజులపాటు ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. బుధవారం రాష్ట్రంలోని నెల్లూరు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నెల్లూరుజిల్లా తోటపల్లి గూడూరులో 4.3, తిరుపతి జిల్లా కోటలో 3.6, అనంతపురం జిల్లా గుంతకల్లులో 3.2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. తీరంలో రెడ్ అలర్ట్ రెండు రోజులుగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాకాడు సముద్ర తీరంలో వర్షాలతోపాటు చలి గాలులు, అలల ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో తీరప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండలాలకు చెందిన రెవెన్యూ, పోలీసు, మెరైన్ అధికారులు ఇప్పటికే తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. అలాగే లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మత్స్యకారులు తమ వేట నిలిపేసి సామాగ్రిని ఒడ్డున భద్రపరిచారు. మెరైన్ పోలీసులు తీరంలో నిఘా ఉంచారు. -
Rain Forecast: వచ్చే రెండు రోజులు వర్షాలు
సాక్షి,అమరావతి: రాబోయే రెండ్రోజులూ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో శ్రీలంక తీరప్రాంతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో బుధవారం పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో గురువారం అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇక మంగళవారం అనంతపురం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో 13 సెం.మీ., అనంతపురం జిల్లా కనేకల్‌లో 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా మల్లంలో 7.9, వాకాడులో 5.7, పూలతోటలో 4.1, గునుపూడులో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
అల్పపీడనం ఎఫెక్ట్.. ఐదు రోజుల్లో ఏపీకి అతి భారీ వర్ష సూచన
సాక్షి, అమరావతి: కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, చెరువులు పూర్తి స్థాయిలో నిండి అలుగులు పారుతున్నాయి. ఈ క్రమంలో ప్రజా రవాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలుచోట్ల కాలనీలు సైతం నీట మునుగుతున్నాయి. కాగా, అక్టోబర్ 20వ తర్వాత ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరించింది. అయితే, ఈ నెల 20న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం, అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారి ఏపీ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో, రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. గుంటూరు జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తోంది. కాగా.. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇక, బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ముంపు ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణా నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని విపత్తుల సంస్థ హెచ్చరించింది. -
‘జడి’పించి..దంచికొట్టి
సాక్షి, హైదరాబాద్: పొద్దున్నుంచి ఎండగా ఉంది.. వేడి, ఉక్కపోత అనిపించింది.. మధ్యాహ్నానికీ ఎండ ముదిరింది.. సాయంత్రం ఓ వైపు ఎండ పడుతుండగానే మరోవైపు నుంచి వాన కమ్ముకొచ్చింది. కాసేపట్లోనే జడివానగా మారింది. పెద్ద చినుకులతో, వేగంగా కురిసిన వానతో పది నిమిషాల్లోనే రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఉదయం నుంచి పొడిగానే ఉందన్న ఉద్దేశంతో రోడ్లమీదికి వచ్చిన వాహనదారులంతా ఆగమగం అయ్యారు. రోడ్ల పక్కన బైకులు ఆపేసి.. దుకాణాల ముందు, ఫ్లైఓవర్లు, మెట్రోపిల్లర్ల కింద ఆగిపోయారు. అదే సమయంలో రోడ్ల మీద మోకాలిలోతు నీరు నిలవడం, మ్యాన్ హోళ్ల నుంచి నీరుపైకి తన్నడంతో కార్లు, బస్సులు వంటి వాహనాలూ ఆగిపోయాయి. దీనితో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తంగా రెండు గంటల పాటు ఆగకుండా కురిసిన వానతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి నీళ్లు వచ్చాయి. ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ కూకట్పల్లి, మాదాపూర్, మూసాపేట, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మెహిదీపట్నం, అత్తాపూర్, ఆరాంఘర్, నాగోల్ తదితర రద్దీ ప్రాంతాలన్నింటా వాన కారణంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మెహిదీపట్నం నుంచి శంషాబాద్‌కు వెళ్లే పీవీ ఎక్స్‌ప్రెస్ వే మీద కూడా వాహనాలు నిలిచిపోయాయి. అబిడ్స్, నాంపల్లి, సుల్తాన్‌బజార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, ఉస్మాన్‌గంజ్, ధూల్‌పేట్, ఆగాపురా, జాంబాగ్ తదితర ప్రాంతాల్లో రహదారులపై నీళ్లు నిలిచాయి. పలుచోట్ల వాహనాల ఇంజన్లలోకి నీళ్లు చేరి మొరాయించాయి. ఫిలింనగర్ నుంచి మొదలు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, సోమాజిగూడ, ఖైరతాబాద్ వరకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇక శనివారం రాత్రిపూట బండ్లగూడ కార్పొరేషన్, మణికొండ, నార్సింగి, శంషాబాద్ మున్సిపాలిటీల పరిధిలో భారీ వర్షం కురిసింది. నిలిచిన విద్యుత్ సరఫరా భారీ వర్షానికి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల కాసేపటికి పునరుద్ధరించినా.. మరికొన్ని చోట్ల అర్థరాత్రి దాటే వరకూ మరమ్మతులు చేయలేదు. దీనితో పలు ప్రాంతాలు అంధకారంలోనే ఉండిపోయాయి. సెంట్రల్ సర్కిల్ పరిధిలోని ఐదు ఫీడర్లు, బంజారాహిల్స్ సర్కిల్లో నాలుగు, సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో ఒకటి, హైదరాబాద్ సౌత్ సర్కిల్ పరిధిలో 4 ఫీడర్లు ట్రిప్పయ్యాయి. వర్షం వెలిసిన వెంటనే అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు. చాలాచోట్ల ఐదు సెంటీమీటర్లకుపైనే.. శనివారం సాయంత్రం ఐదున్నర, ఆరు గంటలకు మొదలైన వాన.. రెండు గంటల పాటు దంచి కొట్టింది. చాలా ప్రాంతాల్లో ఈ రెండు గంటల్లోనే ఐదారు సెంటీమీటర్లకుపైనే వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల పది సెంటీమీటర్లకుపైగా కురిసింది. పరీవాహక ప్రాంతంలో వానలు పడుతుండటంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట) జలాశయాలకు వరద పెరిగింది. దీనితో రెండు చొప్పున గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ముందే హెచ్చరించినా.. శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా.. జీహెచ్ఎంసీ, ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు చేపట్టడంలో విఫలమయ్యాయన్న విమర్శలు వస్తున్నాయి. -
ఏపీకి భారీ వర్ష సూచన.. వచ్చే నాలుగు రోజులు జాగ్రత్త!
సాక్షి, అమరావతి: గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో, ఏపీ నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే, అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని అధికారులు స్పష్టం చేశారు. #IMD : The cyclonic circulation over Westcentral Bay of Bengal off Andhra Pradesh coast persists. Ø Another cyclonic circulation lies over Northeast Bay of Bengal . It is very likely to merge with above system on 03rd October, 2022.#AndhraPradesh #Odisha — Natarajan Ganesan (@natarajan88) October 2, 2022 -
ఈ ఆరు జిల్లాల్లో అతిభారీ వర్షం.. వాతావరణ శాఖ వార్నింగ్!
కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు, తెలంగాణలో సైతం ఎడతెరిపిలేని వానలు పడుతున్నాయి. కాగా, రాగల మూడు రోజుల్లో తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇందులో భాగంగా, శుక్రవారం వరకు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. మరోవైపు.. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొమురంభీమ్ ఆసిఫాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. pic.twitter.com/Zgzs9NCqwN — IMD_Metcentrehyd (@metcentrehyd) September 29, 2022 -
AP Rain Alert: కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం.. రానున్న మూడు రోజులు
సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం కోస్తాంధ్రపై ఆవరించి ఉంది. అదే సమయంలో ఉత్తర అండమాన్ నుంచి మధ్య బంగాళాఖాతం మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరం వరకు తూర్పు–పశ్చిమ ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ బుధవారం రాత్రి ఓ నివేదికలో తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. -
మూడు రోజులు వానలు
సాక్షి, విశాఖపట్నం: కొద్దిరోజుల నుంచి రాష్ట్రంలో చెదురుమదురుగా కురుస్తున్న వర్షాలు మంగళవారం నుంచి విస్తారంగా కురవనున్నాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడురోజులు కోస్తాంధ్రలో అనేక చోట్ల, రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో అత్యధికంగా 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళగిరిలో 7.7 సెంటీమీటర్లు, ఎచ్చెర్లలో 7.6, మనుబోలులో 7.4, మారేడుమిల్లిలో 6.1, బాలాయపల్లిలో 5.8, విజయవాడ, గుడివాడల్లో 5.3, రావికమతంలో 4.6, పెదకూరపాడులో 4.6, మామిడికుదురు, బుక్కపట్నం, నూజివీడుల్లో 4.4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. -
బెంగాల్ వైపు మళ్లిన అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం వైపు మళ్లింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా పయనించనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి తెలిపింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అల్పపీడనం పశ్చిమ బెంగాల్ వైపు మళ్లడంతో మంగళవారం రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/సాక్షి, రాజమహేంద్రవరం: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఇది కొనసాగుతోంది. ఇది మంగళవారం నాటికి మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఆ తర్వాత ఒడిశా మీదుగా మధ్యప్రదేశ్ వైపు ప్రయాణించి క్రమేపీ బలహీనపడుతుందని వాతావరణ శాఖ, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపాయి. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. తీరం వెంట గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. మిగిలిన కోస్తా జిల్లాల్లో, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు అల్పపీడన ప్రభావంతో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురిశాయి. ఏలూరు నగరంతోపాటు దెందులూరు, ఉంగుటూరు, కైకలూరు నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం ఉదయం దాదాపు మూడు గంటల పాటు కుండపోతగా వర్షం కురవడంతో రహదారులు ఏరులను తలపించాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఏలూరు జిల్లాలో సోమవారం ఉదయం 8.30 నుంచి రాత్రి వరకు ఆయా మండలాల్లో కురిసిన వర్షపాతం ఇలా ఉంది.. ఏలూరు 113.6, వేలేరుపాడు 46.2, దెందులూరు 26.4, టి.నర్సాపురం 26, కుక్కునూరు 24.6, భీమడోలు 24, లింగపాలెం 22.8, చాట్రాయి 21.2, కొయ్యలగూడెం 20, పెదవేగి 18.6, ముసునూరు 18.4, కైకలూరు 18.4, కలిదిండి 17.2, నూజివీడు 16.8, ముదినేపల్లి 16.4, ద్వారకా తిరుమల 15.4, నిడమర్రు 15.2, మండవల్లి 14.6, గణపవరం 13.4, చింతలపూడి 13.2, పోలవరం 13.2, బుట్టాయగూడెం 12.6, కామవరపుకోట 12.4, పెదపాడు 10.6, ఉంగుటూరు 10.4, జంగారెడ్డిగూడెం 10.2, జీలుగుమిల్లి 7.8, ఆగిరిపల్లి 5.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 15.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ విస్తారంగా వానలు పడ్డాయి. తూర్పుగోదావరిలో సగటు వర్షపాతం 9.5 మిల్లీమీటర్లుగా నమోదైంది. కాకినాడ జిల్లా తీర మండలాల్లోనూ భారీ వర్షం పడింది. ఏలూరు ముంపు ప్రాంతాల సమస్యకు ప్రభుత్వం చెక్ గతంలో వర్షాకాలం వస్తోందంటే ఏలూరు నగర ప్రజలు గుండెలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి వారిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం బయటపడేసింది. ఏలూరు నగరాన్ని దాదాపు చుట్టి ఉన్న తమ్మిలేరుకు ఏటా వర్షాకాలంలో వరదలు వచ్చేవి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నగర ప్రజల సమస్యను నాటి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని వైఎస్సార్ దృష్టికి తెచ్చారు. దీనిపై వైఎస్సార్ తక్షణమే స్పందించి తమ్మిలేరు ఏటిగట్టును పటిష్టపరచడానికి రిటైనింగ్ వాల్ నిర్మించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా వెంటనే నిధులను కూడా విడుదల చేశారు. రూ.78 కోట్ల అంచనా వ్యయంతో తమ్మిలేరు ఏటిగట్టుకు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించారు. కొంతమేర రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు జరిగాయి. అనంతరం వైఎస్సార్ ఆకస్మిక మరణం, అనంతరం వచ్చిన ప్రభుత్వాలతోపాటు గత టీడీపీ ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని నిలిపివేశాయి. దీంతో నగర ప్రజల కష్టాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. 2019లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆళ్ల నానిని ఉప ముఖ్యమంత్రి పదవిలో నియమించారు. దీంతో తమ్మిలేరు రిటైనింగ్ వాల్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వడివడిగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఏలూరు అశోక్‌నగర్ నుంచి వైఎస్సార్ కాలనీ వరకు 4.3 కిలోమీటర్ల మేర తమ్మిలేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయింది. మరో 700 మీటర్ల మేర పనులు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయి. దీంతో నగర ప్రజలకు తమ్మిలేరు వరద ప్రమాదం తొలగిపోయింది. అదేవిధంగా కృష్ణా వరదలతో విజయవాడ నగరంలోని కృష్ణలంక, రామలింగేశ్వర నగర ప్రాంతాలకు కూడా గతంలో వరద ముప్పు పొంచి ఉండేది. ఈ సమస్యకు కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిష్కారం చూపింది. కృష్ణాలో ఆ ప్రాంతాలకు వరదల నుంచి రక్షణకు గోడ నిర్మించింది. -
బలహీనపడిన వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, విదర్భపై ఉన్న వాయుగుండం సోమవారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఇది మధ్యప్రదేశ్ మీదుగా వాయవ్య దిశగా కదులుతూ కొద్ది గంటల్లో మరింత బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు అల్పపీడన ప్రాంతం మీదుగా ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించింది. అదే సమయంలో రాష్ట్రంపైకి నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. మంగళవారం తీరం వెంబడి గంటకు 45–55.. గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు ఈనెల 18న ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు కురిశాయి. చింతూరులో 4 సెంటీమీటర్లు, వీరఘట్టంలో 3.3, జియ్యమ్మవలసలో 3.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
AP: ఈ జిల్లాలకు ఉరుములు, మెరుపులతో భారీ వర్ష సూచన
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. దీంతో, ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్ప పీడనం ప్రభావంతో కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తీరం వెంబడి గంటలకు 45 కిలోమీటర్ల వేగంలో గాలులు వీచే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలని వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అక్కడక్కడా భారీవర్షాలు కురవగా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. గడచిన 24 గంటల్లో పాలకోడేరులో 14 సెంటీమీటర్లు, నూజివీడులో 11, సెట్టిగుంటలో 10.3, పూసపాటిరేగ, బలిజపేటల్లో 9, భీమడోలు, భీమవరం, కళింగపటా్నల్లో 8, ఆళ్లగడ్డలో 7.8, ఇబ్రహీంపట్నంలో 7.4, చింతలపూడి, తెర్లాం, జియ్యమ్మవలసల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
బలపడిన అల్పపీడనం.. మరో రెండు రోజులు రాష్ట్రంలో వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఆదివారం సాయంత్రానికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది పశ్చిమ మధ్య – వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్య కేంద్రీకృతమైంది. ఇది శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం, దక్షిణ ఒడిశా ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది సగం సముద్రం, సగం భూమిపై కొనసాగుతుండటంతో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం ప్రభావం వల్ల సముద్రంవైపు ఉన్న తేమ అంతా మేఘాల ద్వారా భూమిపైకి విస్తరించి భారీ వర్షాలకు కారణమవుతున్నట్లు తెలిపారు. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అలాగే సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి తూర్పు ఆగ్నేయ దిశగా దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా బంగాళాఖాతంపై ఉన్న అల్పపీడన కేంద్రం గుండా వెళుతోంది. అరేబియా సముద్రంలో ఉన్న మరో అల్పపీడన ద్రోణి ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర వరకు విస్తరించి ఉంది. మరో 2 రెండు రోజులు వర్షాలు అల్పపీడనం, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాస్తవానికి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ అది వాయుగుండంగా మారేందుకు అనువైన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 11వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గోవిందపురంలో 9 సెంటీమీటర్ల వర్షం శనివారం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గోవిందపురంలో 9 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దళపతిగుడలో 8.7, శ్రీకాకుళంలో 8.5, పల్నాడు జిల్లా చాగల్లులో 8.3, అల్లూరి జిల్లా శరభన్నపాలెంలో 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో 6 సెంటీమీటర్లు, అంబేడ్కర్ కోనసీమ జిల్లా శివకోడులో 5.6, అనకాపల్లి జిల్లా కోరుప్రోలులో 5.2, పశ్చిమగోదావరి జిల్లా వేగివాడలో 5.1, మొగల్తూరులో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విజయవాడ, పరిసరాల్లో భారీ వర్షం పడింది. రాష్ట్రంలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో మహేంద్ర తనయ గెడ్డ పొంగడంతో శనివారం హొన్నాళి గ్రామానికి చెందిన విశ్వనాథ్ లెంకా (20) అనే యువకుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. విశాఖ జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. తగరపువలస, ఆనందపురం, కొమ్మాది, పద్మనాభం, మధురవాడ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. అనకాపల్లి జిల్లాలో జోరు వాన కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మూడురోజుల్లో జిల్లావ్యాప్తంగా 76.28 సెండీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. -
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. శనివారం నాటికి...
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది శనివారంనాటికి ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలకు చేరువలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో అనేక చోట్ల విస్తారంగా, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి వెల్లడించింది. శుక్రవారం ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది. శనివారం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉందని వివరించింది. ఆదివారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రానున్న నాలుగు రోజులు కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. పిడుగులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. -
బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశాలున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 2, 3 రోజులు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్రపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆరెంజ్ వార్నింగ్‌ను జారీ చేసింది. 10వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన వారు తిరిగి వెనక్కి రావాలని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని, రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందని, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని ఐఎండీ తెలిపింది. వరి, అరటి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపింది. వీటిని దృష్టిలో ఉంచుకుని యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని చెప్పింది. ప్రజలు శిథిల భవనాలు/ఇళ్లలో ఉండవద్దని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. చెరువులు, కాలువలు, నదులు, విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలని సూచించింది.