Sakshi News home page

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. కేటీఆర్‌ కీలక ఆదేశాలు

Published Wed, Jul 5 2023 8:55 PM

Heavy Rain Forecast For Hyderabad During The Weekend - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా వ్యాపించాయి. ఇక, ఇప్పటి వరకు తెలంగాణవ్యాప్తంగా ఓ మోస్తరు వానలు మాత్రమే కురిశాయి. మరోవైపు.. ఈ వారాంతం నుంచి పలు జిల్లాలు, హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో, మంత్రి కేటీఆర్‌.. జీహెచ్‌ఎంసీ అధికారులను హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 

కాగా, జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఇటీవ‌ల ప్రారంభించిన వార్డు కార్యాల‌యాల వ్య‌వ‌స్థ‌పై మంత్రి కేటీఆర్ బుధ‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న‌ను అధికారుల ద్వారా మంత్రి తెలుసుకున్నారు. ఈ స‌మావేశంలోనే వ‌ర్షాల‌పై కూడా కేటీఆర్ స‌మీక్షించారు. ఈ క్రమంలో వర్షాకాలం నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.

వారాంతం నుంచి హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అంతర్గత విభాగాలతో పాటు ఇతర శాఖలతో కలిసి వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను కోరిన కేటీఆర్‌.. అత్యంత కీలకమైన పారిశుద్ధ్య కార్మికులతో సమావేశాలు  ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. 
 

Advertisement

What’s your opinion

Advertisement