కామారెడ్డిలో మళ్లీ వర్షం.. రెండు గంటల పాటు అలర్ట్‌ | IMD Issues Heavy Rainfall Alert For Telangana And AP Updates Viral Videos Inside | Sakshi
Sakshi News home page

Heavy Rains Updates: టీజీ, ఏపీ దంచికొడుతున్న వానలు.. మరో అల్పపీడనం

Aug 29 2025 7:54 AM | Updated on Aug 29 2025 12:33 PM

Rain Forecast In Telangana And AP Updates

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అప్‌డేట్స్‌.. 

కామారెడ్డిలో మళ్లీ వర్షం.. 

  • కామారెడ్డిలో మళ్లీ వర్షం మొదలైంది. 

  • రానున్న రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం. 

  • ఇప్పటికే వరద గుప్పిట్లో పలు కాలనీలు, 

  • వరద నీటిలో ఉప్పొం‍గతున్న చెరువులు, నాలాలు..

  • జల దిగ్బందంలో బోధన్‌ నియోజకవర్గంలో పలు గ్రామాలు. 

  • పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. 

  • పూర్తిగా నీట మునిగిన ఏడు పాయల ఆలయం. 

జల దిగ్బంధంలో ఏడు పాయల ఆలయం

  • 15 రోజులుగా జల దిగ్బంధంలో ఏడు పాయల వనదుర్గ ఆలయం
  • గర్భ గుడి ముందు నుంచి రేకులను తాకుతూ ఉద్ధృతంగా ప్రవాహం
  • రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవారి దర్శనం
  • ఆనకట్ట వైపు భక్తులు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు


కోతకు గురైన జాతీయ రహదారి

  • పోచారం ఉద్ధృతికి కోతకు గురైన జాతీయ రహదారి
  • కామారెడ్డి- మెదక్‌ మధ్య నిలిచిన రాకపోకలు
  • పోచారం ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు
  • ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టిన ఆర్మీ అధికారులు
  • ఉమ్మడి మెదక్ జిల్లాలో తగ్గిన వరద ఉద్ధృతి
  • మెదక్‌ జిల్లాలో వరదల దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు
  • దూప్‌సింగ్‌తండాలో కొనసాగుతున్న సహాయక చర్యలు
  • సహాయ చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు


మంత్రి సీతక్క టెలీకాన్ఫరెన్స్

  • భారీ వర్షాలతో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రహదారులపై మంత్రి సీతక్క టెలీకాన్ఫరెన్స్
  • రాష్ట్రంలో 1,291 ప్రాంతాల్లో దెబ్బతిన్న గ్రామీణ రోడ్లు, కల్వర్టులు
  • రూ.374 కోట్ల నష్టం వాటిలినట్లు నివేదించిన అధికారులు
  • తాత్కాలిక మరమ్మత్తుల కోసం రూ.22.71 కోట్లు అవసరమని ప్రాథమిక అంచనా
  • శాశ్వత మరమ్మత్తుల కోసం రూ.352 కోట్లు అవసరమని ప్రాథమిక అంచనా
  • 22 గ్రామాలకు రాకపోకలు దెబ్బతినగా 14 గ్రామాలకు పునరుద్ధరణ
  • త్వరగా రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశాలు

 

ఉధృతంగా మూసీ..

  • యాదాద్రి భువనగిరి..
  • భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు-రుద్రవెల్లి గ్రామాల మధ్య  పొంగిపొర్లుతున్న మూసీ..
  • ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పెరిగిన మూసీ వరద
  • జూలూరు- రుద్రవెల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం.
  • వరద ప్రవాహం ఎక్కువ కావడంతో బారికేడ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పోలీసులు..
  • ఉస్మాన్‌సాగర్‌ ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
  • మంచిరేవుల బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తు‍న్న నీరు.. 

 

నిజామాబాద్ జిల్లా..

  • శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
  • 39 గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదిలిన అధికారులు
  • ప్రస్తుత ఇన్ ఫ్లో 4,30,000
  • ఔట్ ఫ్లో 5,29,822 క్యూసెక్కులు
  • ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 80.5 టీఎంసీలు
  • ప్రస్తుతం 1086 అడుగులు 64 టీఎంసీలు
     

తెలంగాణకు మళ్లీ టెన్షన్‌.. 

  • సెప్టెంబర్‌ మూడో తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.

  • అల్పపీడన ప్రభావంతో తెలంగాణకు భారీ వర్ష సూచన. 

  • ఉత్తర తెలంగాణపై తీవ్ర ప్రభావం. 

Heavy Rain in Visakhapatnam Today21 

👉రికార్డు స్థాయి వర్షాలతో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో దంచికొట్టిన వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. భారీ వర్షంతో పోటెత్తిన వరద ప్రవాహానికి, పలుచోట్ల చెరువులు, రోడ్లు తెగిపోయాయి. రహదారులు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలను వరద చుట్టుముట్టడంతో ఇళ్లు జలమయ్యాయి.

Heavy Rain in Visakhapatnam Today21

👉ఉమ్మడి మెదక్ జిల్లాలో కురిసిన జోరు వానలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. చెరువులు మత్తళ్లు దూకుతుండటంతో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లు, కల్వర్టులు తెగిపోవడంతో అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. గజ్వేల్‌, సిద్దిపేట నియోజకవర్గాల్లో పలు చెరువులకు గండ్లు పడి వేలాది ఎకరాల పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసరాల తడవడంతో ఆందోళన చెందుతున్నారు.

👉ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల జలదిగ్బంధంలోనే ఉంది. నదీ పాయలు ఉద్ధృతంగా ఉరకలెత్తుతుండటంతో అమ్మవారి ఆలయ మండపాన్ని తాకుతూ నీరు ప్రవహిస్తోంది. ఎల్లాపూర్ బ్రిడ్జిపై వరద పొంగుతుండటంతో మెదక్ - బొడ్మట్‌పల్లి రహదారికి రాకపోకలు బంద్ అయ్యాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. హవేలీ ఘనపూర్ మండలం రాజ్ పేట వద్ద నిన్న వరదలో చిక్కుకున్న 10 మందిని రెస్క్యూ టీమ్‌ కాపాడగా రాజ్ పేట గ్రామానికి చెందిన మరో ఇద్దరు గల్లంతయ్యారు. రేగోడ్ మండలం మర్పల్లి గ్రామంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు అవస్థలు పడ్డారు. భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం షమ్నాపూర్ దగ్గర రైల్వే ట్రాక్ కుంగడంతో మెదక్‌, అక్కన్నపేట మధ్య రాకపోకలు రద్దు చేశారు.

👉మరోవైపు.. ఏపీలో రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆరు జిల్లాలో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది విశాఖ వాతావరణ కేంద్రం. కోస్తా తీరంలో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. కోస్తా జిల్లాల్లోని ప్రధాన ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశామన్నారు.

👉అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల జోరువానలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలతో జనానికి అవస్థలు తప్పడం లేదు. వాగులు ఉప్పొంగగా పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.

👉దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో ప్రస్తుతం 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజ్‌ వద్ద ప్రస్తుతం 4.37 లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరింది. 69 గేట్ల ద్వారా 4.27 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి, తుంగభద్ర నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement