Rain Forecast For 4 Days In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

Rain Alert: కోస్తా జిల్లాల్లో ఈదురు గాలులు, వర్షాలు

Aug 17 2023 6:14 PM | Updated on Aug 17 2023 6:34 PM

Rain Forecast For 4 Days In Andhra Pradesh - Sakshi

దీని ప్రభావంలో కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం దాని అనుకొని తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఆవరించి ఉంది. రేపు అల్పపీడనంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంలో కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

తీరం వెంబడి గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు ఈ రోజు నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఏపీ తీరం వెంబడి చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
చదవండి: ఏపీ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల

రాగల మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురవనున్నాయి. రేపు(శుక్రవారం), ఎల్లుండి(శనివారం) అక్కడక్కడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. మూడు రోజులు  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో  ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాగల 12 గంటల్లో  అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే పశ్చిమ, వాయువ్య  దిశల నుంచి తెలంగాణ  వైపు గాలులు వీస్తుండగా.. మూడు రోజులపాటు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement