తెలంగాణలో ఐదు జిల్లాలకు హెచ్చరిక.. అతి భారీ వర్షసూచన | Heavy Rain Forecast To Telangana Five Districts | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఐదు జిల్లాలకు హెచ్చరిక.. అతి భారీ వర్షసూచన

Sep 13 2025 10:39 AM | Updated on Sep 13 2025 10:50 AM

Heavy Rain Forecast To Telangana Five Districts

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పలు ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శనివారం ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మరో 19 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నిర్మల్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌.. 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

Heavy rains lash in Hyderabad roads waterlogged and traffic disrupted photos16

ఇక, అంతకుముందు.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. ఆదివారం మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాల ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని తెలిపింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement