వరంగల్‌లో దంచికొట్టిన వర్షం.. ‍ప్రాణ భయంతో ప్రయాణికుల కేకలు.. | Heavy Rain Fall In Warangal District, People Facing Severe Difficulties After Flood Water Reached Colonies | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో దంచికొట్టిన వర్షం.. ‍ప్రాణ భయంతో ప్రయాణికుల కేకలు..

Sep 7 2025 10:48 AM | Updated on Sep 7 2025 12:33 PM

Heavy rain Fall In Warangal District

సాక్షి, వరంగల్‌: వరంగల్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కుండపోత వర్షం కురిసింది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా పలు కాలనీలు జలమయం కాగా.. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి పూర్తిగా జలమయమైంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లాలో శనివారం అర్థరాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. హనుమకొండలోని అంబేద్కర్ భవన్ రోడ్డు, తిరుమల జంక్షన్‌లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అండర్ బ్రిడ్జి దగ్గర వరదలో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. మోకాళ్ల లోతు మేరకు వరద నీరు నిలిచిపోవడంతో అతి కష్టం మీద ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. దీంతో, ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో కాలనీల్లోకి వరద నీరు చేరుకుంది. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

భారీ వర్షం కారణంగా వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి కిందికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అది గుర్తించకుండా వెళ్లిన రెండు ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. అందులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో మిల్స్ కాలనీ పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాడు సాయంతో బస్సుల్లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీశారు. అన్నారం, మహబూబాబాద్‌ నుంచి వచ్చిన ఈ బస్సుల్లో సుమారు వంద మంది ప్రయాణికులు ఉన్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement